రాయలసీమకు నీళ్లందకుండా పోతున్నా ఎవరూ మాటాడరేం?: బొజ్జా దశరథ్ రెడ్డి (వీడియో)

ప్రభుత్వాలు మారినా నీటి పారుదల విషయంలో రాయలసీమ పట్ల పాలకుల దృక్పథం మారలేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా ధశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రమేమిటంటే రాయలసీమ కు అందకుండా క్రిష్ణ నీరు కిందికి పారుతున్నా రాయలసీమ ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదని ఆయన అంటున్నారు.
‘కరువుసీమ ప్రజలపై దశాబ్దాలుగా  పార్టీలేవలయినా ప్రభుత్వం మీద  వివక్ష చూపుతున్నాయి. ఇదేవిధంగా  శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎంత నీరు ప్రవహిస్తున్నా, దిగువకు నీటిని తోడేస్తున్నారు తప్ప రాయలసీమ ప్రాజక్టుల అందించడం లేదు. విచిత్రమేమిటంటే, రాయలసీమకు అందకుండా  పక్కనుంచే  ఇంత నీరు  కిందికి పారుతున్నా రాయలసీమ ప్రజాప్రతినిధులెవరూ నోరు మెదపడం లేదు.
‘రాయలసీమకు మరణశాసనమైన G.O.నెంబరు 69 ని తక్షణమే రద్దు చేయాలి. శ్రీశైలం నుండి నీటి విడుదల విషయంలో సీమ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలని’ దశరథ్ రామిరెడ్డి రైతన్నలకు పిలుపునిచ్చారు.
ఆయనేమంటున్నారో వీడియో చూడండి
(బొజ్జా దశరథరామిరెడ్డి,అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి, నంద్యాల.9848040991)