Home Uncategorized కలచి వేసిన ఏనుగు ‘హత్య’, ఇంతకీ ఏనుగెలా చనిపోయింది?

కలచి వేసిన ఏనుగు ‘హత్య’, ఇంతకీ ఏనుగెలా చనిపోయింది?

903
0
(Pic credits Malayala Manorama)
మే 27 వ తేదీన కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఒక గర్భిణి ఏనుగు హృదయ విదారకమయిన పరిస్థితులలో మరణించింది.
ప్రాథమిక వివరాల ప్రకారం, ఈ ఏనుగు టపాసులు కూరిన పైనాపిల్ పండో మరోకటో తినింది, ఈ టపాసులు నోట్లో పేలడంతో తీవ్రంతా గాయపడి విలవిలలాడింది.   ఏనుగు ఆ తర్వాత ఏమి తినలేకపోయింది. ఈ బాధను భరించేంందుకు  అక్కడి నది నీళ్లలోనే ఉండిపోయింది. తొండాన్ని నీళ్లలోముంచి నొప్పితగ్గించుకునేందుకు ప్రయత్నించింది. ఆహారమేమీ తీసుకోలేకపోయింది. చివరకు మే 27 చనిపోయింది. దాని వయసులు 15 సంవత్సరాలు.
తొలుత, దీనిని చంపేందుకు ఎవరో ఈ పైనాపిల్ పండు తినిపించారని అని ప్రచారమయింది. ఈ వార్త దేశాన్ని కుదిపేసింది. కోట్ల సంఖ్యలో ప్రజలు స్పందించారు. ఆగ్రహంతో వూగిపోయారు. సికిందరాబాద్ నేరెట్ మెట్ కు చెందిన శ్రీనివాస్ వ్యక్తి దోషి ఆచూకిచెబితే రెండులక్షల రివా్డు ఇస్తానని ప్రకటించారు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్లు చేశారు.
ఏనుగు మరణం అందరిని బాధాంచింది. బాధపడిన వారిలో రతన టాటా, మేనకాగాంధీ లాంటి ప్రముఖలు కూడా ఉన్నారు. రాజకీయపార్టీల అభి మానులూ ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో జంతు ప్రేమికుల ఆవేశం కట్లు తెంచుకుని ప్రవహించింది.
అయితే, ఇపుడుఅందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎనుగుకు ఎవరూ టపాసలు కూరిన పైనాపిల్ పండు తినిపించలేదు.   ఈలాంటి పైనాపిల్ పండ్లను ఈ ప్రాంతం నుంచి తోడేళ్లు,ఎలుగుబంట్ల వంటి వన్యమృగాలను తరిమేందుకు వాడుతుంటారు. ఇలాంటి దానిని ఎనుగు తినిందని ఇపుడు చెబుతున్నారు. ఏనుగు చనిపోయేందుకు మాలప్పురం జిల్లా మీద కొంతమంది నిప్పులు చెరిగారు. మరికొందరు మాలప్పురాన్ని వివాదంలోకి లాగేడమేమిటని అడుగుతున్నారు. ఏనుగుచనిపోయింది పాలక్కాడులో  అని వారు చెబుతున్నారు. ఇపుడిదొక చిక్కు ప్రశ్న.ఏనుగు చనిపోయిందెక్కడ, పాలక్కాడ్ జిల్లాయా, లేక  మాలప్పురం జిల్లాయే..ఏనుగు విషాద గాథలో పడిన పెద్ద  చిక్కుముడి.
మలయాళ మనోరమ (Malayala Manorama), ది లీడ్ (The Lede) దీని మీద కథనాలు ప్రచురించాయి. దిలీడ్ చాలా ఇన్వెస్టిగేట్ చేసి ఎనుగు ఎలా చనిపోయిందో, ఆ తర్వాత ఏం జరుగుతున్నదో చాలా విపులంగా రాసింది.
ఇపుడు ఎనుగు ఈ పైనాపిల్ పండును తినిందా, లేక తినిపించారా అనేది ఆవేశపూరితంగా జరుగుతున్న చర్చ. అదే విధంగా ఎనుగు చనిపోయింది పాలక్కాడ్ జిల్లాలోనా, మాలప్పురం జిల్లాలోనా అనేది కూడా మరొక ఉప చర్చ.
కొందరు చర్చను పాలక్కాడ్ జిల్లాకు పరిమితం చేసి ఎనుగుల మరణానికి, జంతుహింసకు ప్రాధాన్యం ఇస్తుంటే మరికొందురు చర్చను మాలప్పురానికి తీసుకు వెళ్లి దీని వెనక రాజకీయాలున్నాయని చెబుతున్నారు.మాలప్పురం జిల్లాకు అసలు జంతు ప్రేమ అనేది తెలియదని వారు వాదిస్తున్నారు.ఇలా వాదించిన వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి,బిజెపి ఎంపి మేనకా గాంధీ

 

ఈ నేపథ్యంలో మలయాళ మనోరమ, ది లీడ్ లు ఏనుగు మరణాన్ని మొదట ఫేస్ బుక్ పోస్టు చేసిన అటవీ శాఖ అధికారి మోహనన్ కృష్ణన్ తో మాట్లాడాయి. ఎనుగు మృతి కి దారి తీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నించాయి.
‘పాలక్కాడ్, మాలప్పురం జిల్లాల సరిహద్దున ప్రవహించే వెల్లియార్ నదిలో మే 26 సాయంకాలం ఈ గర్భిణి ఏనుగు కనిపించింది. దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గాయపడిన తొండం మీద ఈగలు వాలకుండా ఉండేందుకు అది తొండాన్ని నీళ్లలో ముంచినిలబడుకుని ఉంది. అది బాగా బలహీనంగా ఉంది. కడుపులోపలికి కుంచించుకుని పోయింది,’ అని మోహనన్ చెప్పారు.
( We found the pregnant elephant in velliyar river( near the border of Palakkad and Malappuram districts) on May 26 evening. Her condition looked so bad. She kept her trunk immersed in water to keep the flies that swarmed around her wound away. She looked weak with Shrunker stomach)
పాలక్కాడ్ ఫారెస్టు డివిజన్ కు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రెండు కుమ్కీ (Kumki)ఎనుగులను తీసుకువచ్చి నదిలో ఉన్న ఏనుగును కాపాడే ప్రయత్నం చేసింది. అయితే, ఈ ప్రయత్నాలు ఫలించలేదు. గాయాలబాధ భరించలేక మే 27 వ తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు అది ప్రాణాలువిడిచిందని మోహనన్ మలయాళ మనోరమకు చెప్పాడు.
ఏనుగు శవాన్ని పోస్టుమార్టమ్ కు తీసుకుపోయేదాకా అది కడుపుతో ఉందన్న విషయంఎవరికీ తెలియదని కూడా మోహనన్ చెప్పాడు. అది గర్భవతి అని పోస్టు మార్టమ్ చూసిన వెటర్నరీ డాక్టర్ తనతో చెప్పాడని మోహనన్ అన్నాడు. తర్వాత ఏనుగుకు, గర్భస్థ శిశువుకు అంత్యక్రియలు జరిపారు.
కలచి వేసిన మోహనన్ ఫేస్ బుక్ పోస్టు
ఏనుగు చనిపోయాక మోహనన్ మనుసు కలచివేసే విధంగా ఫేస్ బుక్ లో ఒక పోస్టును మలయాళంలో పెట్టారు.

മാപ്പ്… സഹോദരീ .. മാപ്പ് …അവൾ ആ കാടിന്റെ പൊന്നോമനയായിരുന്നിരിക്കണം. അതിലുപരി അവൾ അതിസുന്ദരിയും സൽസ്വഭാവിയും…

Posted by Mohan Krishnan on Saturday, May 30, 2020

దీనిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయడంలో చాలా భావోద్వేగం జారిపోయింది. కేవలం ఏమోషన్ అందరికి సరఫరా అయింది.
మలయాళం పోస్టును ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయడంలో మెలికవేశారని దిలీడ్ రాసింది. ఇంగ్టీష్ రిపోర్టు ఎనుగుకు టపాసులు కూరిన పైనాపిల్ ను తినిపించారని (fed) అని రాశారు. దీనివల్ల ఏనుగును చంపేందుకే ఇలా చేశారనే భావం వచ్చిందని ది లీడ్ రాసింది.
‘‘The post, when translated from Malayalam, was twisted by the use of the word “fed” in the initial English report. The poor translation suggested that the elephant had been fed with intent to kill.‘‘
నీలంబూర్ రేంజ్ సెక్షన్ ఫారెస్ట్ ఆఫసరయిన మోహనన్ తన పోస్టులో ఎక్కడా ఏనుగు పైనాపిల్ నే కచ్చితంగా తినిందని పేర్కొనలేదు. ఎనుగు ఎలా చనిపోయి ఉంటుందో చెబుతూ ఈ ఎనుగు పైనాపిలో లేదా ప్రేలుడు పదార్ధాలేవో కూరిన మరొక పండో తిని ఉండవచ్చని మాత్రమే మెహనన్ పేర్కొన్నారని ది లీడ్ కు చెందిన కేరళ రిపోర్టర్ జెఫ్ జోసెఫ్ రాశారు. జెఫ్ కేరళలో బాగా పేరున్న సీనియర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. ఇది మలయాళ పోస్టును ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నపుడు ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పొరపాటున లేదా వ్యవహారాన్ని తెలికగా తీసుకునో టపాసులు కూరిన పైనాపిల్ తిన్నందున పాలక్కాడ్ లో ఏనుగు చనిపోయిందన్నట్లు రాశారు. తర్వాత ఈ పైనాపిల్ నే అంతా సోషల్ మీడియాలో వాడుకున్నారని ది లీడ్ రాసింది. ఇదే పత్రికలను మరొక సోర్స్ మాలప్పురం ఏనుగు చివరి మజిలీ అని చెప్పినపుడు న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఏవూరో తేల్చుకోకుండా రెండింటిని అచ్చేసింది.
మోహనన్ కృష్ణ న్ పోస్టులో ఏనుగు ఎక్కడ చనిపోయిందో స్థలం పేరు లేదు. వెల్లియార్ నది అని మాత్రమే రాశారు. ఏనుగు చనిపోయింది పాలక్కాడ్ జిల్లాలో అని అటవీ అధికారులు ధృవీకరించారని ది లీడ్ చెబుతున్నది. మరి మాలప్పురం ఎందుకొచ్చిందో అర్థంకాదు. కొన్ని పత్రికలు ఇది మాలప్పురంలో జరిగిందని కూడా రాస్తున్నాయి. మాలప్పురం ప్రస్తావన రావడంతో ఎనుగు హత్య కథే మారిపోతున్నదని ది లీడ్ రాసింది.
మలయాళ మనోరమ చేసిన ఇంగ్లీష్ తర్జుమా: “She would have walked into the village in search of food. She didn’t know how selfish human beings were… she ate the pineapple or some fruit thinking it was something consumable. When it exploded, all she thought about would have been the new life she was about to give birth to.”
నదిలో నీళ్ళలో నిలబడుకుని ఉన్న ఏనుగు ఫోటో ని మోహనన్ షేర్ చేశారు. ఆ ఏనుగు బాధతో జనావాసంలోకి చొరబడినా, తన వల్ల ఒక్క మానవమాత్రుడికిగాని, జనావాసాలకు గాని హాని జరగకుండా జాగ్రత్త పడిందని మోహనన్ రాశారు.
పుడు ఈ మొత్తం సంఘటన మీద కోళికోడ్ నుంచి వచ్చిన వైల్డ్ లైఫ్ ఇన్వెస్టిగేసన్ టీమ్ దర్యాప్తు చేస్తూ ఉంది.
ఈ ఎనుగు ఏ జిల్లాలో చనిపోయింది, పాలక్కాడ్ లో చనిపోయిందా, మాలప్పురం లో చనిపోయిందా, ఏనుగులను చంపేందుకు పేలుడు పదార్థాలు కూరిన పళ్లను పెట్టారా లేక  ఎలుగుబంట్లను చంపేందుకు పెట్టిన పళ్లను ఏనుగు తినిందా అనేవి ఇప్పట్లో తేలే విషయాలు కాదు. అయితే, ఒక్కటి మాత్రం నిజం.
మనిషి తాను హ్యాపీగా ఉండేందుకు జంతువులను చంపుతున్నాడు. క్రూర హింసకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే తేనెటీగలు సగం అంతరించాయి. పిచ్చుకలు మాయమవుతున్నాయి. జంతువులు, అడవులు, నదులు,  జలపాతాాలు,కొండలు గుట్టలు లేని ప్రపంచంలో మనిషి హ్యాపీగా ఉంటాడనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. ప్రపంచాన్ని ప్రకృతిని ఇతర ప్రాణులతో చెట్లు చేమలతో పంచుకున్నపుడే మనిషికి ఆనందం ఉంటుంది. అలా కాకుండా జంతువుల మరణాలను జంతుప్రేమతో కాకుండా మనుషుల రాజకీయాలతో ముడివేస్తే కోలుకోలేనంత హాని జరగుతుంది, మనిషికి, ప్రకృతికి.