మిరియాల వలన బోలెడు ప్రయోజనాలు

సుగంధ ద్రవ్యాలలో రారాజంట! మనతో గుప్పెడు ఉంటే శత్రువు ఇంట్లో కూడా ధైర్యంగా భోజనం చేయొచ్చంట!! అవి ఏంటో కాదు ప్రతి ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే మిరియాలు……!! ఇది ఆహార పదార్ధాలలో వేస్తే ఆహారానికి రుచిని, మంచి అరోమాను అందిస్తుంది. అంతేకాదు ఇవి తరచూ మనం తీసుకునే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ కరోనా టైములో ప్రతి ఒక్కరు తీసుకుంటున్న ఇమ్మ్యూనిటీ డ్రింక్స్ లో (immunity drinks) మిరియాలను తప్పనిసరిగా చేరుస్తన్నారంటే మిరియాలు ఎంత ఆరోగ్యకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
# మిరియాలు పిపరిన్ రసాయనం కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది. జీర్ణ శక్తిని వృద్ధి చేయటానికి, శరీర బరువును సమతుల్యంగా ఉంచటానికి తోడ్పడతాయి.
# పొట్టలోని వాయువులను బయటకి నెట్టివేసే శక్తి మిరియాలకు ఉంది. పొట్టలో వాయువులు ఏర్పడినప్పుడు గ్లాస్ మజ్జిగలో పావు టీ స్పూన్ మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
# అజీర్ణం తో బాధపడేవారు మిరియాలపొడిని బెల్లం తో కలిపి చిన్న ఉండాలి చేసి భోజనానికి ముందు తీసుకుంటే సమస్య తగ్గి ఆహరం త్వరగా జీర్ణం అవుతుంది.
# అధిక బరువు తగ్గటానికి భోజనానికి గంట ముందు అరగ్రాము మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుని గ్లాస్ వేడినీళ్లు తాగితే ఫలితం కనిపిస్తుంది.
# మిరియాలకు జలుబు, జ్వరం తగ్గించే గుణం ఉంది. ఐదు లేదా ఆరు మిరియాల గింజలను మెత్తని పొడి చేసి వేడి నీటిలో కలుపుకుని త్రాగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే జలుబు, జ్వరం తగ్గుతాయి.
# ఒక గ్రాము మిరియాలను తీసుకుని దోరగా వేయించి పొడి చేసి చిటికెడు లవంగాల పొడి, పావు టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ తీసుకుని గ్లాస్ నీటిలో వేసి మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు దూరం అవుతాయి.
# చిటికెడు పసుపు, చిటికెడు మిరియాలపొడి కలిపి నీటిలో మరిగించి రాత్రి సమయంలో తాగితే తుమ్ములు, జలుబు తగ్గుతాయి.
#అధిక దప్పిక ఉన్నవారు కొంచం మిరియాలపొడి నీళ్లలో కలిపి తాగితే దప్పిక వేయదు.
# చిగుళ్లకు సంబంధించిన ఇబ్బందులకు మిరియాలపొడి, చిటికెడు రాతి ఉప్పు కలిపిన మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి కాసేపయ్యాక గోరు వెచ్చని నీళ్లతో పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, నోటి నుండి రక్తం కారటం వంటివి తగ్గుతాయి.
# కండరాల నొప్పులు నరాల నొప్పులు ఉన్నప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదంపప్పుతో కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుంది.
# కీళ్ళవాతంతో బాధపడేవారు మిరియాలను నువ్వుల నూనెతో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే నొప్పి వాపు తగ్గుతుంది.
# గొంతు గర గర ఉంటే గోరు వెచ్చని పాలలో మిరియాలపొడి, పసుపు, తేనె కలిపి సేవిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కరోనాకి మంచి రెమిడీ గా (corona remedy) పని చేస్తుంది కూడా.
# మిరియాలు తినటానికి మంటగా ఉన్న చర్మంపై తెల్ల మచ్చలు తగ్గించటంలో బాగా పని చేస్తాయి.
# గాయాలు, చర్మ వ్యాధులు, ఎగ్జిమా, స్కేబీస్, ఇతర ఎలర్జీ సమస్యలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాస్తే తగ్గు ముఖం పడతాయి.

ఇవండీ మిరియాలతో ఉపయోగాలు… మీకు ఉపయోగపడే చిట్కాను వాడి ప్రయోజనం పొందండి.

photo credits: wikimedia commons