టిఆర్ఎస్ లోకి రాగానే నోరు జారిన నామ (వీడియో)

నామ నాగేశ్వరరావు ఇటివల టిడిపిని వీడి కారెక్కారు. దీంతో అతనికి ఖమ్మం ఎంపీ సీటును టిఆర్ఎస్ కేటాయించింది. పార్లమెంటు ఎన్నికల  ప్రచారంలో అతను బిజిగా ఉన్నారు. సుదీర్ఘ కాలం టిడిపిలో కొనసాగడంతో పాత పార్టీని ఆయన మర్చిపోలేకపోతున్నట్టున్నారు. ప్రచారం నిర్వహిస్తూ సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు ఇచ్చారు. దీంతో కార్యకర్తలు అలర్ట్ చేయడంతో తేరుకున్న నామ.. కారు గుర్తుకే మన ఓటు అంటూ నినదించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.

మరో వైపు ఓ ఛానల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో కూడా తాను టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటి చేస్తున్నానని సైకిల్ గుర్తుకు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని అన్నారు. నామ పార్టీ మారినా తన పాత పార్టీ గుర్తును మర్చిపోలేకపోతున్నారని జనం నవ్వుకుంటున్నారు. నామ వీడియోలు కింద ఉన్నాయి చూడండి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి

https://trendingtelugunews.com/kcr-serious-on-telangana-revenue-staff/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *