మొత్తానికి ‘విశాఖ రైల్వేజోన్’ దీక్షకు దిగిన టిడిపి

లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల వాంఛ విశాఖ పట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ సాధన సాధించే వరకూ పోరాటం సాగిస్తామని కై తెలుగుదేశం ఎంపీ లు ( లోక్ సభ, రాజ్య సభ సభ్యులు ) ముక్త కంఠం తో ప్రకటించారు. బుధవారం విశాఖ

రైల్వే స్టేషన్ ( జ్ఞానాపురం గెట్ ) వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన సమయం లో కేంద్రం విభక్త ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన హామీలలో ప్రధాన మైనది విశాఖపట్నం రైల్వే జోన్ అని, విభజన సమయం లో చట్టం చేసినప్పుడు కూడా దీని ఏర్పాటు కై ఆరు నెలల లోగా పరిశీలన చెయ్యమని ఉందని అనకాపల్లి లోక్ సభ సభ్యులు ముత్తంశెట్టి శ్రినివాసరావు తెలిపారు. ఈ దీక్ష శిబిరం పోరాటం కేవలం ఒక్కరోజు కోసం కాదని, దీని స్ఫూర్తిగా రానున్న రోజులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.

నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని, నేడు ఆయన స్ఫూర్తిగానే ఈ రోజు, విభజన చట్టం లో పెట్టిన హామీలకై పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. దానిలో భాగంగానే ప్రధాన డిమాండ్లయినా అమరావతి రాజధాని నిర్మాణం కై నిధులు, విశాఖపట్నం రైల్వే జోను ఏర్పాటు, దుగరాజపట్నం పోర్ట్ సాధన, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ నిర్మాణం, పోలవరం ప్రోజక్ట్ నిర్మాణానికి పూర్తిగా నిధుల మంజూరు తదితర అంశాలపై ఎంపీలు నిరంతర పోరాటం చేస్తున్నట్టు తెలిపారు.

తెలుగుదేశానికి మొత్తం 22 మంది ఎంపీలు లోక్ సభ, రాజ్యసభ లో ప్రాతినిధ్యం ఉందని, ఇంతమంది సభలో పోరాటం చేసినా కేంద్రం లో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీకి మిగుడు పడని రీతిలో సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నామని, త్వరలో జరుగనున్న పార్లమెంట్ సభల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *