మహానాడు కోసం భూమి పూజ…

అత్యంత కీలకమయిన సదస్సు కాబోతున్న  తెలుగుదేశం మహానాడు ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావ్ భూమి పూజ నిర్వహించారు.

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదిననా మహానాడు జరుపుకోవడం ఆనవాయితీ. దీనిప్రకారం ఈనెల 27 వ తేదీ నుంచి మూడురోజుల పాటు విజయవాడ కానూరు సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్ లో మహానాడు జరగుతుంది.  న్యాయ సమ్మతమయిన విభజన చట్టం హామీలను అమలు చేయాలని  కేంద్రం తో  తెలుగుదేశం నేత  పోరాటం చూస్తూ ఉండటం, ప్రధాని మోదీ తెలుగు ప్రజలను నమ్మక ద్రోహం చేయడం, తెలుగుదేశం పార్టీకి మిత్ర ద్రోహం చేయడం, మరొక ఏడాదిలో ఎన్నికలు వస్తూవుండటంతో ఈ మహానాడు కు చాలా ప్రాముఖ్యం ఉంది.

కేంద్రం ఏపీకి చేసిన అన్యాయన్ని ఈ వేదిక మీది నుంచి ముఖ్యమంత్రి ప్రపంచంలోని తెలుగువాళ్లందరికి వినిపిస్తారు. ఒక విధంగా ఇది మోదీ మీద యుద్ధ శంఖారావం మోగించడమే.

భూమి పూజ అనంతరం  మాట్లాడుతూ మహానాడు లో పధ్నాలుగు తిర్మానాలు చేయనున్నామని అన్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు అయ్యే వరకు చంద్రబాబు నాయకత్వంలో  పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

మహానాడు ద్వారా అధినేత చంద్రబాబు ఇటు పార్టీకి, అటు ప్రజలకు దిశా- నిర్ధేశం చేస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *