ఎందరిని అరెస్టు చేసినా, ట్యాంక్ బండ్ మీద ఆర్టీ సి కార్మికుల హల్ చల్ చేశారు….

ఈ రోజు మిలియన్ మార్చ్ లాగా ప్రతిపక్ష పార్టీలు, ఆర్టీసి యూనియన్లు చలో ట్యాంక్ బండ్ కార్యకమ్రం నిర్వహించాయి.  దాదాపు అయిదు వారాలుగా ఆర్టీసి కార్మికులు సమ్మెచేస్తున్నారు. దీనిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు తాము సిద్ధమని చెప్పేందుకు కార్మిక సంస్థల ఈ టాంక్ బండ్ మార్చ్ కు పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేందుకు పోలీసులు అన్ని పార్టీల నాయకులను నిన్న రాత్రినుంచే హౌస్ అరెస్టు చేయడం మొదలుపెట్టారు.
పోలీసులు పెద్ద ఎత్తున నాయకులను హౌస్ అరె స్టు చేసినా వందలాది మంది కార్మికులు ట్యాంక్ బండ్ కు చేరుకోలిగారు. అక్కడ ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలివ్వడంలో విజయవంతమయ్యారు.
ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్ బ్యాండ్ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్ ను నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా ట్యాంక్ బండ్ కు వస్తున్నపుడు  అదుపులోకి తీసుకున్నారు. నిజాంబాద్ బిజెపి ఎంపి అరవింద్ హౌస్ అరెస్టు చేశారు.మర్రిశశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులను గృహనిర్భంధంలో ఉంచారు.