Home Politics బిజెపి పార్టీకి కొత్త అర్థం చెప్పిన ఎంపీ కవిత

బిజెపి పార్టీకి కొత్త అర్థం చెప్పిన ఎంపీ కవిత

132
0
SHARE

బిజెపి అంటేనే భారతీయ జూటా పార్టీ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్వచించారు.శుక్రవారం నిజామాబాదు లో టిఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి నిజామాబాద్ జిల్లా సమావేశం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ కవిత మాట్లాడారు.

ఎన్నికల ముందు నరేంద్ర మోడీ చాలా చెప్పారని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పడంలేదు అని ఎంపి కవిత విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేశారు. ఎన్ని రద్దయ్యాయి అనే విషయం చెప్పలేదన్నారు.

గత ఎన్నికల ముందు నల్లధనం వెనక్కి తెస్తాం.. ఒక్కొక్క పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు ఎంతమందికి వేశారు అని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్త కథ చెప్తున్నార నీ చెప్పారు. ఊర్లకు పోయి జీరో బ్యాలెన్స్ ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయలను వారి అకౌంట్లో వేస్తామంటున్నారు.. గీ కథేందో చూద్దామని నేనూ ఒక ఎకౌంటు ని జీరో బ్యాలన్స్ చేస్తున్నా..వేస్తారో..లేదో చూస్తా.. అన్నారు.

టిఆర్ఎస్వి విద్యార్థులందరూ ఎకౌంట్లు తీసుకోండి ..ఎన్నికల లోపు డబ్బులు వేస్తారట ..అవన్నీ మన దగ్గర దోచుకున్న డబ్బే.. ఓటు మాత్రం కారుకు వేయండి.. ఈ విషయాన్ని గ్రామాల్లో చెప్పండి..ప్రలోభాలను పటాపంచలు చేసే విధంగా ప్రతి విద్యార్థి పిడికిలి బిగించాలి అని ఎంపి కవిత పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ప్రజలను ఆగం చేసేందుకు బిజెపి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపి కవిత మంది పడ్డారు. మన రాష్ట్రం ఇస్తున్న ఒక వెయ్యి రూపాయలు పెన్షను 40 లక్షల మందికి పైగా ఇస్తున్నామని కవిత తెలిపారు.

ఇందులో నాలుగు లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ 200 మాత్రమే వేస్తది. కానీ మనమిస్తున్న 800 తామే ఇస్తున్నామని అసత్య ప్రచారం చేస్తోంది..ఆన్లైన్ లో యాక్టివ్ గా ఉంటే ఒక్క సేకన్ చాలు వాళ్ళకు కౌంటర్ ఇవ్వడానికి…మీరంతా ఆ పని చేయాలి అని కవిత విద్యార్థులను కోరారు.

తెలంగాణలో లంచాలు తగ్గాయి..అవినీతి తగ్గింది.. అందుకే పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అని కవిత చెప్పారు. గూగుల్ , మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత సంస్థలు అమెరికా తర్వాత పెద్ద క్యాంపస్ మన హైదరాబాద్ లో పెట్టాయి.. బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తెలంగాణ లో ఉంది కాబట్టి ప్రఖ్యాత సంస్థలు వస్తున్నాయి అని వివరించారు.

లక్ష 56 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, ఈ ఐదేళ్లలో 13 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగిందనీ కవిత తెలిపారు.టాస్క్ ద్వారా చదువుకునే విద్యార్థులకు ఇండస్ట్రీ తో అనుసంధానం చేసి ఉద్యోగాలు దొరికే విధంగా చేస్తోందన్నారు.

నిజామాబాదు లో పెట్టిన ఐటి హబ్ ఆఫీస్ లో కూడా టాస్క్ ఆఫీస్ ఉంటుంది.. 35 కోట్లతో నిజామాబాదులో ఐటి హబ్ ను ప్రారంభించాం.. 60 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.. ఐటీ హబ్ 2 వ ఫేజ్ కూడా వస్తుంది అని కవిత తెలిపారు.

విద్యార్థుల సంక్షేమం అంటే తెలంగాణలోనే అన్నారు.ఎంపిగా బాధ్యతలు చేపట్టి ఇంటికి వచ్చాక నాకు ఒక టాస్క్ వచ్చింది ..రెండు రోజులు మాత్రమే టైం ఉంది..నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీట్లకు పర్మిషన్ ఇవ్వలేదు. పట్టుదలతో పర్మిషన్ ఇప్పించి..నాటి నుండి నేటి వరకు ఆ సీట్లను కాపాడుకుంటూనే పీజీ కోర్సును కూడా తెచ్చుకున్నాం.. 19 కోట్లను మంజూరు చేయించుకున్నా అని ఎంపి కవిత చెప్పారు.

ధైర్యం ఉంటే బీజేపీ వాళ్లు చెప్పమనండి..వాళ్ళు ఈ పని చేయగలరో..అని..అన్నారు18 కోట్లతో ఒక్కొక్క మోడల్ స్కూల్ ని నిర్మించుకున్నాం.. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే లక్ష్యం అని తెలిపారు.

వచ్చే ఐదు నుంచి పదేళ్ల లో కేజీ టు పీజీ ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అవుతుంది.. మనం అధికారంలోకి వచ్చే నాటికి విద్యా వ్యవస్థను నాశనం చేశారు ..ఇప్పుడు అన్నింటిని ఒక దగ్గరకు చేర్చుతున్నాం. ఐదేళ్లలో వందల పైచిలుకు హాస్టల్స్ ఏర్పాటు చేసుకున్నాం..అని చెప్పారు.

ఒక అబద్ధం వెయ్యి సార్లు చెప్తే నిజమైన నమ్మి అమాయక ప్రజలు ఉంటారు అట్లాంటి వారి కుట్రలను వెంటపడి అందించాలని ఎంపి కవిత విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ వి జి గౌడ్ టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నిజామాబాదు జిల్లా టిఆర్ఎస్వి కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

             ఇది కూడా చదవండి

సోషల్ మీడియాలో సమస్య చెప్పిన యువకుడు.. స్పందించిన సీఎం కేసీఆర్