Home Breaking తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం డేట్ ఫిక్స్

తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం డేట్ ఫిక్స్

225
0
SHARE

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకు రాజధానిలో తాడేపల్లిలో గృహం నిర్మించుకున్నారు. ఇంటికి సమీపంలోనే వైసీపీ కార్యాలయ నిర్మాణం కూడా చేశారు. జగన్ నూతన గృహప్రవేశానికి అంతా సిద్ధం అయింది. గృహప్రవేశానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు.

ఈ నెల 27 న జగన్ రాజధానిలోని తన కొత్త ఇంటికి గృహప్రవేశం చేయనున్నారు. దీనితోపాటు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అదే రోజు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా హాజరవ్వాలని పిలుపునిచ్చారు పార్టీ ముఖ్య నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. జగన్ ఎప్పుడు రాజధానికి వస్తాడా అని ఎదురు చేస్తున్న అభిమానుల కల ఈ నెల 27 న నెరవేరనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.