పద్మారావుపై హరీష్ రావు హార్ట్ టచ్చింగ్ కామెంట్

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ గా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆయనకు పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అందరిలో కెళ్ల ఆయన గుండెలకు హత్తుకునేలా పంచ్ డైలాగులు పేల్చారు మాజీ మంత్రి హరీష్ రావు.
తెలంగాణ స్వరాష్ట్రంలో హరీష్ రావు, పద్మారావు గౌడ్ ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు. కానీ కారణాలేంటో తెలియదు… కాలం కలిసి రాలేదేమో కానీ తెలంగాణ రెండో ప్రభుత్వంలో మాత్రం ఇద్దరూ మాజీ మంత్రులుగానే మిగిలిపోయారు. అయితే పద్మారావు గౌడ్ మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు కేసిఆర్. మరి హరీష్ రావుకు మాత్రం ఏ పదవీ లేకుండా మాజీ మంత్రి హోదాలోనే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఇక సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అభినందన తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో హరీష్ రావు ఆయనను ఇంప్రెస్ చేసేలా మాట్లాడారు.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
పద్మం బురదలోనూ వికసిస్తుంది…
‘‘పద్మం బురదలో కూడా వికసిస్తుంది. పద్మారావుగా పజ్జన్న కార్పొరేటర్ గా మంచిపేరు తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేగా మంచిపేరు తెచ్చుకున్నారు., ఎక్సైజ్ శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. డిప్యూటీ స్పీకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఒక పద్మం లాగా వికసిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
మీ ఇష్ట దైవం కొమరెల్లి మల్లన్న ఆశిస్సులతో మంచి గౌరవాన్ని, మంచి భవిష్యత్తును పొందాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.
గత 20 సంవత్సరాలు ఉద్యమ సహచరుడిగా, సహచర ఎమ్మెల్యేగా, సహచర మంత్రిగా పద్మారావుతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దొరికింది. మీరు ఏ హోదాలో ఉన్నా ఎవరైనా మిమ్మల్ని పజ్జన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. పజ్జన్నా అని ఇష్టంగా, ముద్దుగా పిల్చుకుంటారు. మీరు కూడా అంతే స్థాయిలో చిరునవ్వుతో పలుకరిస్తారు.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. జంట నగరాల్లో కల్లు దుకాణాలు తెరిపించడం, చెట్ల రకాన్ని రద్దు చేసిన విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం మీకు గుర్తింపును తెచ్చింది. తెలంగాణలో గుడుంబా మహమ్మారిని నిర్మూలించడం మీ ఘనతనే. సానియా మీర్జా, పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారులు మీ హయాంలోనే గొప్ప గొప్ప అవార్డులు సాధించారు. ఇందులో మీ కృషి ఎంతో ఉంది.
2001లో జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగితే అప్పుడు 2 కార్పొరేటర్లు మాత్రమే గెలిచింది. అందులో మోండా మార్కెట్ లో పద్మారావు గెలిచారు. జిహెచ్ఎంసిలో టిఆర్ఎస్ జెండా ఎగురవేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *