ఈ రోజు అమరావతి న్యూస్ అలెర్ట్

*అమరావతి: రాజధాని తరలింపు నకు వ్యతిరేఖంగా ఒక వైపు రైతులు ఆందోళన చేస్తుంటే, తరలింపునకు సంబంధించిన మరొక ముఖ్య కార్యక్రమం ప్రభుత్వంలో జరగ బోతున్నది.
ముఖ్య మంత్రి జగన్ ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను పరిశీలించేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక ఈ రోజు అందుతుంది. బీసీజ్ నివేదికను సీఎం జగన్ కు సమర్పిస్తారు.
ఇప్పటికే జీఎన్ రావ్ కమిటీ ఒక నివేదికను సమర్పించింది.రాజధాని  వికేంద్రీకరణ చేయాలన్న ప్రతిపాదన చేసింది. ఈ నివేదిక పాటు బీసీజీ నివేదికను కూడా అధ్యయనం చెయడానికి ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీని నియమించింది.
ఈ నెల 8 న జరిగే కాబినెట్ లో బోస్టన్ రిపోర్ట్ పై చర్చ జరుగుతుంది. ఈ నెల 20 లోపు హై లెవెల్ కమిటీ నివేదిక సమర్పించాలి.
రిపబ్లిక్ డే తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. సభలోఈ మూడు నివేదిక లపై చర్చ జరుగుతుంది.మూడు రాజధానుల ప్రతిపాదన మీద సభ ఒక తీర్మానం ఆమోదించే అవకాశం వుంది. ఏవిధంగా నయితే, 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మెజారిటీతో అమరావతి రాజధాని తీర్మానం ఆమోదించింతో అదే విధంగా వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనకు కూడా అసెంబ్లీ అమోదం సంపాదిస్తుంది. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీయే. కాబట్టి ప్రతిపాదన మీద వారు వాకౌట్ చేయడం మినహా చేయగలిగింది లేదు.
అవసరాన్ని బట్టి అఖిల పక్ష సమావేశం కూడా  నిర్వహించే ఆలోచన లో ప్రభుత్వం వుందని తెలుస్తున్నది.