మొత్తానికి మ్యాపుకెక్కిన అమరావతి రాజధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి  కేంద్రం గుర్తింపు లభించింది. అమరావతియే  ఆంధ్రప్రదేశ్ రాజధాని అని  గుర్తిస్తూ కొత్తగా తయారు చేసిన మ్యాప్ తయారయింది సర్వే ఆఫ్ ఇండియా దీనిని విడుదల చేసింది. అమరావతి భ్రమరావతి అని ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం దానిని చెరిపేయాలనుకుంటున్నా అది వెంటబడుతూ ఉంది.  ఈ కొత్త మ్యాప్  ని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు.
ఏపీ రాజధానిని పేర్కొనకుండా ఇటీవల సర్వే ఆఫ్ ఇండియా భారత దేశ  మ్యాప్ విడుదలచేసింది. దీని మీద పెద్ద గొడవ నడిచిన సంగతి తెలిసిందే. అసలు అమరావతి రాజధానే కాదని, దానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదని అందుకే కేంద్రం గుర్తించకుండాపోయిందని వైసిపి మంత్రులు చెబుతూ వచ్చారు. అయితే, గెజిట్ ఏమీ లేకపోయినా,  వైసిపి ప్రభత్వం తెలుగు దేశం నిర్మించ తలపెట్టిన అమరావతిని రాజధాని గుర్తించడమంటే  గొప్ప విషయమే. ఇందులో రాజకీయమేదో ఉండి ఉంటుంది.నిజం నిలకడ మీద తెలుస్తుంది.
మొదట విడదల చేసిన మ్యాప్ ఆంధ్ర రాజధాని పేరే లేకపోవడం రాష్ట్ర ప్రజాలను ఆశ్చర్యానికి గురి చేసిందని నిన్న లోకసభ జీరో అవర్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు.
జయదేవ్ లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హోం శాఖ సంబంధింత శాఖల అధికారులతో చర్చించి ఈ రోజు కొత్త మ్యాప్ లను విడుదల చేయింది. దీనిని  కిషన్ రెడ్డి ట్టిట్టర్ లో విడుదల చేశారు.