ద్రావిడ్ చేసిన తప్పువల్ల “డబల్ సెంచరీ” చేయలేకపోయిన సచిన్

(సిఎస్ సలీమ్ బాషా)
సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ  ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ (Playing It My Way) లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
2004 ముల్తాన్ టెస్ట్లో టెండూల్కర్ 194 వద్ద ఉన్నప్పుడు భారత్ ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశాడు రాహుల్ ద్రావిడ్. ద్రావిడ్ తీసుకున్న నిర్ణయంతో సచిన్ కోపం తో పాటు షాక్ కు గురైనట్లు చెప్పాడు.
అలాగే తనని ఒంటరిగా వదిలేయమని” ద్రావిడ్ తో చెప్పాడు.
”ఈ సంఘటన మైదానంలో నా ప్రమేయానికి ఎలాంటి ప్రభావం చూపదని నేను రాహుల్కు హామీ ఇచ్చాను, కాని మైదానానికి దూరంగా, ఏమి జరిగిందో తెలుసుకోవడానికి కొంతకాలం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను “అని టెండూల్కర్ రాశాడు.
తన కెరీర్ మొత్తంలో, టెండూల్కర్ ‘టీమ్ మ్యాన్’ గా ప్రసిద్ది చెందాడు ,ఎప్పుడూ నిరాశను బహిరంగంగా వ్యక్తం చేయలేదు. అయితే ఇది భిన్నమైనది, ఈ విషయంపై తాను కలత చెందుతున్నానని సచిన్ మీడియాకు స్పష్టం చేశాడు.
ఈ విషయం గురించి అప్పటి కోచ్ జాన్ రైట్ తన పుస్తకం ఇండియన్ సమ్మర్ లో వివరించాడు. ద్రవిడ్ ఆకస్మిక ప్రకటన సృష్టించిన నాటకం కొన్ని ఉద్రిక్త క్షణాలకు దారితీసిందని అంగీకరించాడు.
అలాగే నిద్రలేని రాత్రి గడపడం గురించి ప్రస్తావించాడు. అలాగే భారత జట్టును విభజించడానికి ఈ సమస్య కారణమవుతుందని గంగూలీ భయపడ్డాడు.
రైట్ ఈ పరిస్థితికి ఎవ్వరినీ నిందించలేదు, కాని ద్రవిడ్ చాలా ముందుగానే ప్రకటించి ఉండాలని, కోచ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ను(ద్రవిడ్) ఒప్పించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పాడు.
“ఇండియన్ సమ్మర్” పుస్తకం లో రైట్ ఇలా వ్రాశాడు: “నేను ముందు ప్రకటించమని ద్రవిడ్ lr ఒప్పించి ఉండాలి, ఒక బ్యాట్స్ మాన్ 170 లేదా 180 ఉన్నప్పుడు డిక్లేర్ చేయడం వరకు ఓకే, 194 లో ఉన్నప్పుడు డిక్లేర్ చేయడం సరైన విషయం కాదు అని అతను గ్రహించి ఉండాలి. మరోవైపు ఆలోచిస్తే టెండూల్కర్ త్వరగా డబుల్ సెంచరీ సాధించడానికి ప్రయత్నించి ఉండవలసింది. తన నిర్ణయాన్ని పొరపాటుగా భావించక పోయినా, నాలుగు రోజుల్లో మ్యాచ్ ముగుస్తుందని తనకు తెలిసి ఉంటే, తను ప్రకటించే వాడిని కాదని  ద్రవిడ్ చెప్పాడు.”పునరాలోచన ఒక అందమైన విషయం.
టెస్ట్ నాలుగు రోజుల్లో ముగుస్తుందని నాకు తెలిసి ఉంటే, అప్పుడు నేను ప్రకటించే వాడిని కాదు. మా ఇద్దరికీ ఈ విషయానికి సంబంధించి కొంత సమస్య ఉంది. నిజానికి ఈ విషయాన్ని పెద్దది చేశారు.కనీసం ఇది జట్టులో సమస్య కాదు. మేము దాన్ని క్రమబద్ధీకరించాము. మేము ఒకరినొకరు గౌరవించు కుంటాము ” అని కూడా ద్రవిడ్ చెప్పాడు.
కొసమెరుపు ఏంటంటే టెండూల్కర్ తో కలిసి ఆడుతున్న వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ (309) సాధించడం.
అంతవరకు ఏ భారతీయ ఆటగాడు కూడా ట్రిపుల్ సెంచరీ సాధించలేదు. దీని తర్వాత సెహ్వాగ్ కి ” ముల్తాన్ కా సుల్తాన్” గా పేరు వచ్చింది.
ఇప్పటి వరకు కూడా 2 ట్రిపుల్ సెంచరీలు ((సౌత్ ఆఫ్రికాతో 309, చెన్నై 2008 లో) సాధించిన ఏకైక భారతీయ ఆటగాడు కూడా సెహ్వాగే! భారత్ పాకిస్థాన్ గడ్డపై సాధించిన మొదటి టెస్టు విజయం కూడా ఇదే. అంతేకాకుండా ఇండియా పాకిస్తాన్ లో మొదటి టెస్ట్ సిరీస్ విజయం కూడా సాధించింది ఈ సిరీస్ లోనే.

(సలీమ్ బాషా స్పోర్ట్స్ జర్నలిస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *