2021లో కెటిఆర్ ముఖ్యమంత్రి? బాల్ థాకరే లాగా కెసిఆర్??

 తెలంగాణ పురపాలక, ఐటి శాఖల ముఖ్యమంత్రి కెటి రామారావు 2021 లో ముఖ్యమంత్రి అవుతారనే వార్త మళ్లీ మొదలయింది. తొందరల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ దీని మీద నిర్ణయం తీసుకుంటారని, ఆయన భారీ ఎత్తున పార్టీలో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తారని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇపుడు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు మారారు. అక్కడాయన పురోహితుల సలహామేరకు ఒక పక్షం రోజులుంటారని, ఈ సమయంలో  తెలంగాణలో బిజెపి ముప్పును ఎదుర్కొనే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారని  మీడియాలో రాస్తున్నారు. ఇందులో భాగంగా తానిక అన్ని భాధ్యతలనుంచి తప్పుకుని బాల్ థాకర్ లాగా  పెద్ద దిక్కుగా ఉండిపోతారని ఒకవాదన మొదలయింది.
ఈ వాదన ప్రకారం కుమారుడు కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారు. ఈటెల్ రాజేందర్ లేదా మరొక సీనియర్ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిని చేస్తారు. కెసిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా బిజెపి వ్యతిరేక వ్యూహం  అమలుతీరును పర్యవేక్షిసుంటారు.
 అయితే, కెసిఆర్ ఒక పదిరోజులు హైదరాబాద్ లో కనిపించనపుడల్లా ఇలాంటి వూహాగానాలు వినబడుతూ ఉంటాయి. కెటిఆర్ తదుపరి ముఖ్యమంత్రి అనేది అందిరికి తెలిసిందే. ఆయన ఎపుడూ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనేదే మిగిలింది.
ఇది నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనా లేక యాదాద్రి గుడి ప్రారంభం తర్వతానే అనేది తెలియడం లేదు. ఎందుకంటే, యాదాద్రి ని తిరుపతి లాాాగా తీర్చిదిద్దే పని ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తవుతున్నాయి. దీనిని ముఖ్యమంత్రిగా ప్రారంభించాక ఆయన మహారాష్ట్ర  శివసేన సంస్థాపకుడు బాల్ థాకరేలాగా ‘హైదరాబాాద్ పెద్దాయన’  పాత్రలోకి మారతారనేది ఒక వాదన.
దేశమంతా సీనియర్ నాయకులంతా కొడుకులకు  పార్టీలను, పదవులను అప్పగించేస్తున్నారు. యుపిలో ములాయాం సింగ్ కొడుకు అఖిలేష్ కు బాధ్యతలప్పగించారు.
అఖిలేష్ రాజకీయంగా విజయవంతమయ్యారు. పక్కనే బీహార్ లో లాలూ  ప్రసాద్ కూడా తేజస్వియాదవ్ ను నాయకుడిని చేశారు. వారసులు లేని చోట మాత్రమే ఇలాంటి మార్పు జరగడం లేదు.
దానికి తోడు తెలంగాణలో కెటిఆర్  ముఖ్యమంత్రి అనే  ప్రతిపాదనకు ఎలాంటి వ్యతిరేకత ఉండదు. కెటిఆర్ అందరి మనసు చూరగొన్నాడు. అందువల్ల బిజెపి నుంచి ముప్పు బలపడక ముందే కెటిఆర్ ని ముఖ్యమంత్రిని చేసి,  వచ్చే ఎన్నికలు, అవి సింగిల్ గా నయినా, జమిలిగా నయినా యువనాయకుడి నాయకత్వంలో సాగేలా కెసిఆర్ యోచిస్తున్నారని మీడియాలో ఉహాగానాలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *