డిగ్రీ లెక్చరర్ ఇంటర్వూ మార్కులు ప్రకటించిన టిఎస్ పీఎస్సీ

తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలను టిఎస్ పీఎస్సీ విడుదల చేసింది. ఈ ఇంటర్వూలో అభ్యర్దులు సాధించిన మార్కుల వివరాలను టిఎస్ పీఎస్సీ తమ అధికారిక వెబ్ సైట్ tspsc.gov.inలో పొందుపరిచింది.

ఆరు సబ్జెక్టులలో 255 పోస్టుల భర్తీకి సంబంధించి టిఎస్ పీఎస్సీ రాత పరీక్ష, ఇంటర్వూలను పూర్తి చేసింది. బొటనీ, కామర్స్, మైక్రో బయాలజీ, జువాలజీ, సోషియాలజీ, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి ఈ పరీక్ష నిర్వహించారు. త్వరలోనే మెరిట్ జాబితా ప్రకటిస్తామని టిఎస్ పీఎస్సీ తెలిపింది. మరో వైపు వైద్య విద్యలో ట్యూటర్ ఖాళీలకు జనవరి 30న నాంపల్లిలోని టిఎస్ పీఎస్సీ ఆఫీసులో ఇంటర్వూలు జరుగుతాయని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *