బాదంతో అందం, ఆరోగ్యం

అందం, ఆరోగ్యం రెండు బాదాంతో సాధ్యం.. ఈ సూపర్ నట్స్ లో చాలా సుగుణాలున్నాయి.. తల్లి పాలలోని ప్రోటీన్లు వీటిలో దొరుకుతాయి.. గుండెపోటును అరికట్టడంలోనూ, గుండె వ్యాధులను నివారించటంలోనూ ఇవి శక్తివంతమైనవి.. రోజు బాదాం గింజలు తింటే మనలో వైరల్ ఇన్ఫెక్షన్స్ (viral infections) తో పోరాడే సామర్ధ్యం పెరుగుతుంది.
ఒక అవున్స్ (28.34 గ్రాములు) బాదం పప్పులు తింటే వచ్చేపదేళ్లలో గుండెజబ్బులొచ్చే ప్రమాదం 3.5శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  Effects of almong consumption on the serum fatty acid profile: a dose-response study పేరుతో  British  Journal of Nutrition లో వచ్చిన   ఈ పరిశోధన బాదం ఆరోగ్యలాభాల గురించి కొత్త విషయాలను వెల్లడించింది. ఇప్పటికే ఆల్మండ్స తిన్నందున బరువు తగ్గుతారని, డయబీటిస్ ను నివారించవచ్చని…ఇలా ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి. దీనితో ప్రపంచమంతా బదాం ను తినడం తీవ్రమయింది.  అమెరికాలో మరీ ఎక్కువయింది. మామూలుగా మనుషులు ఎక్కువ తినే నట్స్ లో టాప్ వేరు శనక్కాయలు.  అల్మండ్ కు ఔషధ గుణాలు తెలిశాక ప్రజలు వేరుశనక్కాయల నుంచి బాదంకు మారిపోయిరు. అమెరికాలోనయిన  1965 నాటి బాదం తినడం ఇపుడు పదింతలు పెరిగిందని ది ఎట్లాంటిక్ (The Atlantic) రాసింది.  దీనితో క్యాలిఫోర్నియా ప్రపంచ బాదం క్యాపిటల్ అయిపోయింది. ప్రపంచంలో పండించే మొత్తం ఆల్మండ్స్ 82 శాతం ఒక్క క్యాలిపోర్నియాలోను పండిస్తున్నారు. ఈ తోట్లో తేనెటీగల ద్వారా పాలినేషన్ కే ప్రాముఖ్యం ఇస్తారు. ఈ రాష్ట్రానికి 1.4 బిలియన్ ల తెనెటీగలు కావాలి. దీనికోసం అమెరికా లోని అన్ని రాష్ట్రాలనుంచి తెనెటీగలను దిగుమతి చేసుకుని సాకుతారు. సరే ఇది వేరే కథ.  వీళ్లకొక బోర్డు (Almond Board of California) ఉంది. వాళ్ల కొక వెబ్ సైట్  alomonds.com ఉంది .  మొత్తానికి ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా బాదం తినడం మొదలయింది. బాదం రహస్యాలివే.
# రోజు పావు కప్పు బాదంపప్పు (almonds) తింటే ఆరోజుకు అవసరం ఐన విటమిన్ ‘ఇ’ (vitamin E) సగం లభించినట్టే… ఇందులోని ‘బి’ విటమిన్లు (vitamin B) ఒత్తిడిని దూరం చేస్తాయి.
# బాదంలో శాచురేటెడ్ కొవ్వు శాతం తక్కువ కావటంతో ఇవి బరువును కూడా తగ్గిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ (cholesterol) ను సమ స్థాయిలో ఉంచుతుంది.
# బాదంలో ప్రోటీన్లు (proteins), అత్యధిక న్యూట్రిషన్ (nutrition) గుణాలు ఉండటం వలన ఇవి తీసుకుంటే వేరే పోషక పదార్ధాలున్న మెడిసిన్లు వాడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు.
# వీటిలో హానికర అంశాలు కూడా లేవు అందువల్ల వీటిని చిన్నపిల్లల రెగ్యులర్ డైట్(Regular diet) లో వాడితే మంచిదే.
# వారంలో ఐదు రోజులు రోజూ పది బాదంపప్పులు తింటే గుండె సమస్యలు నియంత్రణలో ఉంటాయి.
# కొలెస్ట్రాల్ నియంత్రించటానికి ప్రతి రోజూ ఉదయం రెండు లేదా మూడు బాదంపప్పులు తినాలి.
# ఆస్టియోపొరోసిస్ (osteoporosis)  అదుపు చేయటంలో బాదాంలో లభించే ఎంతో సహాయపడుతుంది.. ఎముకలను పటిష్టం చేస్తుంది. శరీర అవయవాలకు, కణాలకు ఆక్సిజన్ ను చేరవేస్తుంది.
# అలసటగా ఉన్నప్పుడు నాలుగు బాదంపప్పులు తింటే వెంటనే శక్తి లభిస్తుంది.
# షుగర్ (diabetes) తో బాధపడేవారు భోజనం తర్వాత తీసుకుంటే రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది.
# మెదడు చురుకుగా పని చేయటానికి రోజూ రెండు లేదా మూడు బాదంపప్పులు రాత్రి నానబెట్టి తర్వాత రోజూ ఉదయాన్నే తింటే సరి.
# పెద్ద ప్రేగు కాన్సర్ (colon cancer) నియంత్రణలోనూ బాదాం చురుకుగా పని చేస్తుంది.
# జుట్టు రాలడాన్ని కూడా అధిగమిస్తుంది. వారానికి ఒకసారి ఐన బాదాం నూనె తలకు రాయటం వలన జుట్టు తేమని సంతరించుకుని పొడి బారకుండా ఉంటాయి. జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. బాదాం తినటం వలన కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
# చర్మ సౌందర్య సాధనాలలో కూడా బాదాం ను విరివిగా వాడుతున్నారు. చర్మం కాంతిని సంతరించుకోవాలంటే రాత్రి పాలలో నానబెట్టిన బాదాం పప్పులను ఉదయాన్నే పేస్ట్ చేసి ముఖ్నికి అప్లై చేసి నీతితో శుభ్రం చేసుకోవాలి.
బాదాం పప్పు వలన ఎన్ని ప్రయోజనాలా తెలుసుకున్నాం కదా!! ఇన్ని ప్రయోజనాలున్న బాదంను మన ఆహారంలో భాగాన్ని చేసుకుందామా మరి.
photo credits: wikimedia commons

https://trendingtelugunews.com/top-stories/health-food/badam-kheer-recipes-in-telugu/

One thought on “బాదంతో అందం, ఆరోగ్యం

Comments are closed.