హైదరాబాద్ అమ్మాయి భర్తను ఎట్ల సతాయించిందంటే (వీడియో)

హైదరాబాద్ అమ్మాయి విడాకుల కోసం రోడ్డెక్కింది. విడాకుల కాయితం మీద సంతకం పెడతవా లేదా అని రోడ్డు మీద కూర్చుంది. భర్తను వేధించింది. సంతకం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది. తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీ చదవండి. వీడియో చూడండి.

హైదరాబాద్ లోని తార్నాక పరిసరాల్లో ఒక అమ్మాయి మంగళవారం రాత్రిపూట రోడ్డు మీదకు వచ్చి హల్ చల్ చేసింది. తనకు విడాకులు కావాలని, తక్షణమే విడాకుల కాగితం మీద సంతకం పెట్టాలంటూ భర్తను డిమాండ్ చేసింది . ఆమె గత కొంతకాలంగా విడాకుల కోసం భర్తను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమె ప్రయత్నాలు శృతిమించిపోయాయి. ఏకంగా రోడ్డెక్కింది. వెళ్లే వాహనాలకు అడ్డంగా కూర్చొని సంతకం పెడతావా లేదా అంటూ భర్తను బెదిరించింది. ఇంతలో స్థానికులు ఆమె తీరుపై ఓయు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఓయు పోలీసులు వచ్చి భర్త, భార్య ఇద్దరినీ స్టేషన్ తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి రోడ్డుపై విడాకుల కోసం ఎంతగా తాపత్రయపడుతున్నదో పైన ఉన్న వీడియోలో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *