బాదాం ఖీర్ సులభంగా ఇంట్లోనే చేసేద్దాం…

బాదంపప్పు రోజూ ఆహారంలో తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే.
రోజూ బెట్టుకుని తినాలన్నా, డైరెక్ట్ గా తినాలన్నా బోర్ కొట్టేస్తుంది కదా… అందుకే అప్పుడప్పుడు సింపుల్ గా, టేస్టీగా ఉండే బాదాం ఖీర్ ని ట్రై చేయండి. పాలు తాగడం ఇష్టం లేని పిల్లలకి ఇలా పాలు, బాదాంతో చేసిన ఖీర్ తాగించేయండి. ఇది మంచి ఇమ్మ్యూనిటి బూస్టర్ (immunity booster) లా పని చేస్తుంది.

 

బాదాం ఖీర్ తయారు చేసే విధానం :
photo credits : wikimedia commons
25-30 బాదంపప్పుల్ని 4-5 గంటలు నీళ్లలో నానబెట్టి పొట్టు తీసుకోవాలి. తర్వాత వాటిని కొద్దిగా పాలు కలిపి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన మందపాటి గిన్నె లేదా కడాయి పెట్టుకుని ఒక లీటర్ పాలను పోసి పొంగు వచ్చాక… స్టవ్ సిమ్ లో పెట్టి 5 ని.లు గరిటెతో తిప్పుతూ మరిగించాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్టును వేసి మరో ఐదు ని.లు మరిగించాలి. తర్వాత అరకప్పు షుగర్ వేసి మరికొంతసేపు మరిగించాలి. కలర్ కావాలి అనుకుంటే పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు లేదా యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక 2 ని.ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి.
ఈ బాదం ఖీర్ ని గోరు వెచ్చగా లేదా చల్లారిన తర్వాత ఒక గంటసేపు ఫ్రిడ్జిలో పెట్టి తీసుకోవచ్చు.

 

బాదంతో అందం, ఆరోగ్యం

One thought on “బాదాం ఖీర్ సులభంగా ఇంట్లోనే చేసేద్దాం…

Comments are closed.