కూలీలకు ఆకలేస్తుందని, దాహమవుతుందని కోర్టు చెప్పేదాకా తెలియదా?

లాక్ డౌన్ దెబ్బతో సతమతమవుతున్న వలస కూలీల దగ్గిర డబ్బులేదని, కాలినడక వందల కిలో మీటర్లు నడిచి వెళ్తున్న భారత దేశ అభాగ్యులకు రోజూ ఆకలేస్తుందని,  నీళ్ళు దాహమవుతాయని సుప్రీంకోర్టు మొట్టి క్కాయ వేసి చెప్పేదకా కేంద్రానికి, రాష్ట్రాలకు తెలియదా?
తెలియదు.
అందుకే పదే పదే సుప్రీంకోర్టు కేంద్రానికి రాష్ట్రాలకు హెచ్చరిక చేస్తూ వచ్చింది.వేల కోట్ల రుపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్లకి రుణ మాఫీ చేసిన ప్రభుత్వం,  భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఈ పేదలకు  లాక్ డౌన్ తెచ్చిన కష్టాలు తెలుసుకునేందుకు మూన్నె ళ్లు పట్టింది.ఎంత దౌర్భాగ్యం.
మొదట్లో రైళ్లు నడపాలని నిర్ణయించుకునేందుకు రెన్నెళ్లు పట్టింది. రైళ్లు నడుపుతామని చెప్పి చేతిలో చిల్లి గవ్వలేని ఈ కటిక దరిద్రులనుంచి చార్జి వసులు చేయాలనుకుంది.
ఈచార్జీలను కేంద్రా రాష్ట్రాలు భరించాలనుకునే నిర్ణయానికి వచ్చేసరికి రెండు వారాలు పట్టింది.
అప్పటికి చాలామంది రైళ్లను నమ్ముకోకుండా కాలిబాటపట్టారు. కన్యాకుమారి నుంచి ఉత్తర ప్రదేశ్ కు, హైదరాబాద్ నుంచి ఈ శాన్య భారతానికి, గుజరాత్ నుంచి శ్రీకాకుళానికి… దారిపొడుగునా వాళెన్ని కష్టాలు పడుతున్నారో ఎవరూ పట్లించుకోలేదు.
ఆపైన, కోర్టు చెప్పిన తర్వాత వాళ్లకి భోజనాలు పెట్టేందుకు కేంద్ర రాష్ట్రాలు పూనుకున్నాయి. అది కూడా ఎందుకు?
ఇలా లక్షలాది మంది కార్మికులు, కన్ స్ట్రక్షన్, రోడ్డు, వ్యవసాయం, పరిశ్రమాలు, ఓడ రేవులు, మార్కెట్ యార్డులలో,రైలు వ్యాగన్లలో, గనుల్లో,  మిల్లులలో, మాల్స్ లో, హోటళ్లలో పనిచేస్తూ  ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ వస్తున్నారు.
వీళ్ళంత సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోతే, తిరిగి రారని, అపుడు ఈ రోడ్డు నిర్మాణాలు,భవన, బ్రిడ్జి నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు. గనులు,హోటళ్లు, మాల్స్, హైవేల నిర్మాణాలు,  నడవవని తెలిసివచ్చింది.
అపుడు ఎక్కడి వాళ్లని ఆపేసి భోజనాలు పెట్టండని కేంద్రం రాష్ట్రాలకు నిధులుపంపింది. అయితే, చాలాచోట్ల వలస కూలీలు దీనిని లెక్క చేయలేదు. మా రాష్ట్రాలకు మమ్మల్ని పంప్పాల్సిందే నని పట్టుబట్టారు. ముంబయి మిర్రర్ లో ఇలా పట్టుబట్టిన వలస కూలీల మీద  ఒక వార్త Send Us Home, Insist Migrant శీర్షికతో అచ్చయింది. మీరూ చదవండి.  అంతేకాదు, కార్మికులను వూర్తకు పంపవద్ద,పోతే రారు, మానిర్మాణపు పనులు ఆగిపోతాయని కర్నాటక బిల్డర్లు వత్తిడి తెచ్చాక, ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొన్ని శ్రామిక రైళ్లను రద్దుచేయించాడని The Wire రాసింది.
ఇక కార్మికుల వత్తడి, మీడియా నుంచి వత్తిడి భరించ లేక వాళ్ల కోసం ప్రత్యేక శ్రామిక రైళ్లు వేయాల్సి వచ్చింది.
రైళ్లు వేశాక వాళ్లు తిండి లేక, నీళ్లు లేక ఎలా ప్రయాణిస్తారన్న ఆలోచన కేంద్రానికి రాలేదు,రాష్ట్రాలకూ రాలేదు.
అందుకే మళ్లీ ఇపుడు సుప్రీంకోర్టు వలస కూలీల పక్షాన నిలబడింది,వాళ్లకి భోజనాలు పెట్టండి, మంచినీళ్లివ్వండి కేంద్రానికి ఆదేశాలివ్వాల్సి వచ్చింది.
“No fare either by train or bus shall be charged from any migrant workers, The railway fare shall be shared by the states as per their arrangement,” అని జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ధర్మాసనంలో జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ ఎంఆర్ షా లు కూడా ఉన్నారు.
సుప్రీంకోర్టు సుమోటు గా స్వీరించిన ఈ కేసులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ , ఎఎమ్ సింగ్విలు కోర్టు ఆఫీసర్లుగా(Officers of the Court)గా పరిగణించింది.
సొంతవూర్ల కు వెళ్లాలనుకునే కూలీలందరికి ఉచితంగా భోజనం ఏర్పాట్లను కేందం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుచేయాలి. ఉచితంగా బోజనం బస ఏర్పాటుచేస్తున్న విషయాన్ని రైళ్ల కోసం వేచిచేస్తున్న కూలీలందరికి చాలా స్పష్టంగా తెలియచెప్పాలి. ప్రకటనలివ్వాలి. ఈ సమాచారం వారికి అందేలాచూడాలి: అని కోర్టు చాలా నిర్ద్వంద్వంగా చెప్పింది.
The migrant workers who are stranded at different places shall be provided food free of cost by states/UTs concerned at different places, which shall be publicized and notified to them during the period they are waiting for their turn to board the train or bus: Supreme Court.
ఈ కూలీలను రిజిస్టర్ చేసుకునే విధానాన్ని సూక్ష్మీకరించి, వేగిర పర్చాలని కూడా కోర్టు చెప్పింది. తాను ఇచ్చిన అమలు చేస్తున్న తీరు మీద వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కేసును వారానికి వాయిదా చేసింది.
వలసకార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రైళ్ళలో గాని, బస్సలలో గాని వారివద్దనుండి ఎటువంటి ప్రయాణ ఛార్జీలు వసూలు చేయరాదు. అంతేకాదు మార్గమధ్యంలో ఈ కోరనా బాధిత కూలీలకు ఉచితంగా భోజనం, మంచినీళ్లు అందించాలి : అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.