ఆస్తులు పోతాయనే చంద్రబాబు అమరావతి ఉద్యమం: వైసిపి ఎమ్మెల్యే మేరుగు

తాడేపల్లి, ఫిబ్రవరి 03 : రాజధాని వికేంద్రీకృతమయితే అమరావతిలో  కొల్లగొట్టిన  ఆస్తులు  పోతాయని వాటిని కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ అమరావతి  ఉద్యమం చేస్తున్నాడని వైసిపి పార్టీ ఎంఎల్ ఏ మేరుగు నాగార్జున తీవ్రమయిన ఆరోపణ చేశారు. ఈ రోజు ఆయన  తాడే పల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం విలేకరులతో మాట్లాడారు.
దళితుల భూములను లాక్కుని చంద్రబాబు తన బినామిలకు అప్పగించారని కూడా ఆయన ఆరోపించారు. ఇపుడు ఇవన్నీ పోతాయనే ఆయన దళితుల మీద తన పెయిడ్ వర్కర్లు చేత దాడులు చేయిస్తున్నాడని, పార్టీ ఎంపి నందిగం సురేష్ పై దాడి చంద్రబాబు అకృత్యాలకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు. ‘ఎంపి నందిగం సురేష్ పై దాడి వెనక పెద్ద కుట్ర దాగిఉంది.నందిగం సురేష్ పై పెయిడ్ వర్కర్స్ తో చంద్రబాబు దాడిచేయించారు.అంటరానితనం చంద్రబాబు మదిలో,ఆలోచనలో ఉంది,’అని ఆయన అన్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని అన్నారు.
‘చంద్రబాబూ…అసెంబ్లీలో ఎస్సి కమీషన్ విషయంలో బిల్లుపెడితే వ్యతిరేకించావు.మండలిలో మోకాలడ్డావు.చంద్రబాబు ఆయన గ్యాంగ్ దళితులను టార్గెట్ చేస్తున్నది. గతంలో మా ఎంఎల్ ఏలు కైలే అనిల్ కుమార్,శ్రీదేవి గార్లపై దాడులు చేయించావు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృధ్దితో  వైయస్ జగన్ ముందుకు వెళ్తుంటే ఆయనను అభాసుపాలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు,’ అని నాగర్జున విమర్శించారు.
శ్రీభాగ్ ఒప్పందంలోని అంశాలను పరిశీలించి,అనేక అధ్యయనాల తర్వాత  జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్తుంటే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు పెయిడ్ వర్కర్లను పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

One thought on “ఆస్తులు పోతాయనే చంద్రబాబు అమరావతి ఉద్యమం: వైసిపి ఎమ్మెల్యే మేరుగు

Comments are closed.