కరోనా మధ్యలో కవితక్క మస్తు పార్టీ… లీకయి అర్వింద్ చేతుల్లో పడ్డ వీడియో క్లిప్…

గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినప్పటినుంచి కల్వకుంట్ల కవిత రాజకీయంగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడా అమె కనిపించడం లేదు.ఆమె ట్రేడ్ మార్క్ కార్యక్రమం బతుకమ్మ కూడా పట్టించుకోలేదు.
నిజామాబాద్ ఎంపిగా ఉన్నపుడు బతుకమ్మ అంబాసిడర్ గా ఆమె ప్రపంచమంతా తిరిగేవారు. ప్రభుత్వం ప్రతిఏడాది పది పన్నెండు కోట్లు విడుదల చేసేది. దీనితో ఆమె బతుకమ్మను అంతర్జాతీయ చేసేందుకు ఖండాలన్నీతిరిగారు. అలాంటి మనిషి బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోగానే అన్నింటిని వదులుకున్నారు.
ఇపుడామె మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీగా కౌన్సిల్ లో కాలుమోపి తర్వాత క్యాబినెట్లోకి వస్తారని వదంతి. ఎమ్మెల్సీగా గెల్చిన ఆనందాన్ని ఆమె ఆపుకోలేక పోయారు. ఆమె ఆనందాన్ని కరోనాకూడా అడ్డుకోలేకపోయింది. కరోనా దెబ్బతో వణికిపోతున్న దేశం ఎక్కడా నలుగురు వ్యక్తులు గుమికూడకుండా జనతా కర్ఫ్యూ పెట్టి నివారిస్తున్నారు. రైళ్లను నిలిపివేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూసేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి,ఆమె తండ్రి స్వయంగా పన్నెండు జనతా కర్ఫ్యూ చాలదని, 24 గంటల కర్ఫ్యూ పెట్టి జనన్నాంతా ఇంటికి పరిమితం కావాలన్నారు.
అయితే ఇవేవి కవితక్క ఆనందానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఆమె తన పునరాగమనాన్ని పెద్ద పార్టీలో మజా చేసుకున్నారు. సుమారు 500 కుటుంబాలకు చక్కడి తెలంగాణ పార్టీ ఇచ్చారు. ఈ వీడియో తునక ఒకటి లీకయింది. లీకయితే లీకయింది. అది పడరాని చేతుల్లో పడింది. అంతే ఇలా వైరలయింది… ఇదే వీడియో…