ఒకపుడు క్రికెట్ జెంటిల్మన్ గేమ్… ఇవిగో మచ్చుతునకలు

(CS Saleem Basha)
క్రికెట్ అన్నది Gentlemens గేమ్. అంటే మర్యాదస్తుల ఆట. కానీ ఇప్పుడు అది వ్యాపారస్తుల ఆట.
ఇప్పుడు క్రికెట్ లో మర్యాదస్తుల కన్నా ఎలాగైనా గెలవాలని భావించే ఆటగాళ్లు ఎక్కువ కనిపిస్తారు. క్రికెట్ ఇప్పుడు కాసులు కురిపించే పెద్ద వ్యాపారం. ” క్రీడా స్ఫూర్తి” కన్నా గెలవడం ముఖ్యం అని ఆటగాళ్లు, ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు ఇప్పుడు అట్లా అనిపించడం లేదు. క్రికెట్ లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన మర్యాదస్తులు అంటే జెంటిల్మెన్ కొంతమంది ఉన్నారు. క్రీడా స్ఫూర్తి కి ప్రతీకలుగా ఉన్న ఆ జెంటిల్మెన్(మర్యాదస్తులు)ల గురించి చూద్దాం.
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా భారత జట్టు బ్యాట్స్మెన్ వినూ మన్ కడ్ ఆస్ట్రేలియా బౌలర్ రే లిండ్వాల్ బౌలింగ్ ను ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. నాలుగు సార్లు వినూ మన్ కడ్ ని అవుట్ చేశాడు రే లిండ్వాల్. మన్కడ్ మూడుసార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మన్కడ్ రే లిండ్వాల్ సలహా అడిగితే ” నువ్వు యార్కర్ ని అలస్యంగా ఆడుతున్నావు” అని చెప్పాడు. ఒక ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కీ సలహా ఇవ్వడం లిండ్వాల్ క్రీడాస్ఫూర్తి కి గొప్ప నిదర్శనం. తర్వాతి టెస్ట్ మ్యాచ్లో వినూ మన్ కడ్ 116 పరుగులు చేయడం విశేషం!
1987 రిలయన్స్ హాయ్ ఆ ప్రపంచ కప్ సందర్భంగా, వెస్టిండీస్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ కోట్ని వాల్ష్ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు.
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో కోట్ని వాల్ష్ బౌలింగ్ చేస్తుండగా నాన్ స్ట్రైకర్ సలీం జాఫర్ బాల్ వేయకముందే క్రీజు వదిలి ముందుకు వచ్చాడు.
అయితే వాల్ష్ అతన్ని రనౌట్ రనౌట్ చేసే అవకాశం ఉన్నా చేయలేదు. వాల్ష్ అతన్ని కేవలం హెచ్చరించి మళ్లీ బాల్ వేశాడు అతన్ని రనౌట్ చేసి ఉంటే వెస్టిండీస్ మ్యాచ్ గెలిచేది, సెమీఫైనల్ కి చేరే అవకాశం ఉండేది.
అలా తర్వాత వేసిన బంతికి బ్యాట్స్మన్ అబ్దుల్ ఖాదిర్ చేసిన రెండు పరుగులతో పాకిస్తాన్ విజయం సాధించింది.
ఈ సంఘటన క్రికెట్ చరిత్రలోనే క్రీడా స్ఫూర్తి కి ప్రతీకగా నిలిచి పోయింది. వాల్ష్ క్రీడాస్ఫూర్తిని ప్రశంసిస్తూ అప్పటి పాకిస్థాన్ ప్రెసిడెంట్ జనరల్ జియావుల్ హక్ వాల్స్ కు ఓకే ఖరీదైన తివాచీని బహుకరించడం విశేషం…
1980 భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన గోల్డెన్ జూబ్లీ టెస్ట్ మ్యాచ్లో ఒక సంఘటన జరిగింది. ఇంగ్లాండ్ కు చెందిన బాబ్ టైలర్ క్యాచ్ అవుట్ అయ్యాడు.
అయితే బంతి ప్యాడ్ కు తగిలింది అని గమనించిన భారత జట్టు కెప్టెన్ విశ్వనాధ్ బాబ్ టైలర్ ను వెనక్కి పిలిచాడు. ఆ తర్వాత టైలర్ బోథం తో కలిసి జట్టును గెలిపించటం జరిగింది.
1989 లాహోర్లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ లో మరో సంఘటన జరిగింది. వకార్ యూనిస్ బౌలింగ్లో కృష్ణమాచారి శ్రీకాంత్ ఎల్ బి డబ్ల్యు గా అంపైర్ ప్రకటించాడు.
అయితే కోపంతో వెనుదిరిగిన శ్రీకాంత్ ను పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ బ్యాటింగ్ చేయమన్నాడు. దీనితో అంపైర్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అయితే తర్వాత బంతికే శ్రీకాంత్ క్యాచ్ అవుట్ అవ్వడం విశేషం.

ఈ సంఘటన క్రీడా స్ఫూర్తి కి ఉదాహరణ. అది పాకిస్తాన్ లో జరగడం, విశేషమే!
అటాకింగ్ బ్యాటింగ్ స్టైల్ ఉన్నప్పటికీ, ఆసీస్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఎప్పుడు ప్రశాంతమైన ప్రవర్తనను కలిగి ఉంటాడు.
2003 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో ఒక ఉదాహరణ ప్రపంచ క్రికెట్ గిల్క్రిస్ట్ వైపు చూసే విధానాన్ని మార్చింది.
అరవింద్ డిసిల్వా బౌలింగ్ లో స్వీట్ షాప్ ఆడిన గిల్ క్రిస్ట్ వికెట్ కీపర్ సంగక్కార కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అంపైర్ శ్రీలంక ఆటగాళ్లు ఆపిల్ తిరస్కరించాడు. అయితే తనంత తానే మైదానం వదిలి వెళ్లిపోయాడు.
క్రీడా స్ఫూర్తి కి ఉదాహరణగా నిలిచిన ఈ సంఘటన లో ఒక ఆస్ట్రేలియన్ ఆటగాడు అలా చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
న్యూజిలాండ్ బౌలర్ డానియెల్ వెట్టోరి 2012లో జింబాబ్వేతో జరిగిన ఒక ఉత్కంఠభరిత మ్యాచ్లో పుట్టిన ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి కీ “ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్” అవార్డును అందుకున్నాడు.
వెట్టోరి బౌలింగ్ వేస్తున్నప్పుడు నాన్ స్ట్రైకర్ మాల్కం ని పొరపాటున ఢీకొన్నాడు. దాంతో మాల్కమ్ రన్ తీయలేకపోయాడు. కానీ బ్యాటింగ్ ఎండ్ లో ఉన్న రెగిస్ రన్ కోసం పరుగెత్తి వచ్చాడు.
కానీ వెనక్కి వెళ్ళ లేక పోయాడు. దాంతో న్యూజిలాండ్ వికెట్ కీపర్ రెగిస్ ని రనౌట్ చేశాడు. కానీ వెట్టోరి తన పొరపాటు వల్ల రెగిస్ వెనక్కి వెళ్ళ లేక పోయాడు భావించి తన అప్పీల్ వెనక్కి తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు.
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *