రైతును పట్కొని టిఆర్ఎస్ లీడర్ బూతులు (ఆడియో టేప్)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ లీడర్లదే రాజ్యం. కెసిఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్దిదారులంటే చాలా చులకన. లబ్దిదారులు కావాలంటే పార్టీలో చేరాలే. అక్కడ  ఆ ఏరియా   అన్న ఎట్లచెబితే అలా చేయాలే. లేదంటే బూతు పంచాంగమే. ఈ ఆడియో చూడండి మీకే అర్థమవుతుంది.యాదాద్రి జిల్లాలో ఒక టీఆర్ఎస్ లీడర్ (అన్న) సొంత పార్టీ మనిషి మీద ఎలా నోరు పారేసుకుంటున్నాడో వినండి.

అసలేం జరిగిందంటే…యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో కృష్ణారెడ్డి అనే రైతు ఐదు సంత్సరాల క్రితం తనకున్న ఆరు ఎకరాల భూమిలో ఒక మూలకు అంటే 5 గుంటల జాగాలో కోళ్ల ఫారం పెట్టుకుని మిగతా  భూమిలో పంట పెట్టుకుంటాడు.
కానీ రైతు బంధు పథకం కింద తనకు ఆరు ఎకరాలకు చెక్కువస్తుందనుకున్నారు. లేదా కనీసం  5 గుంటలు పోను మిగతా భూమికి చెక్కు వస్తదని ఆశపడ్డాడు. చెక్కుల్లో కృష్ణా రెడ్డి పేరు లేదు. కోళ్ల ఫారం ఉంది కాబట్టి మొత్తం భూమికి రెవెన్యూ అధికారులు రైతుబంధు చెక్కు ఆపేశారు.  ఇదెక్కడి న్యాయం? తనకు కూడా చెక్క రావాలని, దయచేసి ఇప్పించాలని వాళ్ల ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి  దగ్గరకు పోయిండు. తన గోడు ఎల్లబోసుకున్నడు.

ఆయన చేసింది తప్పా? అయితే,ఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్యకు ఇది నచ్చలేదు. మేడమ్ దగ్గరకు పోయి లొల్లిచెస్తావా అని  నోటికొచ్చినట్లు బూతులు తిట్టాడు ఫోన్ లో. ఆ కర్రె వెంకటయ్య సతీమణి యాదగిరిగుట్ట జెడ్పీటిసి.దీనితో ఆయన పార్టీ అంతా తనదేఅనుకుంటుంటాడు. ఇలా నోరు పారేసుకోవడం మంచిదికాదని కృష్ణారెడ్డి వారించినా వినకుండా బూతులు తిట్టాడు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తకే ఇలాంటి పచ్చి బూతులు ఉంటే,మరి సామాన్యుని పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాడు. రైతును బండబూతులు తిట్టిన జెడ్పీటిసి భర్త కర్రె వెంకటయ్య  మీద చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *