కన్నా లక్ష్మినారాయణ ఫోన్ ట్యాప్ చేస్తున్నారా?

బిజెపి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినాారాయణను నియమించడం టిడిపిని ఇరుకున పెట్టింది. ఎందుకంటే, కన్నా లక్ష్మినారాయణ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని బద్ధ శత్రువుగా చూస్తారు. రాజకీయాలకు తోడు కాపు, కమ్మ కుల వైరం కూడా తోడయింది. దానికి తోడు కన్నా  బాగా నోరున్న మనిషి. గుంటూరు జిల్లాలోనే కాదు, కాపులున్న జిల్లాలన్నింటిలో అనుచరులున్న వాడు.  ఇలా జనబలం,ధనబలం రెండు వున్నవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ బిజెపికి అధ్యక్షుడు కాలేదు. ఒక వర్గం కాపుల్లో కన్నా నియామకం బాగా ఉత్సాహం నింపింది. దీనితో కన్నాను ఇరుకున పెట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని చెబుతున్నారు. ఇందులో భాగంగాకన్నా టెలిఫోన్ ట్యాపింగ్ జరపుతున్నదని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు తెలుసుకోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి పెద్ద పనికాదు. అంటే, కన్నా ఎవరితో మాట్లాడుతున్నాడు, టిడిపి నాయకులతో కూడా టచ్ లో ఉన్నాడా,  ఏమ్మాట్లాడుతున్నాడు, ఎక్కడెక్కడ తిరాగాలనుకుంటున్నాడు వంటి విషయాలు తెలుసుకుని ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉంది. టెలిఫోన్ చేయడం పెద్ద పనేం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ట్యాప్ చేయించాడు, అందువల్ల  బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కన్నా ఫోన్ రాష్ట్ర ప్రభుత్వం టాప్ చేస్తున్నదని ఆనడంలో నిజం ఉంటుందనే అనిపిస్తుంది.

బుధవారం నాడు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ జివిఎల్ నరసింహారావు ఈ ఆరోపణ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ లు చేసే నీచ సంస్కృతి టీడీపీది అని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఫోన్ ట్యాప్ చేస్తోందనే విషయాన్ని రుజువుచేసేందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా జివిఎల్ చెప్పారు.

‘రాష్ట్రంలోని అనేక మంది రాజకీయ ప్రముఖుల ఫోన్ ల ట్యాప్ చేస్తున్నారు.. టీడీపీ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది,’ అని ఆయన అన్నారు.

జివిఎల్ ఇంకా ఏమన్నారంటే, కేంద్రంలో ప్రకంపనలు పుట్టించే కుంభకోణాలవివరాలు తమ దగ్గిర ఉన్నాయని, బయట పెడతామని టిడిపి వాళ్లు అనడం ప్రగల్బాలు పలకడమే నని అన్నారు. అన్నివివరాలుంటే బయటపెడ్డడం లేదేందెకు అని ప్రశ్నిస్తూ కుంభకోణాల వివరాలు బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు  కుటుంబరావు కి ముహూర్తం కావాలా అని అడిగారు.

 

కుటుంబరావుని ఎందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారో అర్ధం కావడం లేదు. ఆయనను అక్కడ నుంచి తీసేసి దుష్ప్రచార సంఘం అధ్యక్షుడిగా నియమిస్తే మంచిదని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *