గోటీలాట ఆడిన తెలంగాణ స్పీకర్ (వీడియో)

సిరికొండ మధుసూదనాచారి అనే వ్యక్తి తెలంగాణ అసెంబ్లీకి అధిపతి. అసెంబ్లీ స్పీకర్ గా ఆయనకు ఉన్న అధికారాలు అపారం. కనుసైగలతోనే ఆయన యావత్ అసెంబ్లీని శాసించగలరు. కానీ ఆయన అసెంబ్లీలో ఉన్నంత వరకే స్పీకర్ గా నడుచుకుంటారు. తన సొంత నియోజకవర్గం పోయిండంటే చాలు తాను స్పీకర్ ను అనే విషయమే మరచిపోతారు.

తాజాగా ఆయన తన నియోజకవర్గం భూపాలపల్లిలో పర్యటించారు. అక్కడ స్పీకర్ లా వ్యవహరించలేదు. ఒక గ్రామంలో చిన్నపిల్లలతో కలిసి గోటీలాట ఆడి చిన్నప్పటి సరదాలను తీర్చుకున్నారు. పిల్లలు కూడా స్పీకర్ తో గోటీలాడారు.

స్పీకర్ ఎప్పుడు నియోజకవర్గం పర్యటించినా తనదైన శైలిలో అక్కడి ప్రజలతో మమేకం అవుతారు. గతంలో నిండు చలిలో ఆయన నియోజకవర్గంలో పల్లె నిద్ర కు ఉపక్రమించారు. ఆ సమయంలో గ్రామాల్లో రాత్రిపూట తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు గోటీలాడ ఆడుతున్న స్పీకర్ వీడియో పైన ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *