హైదరాబాద్ మెట్రో రైల్లో రేవంత్ క్రేజ్ చూడండి (వీడియో)

హైదరాబాద్ మెట్రో రైల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభిమానులు హల్ చల్ చేశారు. వారంతా తమ ముఖాలకు రేవంత్ మాస్క్ వేసుకుని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ పాటలకు మెట్రో ట్రెయిన్ లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.
కొడంగల్ లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఓటమి ఇరు రాష్ట్రాల్లోని అభిమానులకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.
అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో, అభిమానుల అభీష్టం మేరకు మల్కాజిగిరి పార్లమెంటు బరిలో నిలబడ్డారు రేవంత్. ఆయనపై అభిమానంతో అభిమానులు వినూత్నంగా ప్రచారం చేసారు. మెట్రో ట్రెయిన్లో రేవంత్ మాస్క్ లు తొడుక్కుని డ్యాన్స్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/vikari-nama-ugadi-subhakankshalu/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *