చిన్నారెడ్డి, టిడిపి రావుల కు జేజమ్మ చెక్ (వీడియో)

(మానేపల్లి రాంబాబు)

పాలమూరులో పట్టు బిగిస్తున్నారు గద్వాల జేజమ్మ. ఆమె తన నియోజకవర్గంలోనే కాదు తన అనుచరుల నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ బలోపేతం పై దృష్టిపెట్టారు. ఒకవైపు కాంగ్రెస్ ను బలోపేతం చేస్తూనే మరోవైపు పార్టీలో తన ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసరుతున్నారు.

తాజాగా దేవరకద్రలో ఆమె ఒక టిఆర్ఎస్ సర్పంచ్ తో పాటు చాలామంది టిఆర్ఎస్ కార్యకర్తలను దేవరకద్రలో పార్టీలో చేర్చుకున్నారు. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ దేవరకద్రలో వందకు వంద శాతం పవన్ కే టికెట్ వస్తదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి ఒరిగేదేమీ లేదని తేల్చి చెప్పారు.

డికె అరుణ మాటల సందర్భంలో టిడిపి వాళ్లు కూడా పార్టీలోకి రావాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. గతంలో టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డిని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లోకి రావుల వస్తే.. దేవరకద్రలో పోటీ చేస్తాడని కూడా చెప్పారు. దేవరకద్రలో పవన్ కుమార్ రెడ్డి కంటే రావుల స్ట్రాంగ్ అభ్యర్థి అవుతాడన్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలకు చెక్ పెట్టేలా డికె అరుణ కామెంట్లు గుప్పించారు. ఆమె ఏమన్నారో పైన వీడియోలో ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *