నిర్మలా సీతారామన్ కు ఉద్వాసన, కామత్ కు చోటు: దెక్కన్ హెరాల్డ్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. ఐసిసిఐ బ్యాంక్ మాజీ చెయిర్మన్ కుందాపూర్ వి కామత్ (72) కొత్త ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వకీరిస్తారని దెక్కన్ హెరాల్డ్ రాసింది.
దేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంలో ప్రతిభావంతంగా పని చేయలేకపోతున్నదన్న విమర్శ సీతారామన్ ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ మధ్య ఆమెని ప్రధాని కూడా దూరంగా ఉంచారని వార్తలొచ్చాయి.
దీనికి సాక్ష్యంగా జనవరి 6 తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పారిశ్రామిక వేత్తలతో నీతిఆయోగ్ లో నిర్వహించిన సమాశంలో చాలా మంది కేంద్ర మంత్రులున్నా సీతారామన్ కనిపించడం ఈ ఊహాగానాలకు ప్రాణం పోసింది. ప్రధాని కీలకమయిన ఆర్థిక సమావేశం నిరర్వహిస్తూ ఉంటే ఆమె మాత్రం బిజెపి కేంద్ర కార్యాలయంలో బడ్జెట్ గురించి పార్టీనేతలు సంప్రదిస్తూ ఉన్నారు.
అప్పటినుంచి ఆమె భవిష్యత్తు అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. అయితే, చాలా మంది ఈ సమావేశానికి హాజరయిన రైల్వే వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రి అవుతారని అనుకున్నారు. అయితే, ఇపుడ కామత్ పేరు వచ్చింది. కామత్ చాలా కాలంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చైనా కేంద్రం పనిచేస్తున్న బ్రిక్స్ బ్యాంక్ కు చెయిర్మన్ గా ఉన్నారు. తొందర్లోనే ఆయన ఈ పదవినుంచి రిటైర్ అవుతున్నారు.
సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెడారని, అనంతరం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల విరామంలో కామత్ ఆర్థిక మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని దెక్కన్ హెరాల్డ్ రాసింది.