సదఫ్ ఖాదెం తెలుగు రాష్ట్రాల్లో పుట్టివుంటే… వద్దంటే డబ్బు, కాని…

సదఫ్ ఖాదెం ఇండియా లో పుట్టి వుంటే…రాష్ట్రపతి, ప్రధాని మంత్రి , ప్రతిపక్ష నాయకుడు, వివిధ పార్టీల నేతలు ఆమెకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేసి ఉండేవారు.

సోషల్ మీడియాలో ఆమె లక్షలాది మంది భారతీయులు ఫ్యాన్స్ అయి ఉండేవారు.వాళ్లందరిలో దేశ భక్తి పొంగిపొర్లి పోతూ ఉండేది. ఆమె ఇండియా విమానాశ్రయంలో దిగగానే వేల సంఖ్యలో ఇండియా గ్రేట్ అని అరుస్తూ స్వాగతం పలికే వారు.

ఒక వేళ ఆమె ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, ఆయనకుమారుడు లోకేశ్ నాయుడు, ప్రతిపక్షనాయకుడు జగన్ ట్వీటాభినందనలు చెప్పేవాళ్లు.

ముఖ్యమంత్రి  అమరావతిలో ఇంటి స్థలం, కోటి రుపాయల నజరానా ప్రకటించే వారు. అంతేకాదు, డిప్యూటి కలెక్టర్ ఉద్యోగం కూడా ఇచ్చేవారు.

ఇక తెలంగాణ లో పుట్టినా ఇదే మహర్దశ పట్టి ఉండేది. ఆమె తెలంగాణ చేనేత కాటన్ దుస్తులకు బ్రాండ్ ఎంబాసిడర్ అయి ఉండేది.  అదనంగా, మన చాముండేశ్వరినాథ్ ఒక బ్రాండ్ న్యూ బిఎం డబ్ల్యూ కార్ కూడా కానుగా ఇచ్చే ఉండేవారు. బ్యాడ్ లక్.

సదఫ్ ఖాదెం పుట్టింది ఇరాన్ లో…

అందుకే దేశంలో తొలి బాక్సర్ చాంపియన్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందితే, ఆమె సొంతదేశం వెళ్ల లేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. ఒక ఇరాన్ మహిళ మొట్టమొదటి సారిగా ఇంటర్నేషన్ బాక్సింగ్ చాంపియన్ ఫిప్ గెలుపొందితే ఉండాల్సిన ఆనందోత్సాహాలు లేవక్కడ. శనివారం నాడు ఫ్రాన్స్ లో చాంపియన్ షిఫ్ లో ఆమె ఆదేశానికి చెందిన ఏన్ షెవా (Ann Chauvin)ను ఓడించి, తొలి మహిళా బాక్సింగ్ చాంపియన అయ్యారు. అయితే ఎలాంటి సంబురాలు లేవు. కారణం వేరే ఉంది.

విశాఖ తీరంలో ఆగని ధ్వంసం

మహిళలను బాక్సింగ్ పోటీలకు అనుమతిస్తూ ఇరాన్ ప్రకటించగానే ఫ్రాన్స్ లో ఈ పోటీ ఏర్పాటుచేశారు. అక్కడ ఖాదెం గెలిచారు. అయితే, ఆమెకు ఘనంగా స్వాగతం చెప్పడానికి బదులు ఇరాన్ ప్రభుత్వం అరెస్టు వారంటు జారీ చేసింది. అమెకే కాదు, ఈ పోటీ ఏర్పాటుచేసిన మాయర్ మోన్షీఫోర్ ను కూడా అదుపులోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఇరాన్ దేశస్థురాలయినా, మోన్షీఫోర్ ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. అరెస్టు కు భయపడి ఖాదెమ్ స్వదేశం వెళ్ళరాదని, ప్రాన్స్ లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు.

అరెస్టు వారంట్ ఎందుకు జారీ చేశారు?

ఇరాన్ లో మహిళలు క్రీడల్లో పాల్గొనడం మీద చాలా ఆంక్షలున్నాయి. అయితే, వీటిని ఇపుడిపుడే సడలిస్తున్నారు. ఇలా కొన్ని షరతులతో బాక్సింగ్ లోకి మహిళలను అనుమతిస్తున్నారు. మహిళలు బాక్సింగ్ లో పాల్గొన్నపుడు తప్పనిసరిగా వారికోచ్ మహిళే అయి ఉండాలి. అదే విధంగా బరిలో ఉన్నపుడు హిజబ్ ధరించాలి. అయితే, ఇంతవరకు ఇరాన్ మహిళల మధ్య బాక్సింగ్ పోటీలు జరగనేలేదు.
ఖాదెం బరిలో ఉన్నపుడు హిజబ్ ధరించలేదు. అంతేకాదు, ఆమె షార్ట్స్ కూడా వేసుకుని ఉన్నారు. ఈ రెండు ఇస్లామిక్ సంప్రదాయాలకు వ్యతిరేకం. అందువల్ల ఖాదెం ఇరాన్ మహిళల వస్త్ర నియమాలను ఉల్లంఘించారని, ఇందులో ఆమె కోచ్ పాత్ర కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇరాన్ బాక్సింగ్ ఫెడరేషన్ చీఫ్ హుసేన్ సూరి ఖాదెం రిజిస్టర్డ్ బాక్సర్ కాదని, అందువల్ల ఆమె పోటీలు వ్యక్తిగతమయినవని చెబుతూ ఫ్రెంచ్ చాంపియన్ షిప్ తమకు సంబంధం లేదని ఒక ప్రకటన జారీ చేశారు. ఆమెను అరెస్టు చేస్తారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అది సౌదీ అరేబియా సృష్టి అన్నారు. అయితే,మాయర్ మోన్షి పోర్ ప్రతినిధి మాత్రం అరెస్టు వారంట్ జారీఅయిందని వెల్లడించారు. ఖాదెం ఇపుడు ప్రెంచ్ నగరం ప్వాత్జే (Poitier) ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *