క్రికెట్ చుట్టూర ఎన్ని వింతలూ విశేషాలో…

(CS Saleem Basha)
క్రికెట్ లో జరిగినన్ని వింత, విచిత్ర సంఘటనలు మరే ఆటలో జరగ లేదంటే అతిశయోక్తి కాదు. బ్రెజీలియన్స్ కు ఫుట్ బాల్ అంటే ఎలాగో భారతీయులకు క్రికెట్ అంటే అలాగా. క్రికెట్ అనేది ఒక సరదా ఆట అని అంటుంటారు. బహుశా అలా కాకపోయినా మనకు ఈ ఆటలో ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ కనిపిస్తాయి. మైదానంలో జరిగేవి కొన్నైతే, మైదానం బయట జరిగేవి కొన్ని. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల సంబంధించి వింతలు, చమత్కారాలు, విశేషాలు తెలుసుకుందాం.

* ఇంత వరకు ఒలింపిక్స్ లో ఒక్కసారి మాత్రమే క్రికెట్ ఆట ఆడడం జరిగింది. 1900 పారిస్ ఒలింపిక్స్ లో మొదటిసారి ప్రవేశపెట్టిన క్రికెట్ పోటీల్లో కేవలం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి
* 1993- 94 ఇండియా టూర్ సందర్భంగా వెస్టిండీస్ ఆటగాడు జిమ్మీ ఆడమ్స్ఎక్కువగా బంతులను ప్యాడ్ తో ఆడి ఇండియన్ స్పిన్నర్స్ ను చికాకు పెట్టాడు ! అయితే తర్వాత అతనికి ముద్దు పేరు కూడా వచ్చింది “Pad”ams అని.
* మైకెల్ హోల్డింగ్, వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్. ఒకసారి 2001 సమ్మర్ సీజన్లో ఇంగ్లాండ్లో, అతనికి 100 పౌండ్ల జరిమానా విధించారు. అయితే అది మైదానంలో జరిగిన తప్పు గురించి కాదు. మైదానం బయట జరిగిన తప్పు గురించి. కారును 50 కిలోమీటర్ల వేగంతో నడపాల్సిన చోట అతను 66 కిలోమీటర్ల వేగంతో నడపటం వల్ల జరిమానా పడడం విశేషం.
* సచిన్ మరియు వినోద్ కాంబ్లీ ప్రపంచ రికార్డ్ తో పాటు మరో విశిష్టతను కూడా సాధించారు. వాళ్లు వాళ్ల బర్త్ డే సందర్భంగా చెరొక ODI సెంచరీ సాధించారు. మొదట కాంబ్లీ అతని 21వ బర్త్ డే కి సెంచరీ సాధించాడు. అయితే సచిన్ 25 వ బర్త్ డే సందర్భంగా సెంచరీ కొట్టాడు
*వివ్ రిచర్డ్స్ తన క్రికెట్ జీవితంలో ఎన్నడూ కూడా హెల్మెట్ ధరించ లేదు. అలాగే మన సునీల్ గవాస్కర్ కూడా హెల్మెట్ ధరించి లేదు కానీ ఒక skull cap మాత్రం ధరించేవాడు. అది అతనికి క్యాప్ కే ఉండేది.
రచయిత సి.వెంకటేశ్
* హైదరాబాద్ కు చెందిన ఆసిఫ్ ఇక్బాల్ 1960-61 లో పాకిస్థాన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు, సౌత్ జోన్ తో జరిగిన జరిగిన మ్యాచ్ లో సౌత్ జోన్ కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కు వలస వెళ్లి అక్కడి నేషనల్ టీమ్ జట్టు కెప్టెన్ గా ఉన్నాడు!
* ఇంగ్లాండ్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ Brain Statham బౌన్సర్లు వేసే ముందు బ్యాట్స్మెన్ లను హెచ్చరించే వాడట. అలా అతను మంచి బౌలర్ గా చరిత్రలో నిలిచాడు.
*టెస్టుల్లో లంచ్ కి ముందు సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్మన్ రంజిత్ సింగ్. అంతేకాకుండా రెండు వేర్వేరు సెంచరీలు ఒకే రోజు అదే మ్యాచ్ లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను సాధించడము విశేషం. మరే క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఇది అతను ససెక్స్ తరపున ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ లో యార్క్ షైర్ మీద సాధించాడు.
*బ్యాట్స్మెన్లు ఎప్పుడైనా సెంచరీలు గాని అర్థసెంచరీలు గాని సాధించినప్పుడు బ్యాట్ పైకిలేపి ప్రేక్షకులకు అభివాదం చేయడం ఒక అలవాటు. అయితే ఇదే ఘనత బౌలరు సాధించినప్పుడు ఎందుకు ఇలాంటి అభివాదాలు చెయ్యరు? దీనికి సమాధానంగా ఆస్ట్రేలియాకు చెందిన Mcgrath మరియు Shane Warn లు ఇలాంటి అభివాదానికి తెరలేపారు. వారిరువురూ ఎప్పుడైనా ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసినప్పుడు బంతిని పైకెత్తి అభివాదం చేసేవారు.
* ఇంగ్లాండ్ కు చెందిన క్రికెటర్లు హెడ్లీ వెరైటీ, కెన్ ఫ్రేమ్స్ రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతూ మరణించారు.
* సాధారణంగా ఫాస్ట్ బౌలింగ్ వేసేవాళ్ళు కొంచెం రఫ్ గా ఉంటారు. కోపం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే శ్రీలంకకు చెందిన ఫాస్ట్ బౌలర్ రమేష్ రత్నాయకే మాత్రం సున్నిత మనస్కుడు. 1982 లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ జాన్ రైట్ రమేష్ వేసిన బంతిని ఆడబోయి ముక్కు కు తగిలించుకున్నాడు. అంతేకాకుండా బొటబొటా రక్తం కూడా కారింది. జాన్ రైట్ మళ్లీ ఆడడానికి సిద్ధమవుతున్న తరుణంలో రక్తం చూసిన రమేష్ స్పృహ తప్పి పడిపోయాడు!
* 1877 మొట్ట మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ను నలభై ఐదు పరుగుల తేడాతో ఓడించింది. మళ్లీ 100 సంవత్సరాల తర్వాత అదే రెండు జట్ల మధ్య జరిగిన “సెంటినరీ” మ్యాచ్ లో చిత్రంగా మళ్లీ ఆస్ట్రేలియా జట్టు 45 పరుగుల తేడాతో నే ఇంగ్లాండ్ జట్టును ఓడించడం విచిత్రం!
క్రికెటర్ ల మూఢ నమ్మకాల గురించి మరోసారి చూద్దాం.
(ఇవి ప్రముఖ క్రీడా రచయిత, క్రికెట్ వ్యాఖ్యాత సి.వెంకటేశ్ రాసిన “Bits and Pieces” పుస్తకం నుంచి అతని అనుమతితో రాసినవి. రచయితకు ధన్యవాదాలు)
Saleem Basha CS

(సిఎస్ సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ప్రవృత్తి – 9393737937)