క్రికెట్ మైదానంలో దాదాపు అన్ని రకాలుగా ఔటైన మొహిందర్ అమర్ నాథ్

(CS Saleem Basha)
క్రికెట్లో బ్యాట్స్ మన్ ఎన్నో రకాలుగా అవుట్ (out) కావచ్చు. (క్రికెట్ నిబంధనలు 2017 ప్రకారం, 32 to 40) Caught (32), bowled (33), Hit the ball twice (34), Hit wicket(35), LBW(36), Obstructing the field(37), run out(38), stumped(39), Timed out(40), Handling the ball, Retired out(25.4)
Handling the ball మాత్రం ఇప్పుడు లేదు. దాన్ని Obstructing the field లో కలిపేశారు. Retired Out అన్నది ఒక ప్రత్యేకమైన నిబంధన. అంటే మైదానంలో ఉన్న ఏ బ్యాట్స్ మన్ అయినా తనకు ఇష్టం వచ్చినప్పుడు మైదానం వదిలి వెళ్ళిపోవచ్చు(అవుట్ కాకపోయినా). అయితే తిరిగి మైదానంలోకి బ్యాటింగ్ కి రావాలంటే ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ అనుమతి అవసరం. అలా లేని పక్షంలో ఆ బ్యాట్స్ మెన్ ని కేవలం గణాంకాల కోసం “Retired-out” గా పరిగణిస్తారు.
ఒకప్పటి భారత బ్యాట్స్ మన్, భారత్, 1983 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర వహించిన మొహిందర్ అమర్ నాథ్, మైదానంలో (అంతర్జాతీయ క్రికెట్లో) దాదాపు అన్ని రకాలుగా ( ఒక్క Hitting the ball twice తప్ప) అవుట్ అయిన బ్యాట్స్ మన్ గా నిలుస్తాడు.
Handling the ball, Obstructing the field అనే అసాధారణమైన,చిత్రమైన రెండు నిబంధన ద్వారా అవుట్ అయిన ఏకైక అంతర్జాతీయ బ్యాట్స్ మన్ అమర్ నాథ్! ఈ రెండు సంఘటనలు వన్డే మ్యాచ్ ల లోనే జరగడం విశేషం! అవేంటో చూద్దాం.
1986 ఫిబ్రవరి 9వ తారీఖున, మెల్ బొర్న్ లో జరిగిన Benson and hedges ముక్కోణపు సిరీస్ రెండో ఫైనల్ లో అమర్ నాథ్ బంతిని చేతితో పట్టుకోవడం ద్వారా (Handling the ball) అవుటయ్యాడు. 15 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న అమర్ నాథ్ ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ జాన్ మాథ్యూస్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడాడు. అది వికెట్ల వైపు వెళ్తుండగా తన చేత్తో పక్కకి తోసేశాడు. అయితే అంపైర్ నిర్ణయం వెలువడక ముందే అమర్నాథ్ విలియం వైపుకి నడవడం ద్వారా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ ను ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది
ఇది కూడా చదవండి
మనదేశంలో నిర్వహించిన నెహ్రూ కప్ సందర్భంగా 1989, అక్టోబర్ 22న అహ్మదాబాదులో
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 28 పరుగుల వద్ద ఒక బంతిని ఆడిన అమర్ నాథ్, రనౌట్ కాకుండా ఉండడం కోసం బంతిని శ్రీలంక ఫీల్డర్లను అందకుండా కాలితో పక్కకు తోసేయడంతో Obstructing the field (ఫీల్డర్లకు అడ్డుపడటం ) అని అంపైర్ ద్వారా అవుట్ గా ప్రకటించబడ్డాడు.  (అయితే ఆ మ్యాచ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. కానీ సెమీఫైనల్లో వెస్టిండీస్ ఇండియా ని ఓడించి ఫైనల్ చేరింది. అయితే నవంబర్ 1, 1989 కోల్కతాలో జరిగిన నెహ్రూ కప్ ఫైనల్ లో పాకిస్తాన్ వెస్టిండీస్ ను ఓడించి కప్ సొంతం చేసుకుంది.)
ఆ విధంగా మొహిందర్ అమర్ నాథ్, మైదానంలో దాదాపు అన్ని రకాలుగా అవుట్ అయిన బ్యాట్స్ మన్ గా నిలిచిపోయాడు.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)