తెలంగాణ లాక్ డౌన్ డబ్బు 1500 అందలేదా? ఈ నెంబర్ కు కాల్ చేయండి

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ఉపాధి నష్టాన్ని  దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు దినసరి ఖర్చుల కోసం ఏప్రిల్, మే నెలల కాలానికి రూ.1500 చెల్లిస్తామని ప్రకటించింది.
అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇస్తున్న నెలకు 6 కిలోల బియ్యాన్ని 12 కిలోలు ఇస్తామని ప్రకటించింది. గతంలో కిలో బియ్యానికి ఒక రూపాయికి ఇస్తుండగా ఈరెండు నెలలు మాత్రం 12 కిలోల బియ్యాన్ని ఉచితంగానే అందిస్తామని చెప్పింది.  తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఈ సాయం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే లబ్ధిదారులకు డబ్బు, బియ్యం పంపిణీ జరుగుతోంది.
తెలంగాణలో వైట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ సర్కారు ఈ మేరకు నెలకు రూ.1500 చొప్పున చెల్లించడంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. అందుకోసమే చాలా మందికి డబ్బు అందలేదు. ఇలా సమస్యలు ఎదుర్కొంటున్న వారికోసం సర్కారు కొత్తగా ఫోన్ నెంబర్ 040 23314614 ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఎవరైనా తమ ఖాతాలో డబ్బులు పడకపోతే పై నెంబరుకు కాల్ చేసి చెప్పాలని సూచించింది.
ఇక బియ్యం పంపిణీలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితుల్లో లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టోల్ ఫ్రీ నెంబరులను కూడా ప్రవేశపెట్టింది. 1800 42500333, 1907 ఈ నెంబర్లకు కాల్ చేసి బియ్యం పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. డీలర్లు సతాయించినా, లేదంటే ఇంకేదైనా సమస్యలు వచ్చినా టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తెలపాలని కోరింది.
అయితే ఈ లాక్ డౌన డబ్బు పంపిణీలో సాంకేతికంగా పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నవారిలో చాలామంది బియ్యం తీసుకోవడంలేదు. ముఖ్యంగా రైతు కుటుంబాలకు చెందిన వారికి తెల్ల కార్డు ఉన్నప్పటికీ వారికే పంట పండుతుంది కాబట్టి బియ్యం కొనుగోలు చేయడంలేదు. అలాంటి వారు ప్రతినెలా బియ్యం తీసుకోకపోవడంతో వారందరికీ ఇప్పుడు సర్కారు డబ్బు అందలేదని చెబుతున్నారు.
వీరితోపాటు తెల్లరేషన్ కార్డులన్నీ మహిళల పేరుమీదే ఉన్నాయి కాబట్టి వారిలో చాలామందికి బ్యాంకు అకౌంట్లు లేవు. దీంతో వారికి సొమ్ము ఎలా వేయాలా అన్న విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు నల్లగొండకు చెందిన నకిరేకల్ రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు.
మరి కొందరికి బ్యాంకు అకౌంట్ లు ఉన్నప్పటికీ తమ  ఆధార్ నెంబరు జత కాకపోవడంతో తమ బ్యాంకు అకౌంట్ లలో సర్కారు సొమ్ము జమ కాలేదని చెబుతున్నారు.
పోస్టాఫీస్ లో డబ్బు పడిందా? లేదా?
ఇక బ్యాంకు అకౌంట్ లేని వారికి పోస్టాఫీస్ ద్వారా నగదు పంపిణీ చేపట్టింది ప్రభుత్వం. అయితే ఇక్కడ కూడా చాలామందికి బ్యాంకు అకౌంట్ లేకపోయినా పోస్టాఫీస్ ద్వారా నగదు పంపణీ జరలేదు. పోస్టాఫీస్ ద్వారా డబ్బు పంపిణీలో సీనియర్ సిటిజన్స్ గా ఉన్న వారికే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. యుక్త వయసు వారికి ఇంకా డబ్బు రాలేదని అంటున్నారు.
ఇక పోస్టాఫీసులో డబ్బు పడిందో లేదో తెలుసుకునేందుకు పోస్టల్ శాఖ వారు ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి చూడవచ్చు. ఇందులో మీ జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం, పేరు కొట్టి సెర్చ్ చేయాలి. ఆ గ్రామంలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఇక ఈ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అందించేందుకు పౌర సరఫరా శాఖ వారు ఒక వెబ్ సైట్ కూడా నెలకొల్పారు. ఈ వెబ్ సైట్ క్లిక్ చేసి లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను నమోదు చేసి సెర్చ్ చేస్తే స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది.
పోస్టల్ శాఖ వారు ఇచ్చిన లబ్ధిదారుల జాబితా లింక్, పౌర సరఫరాల శాఖ వారు ఇచ్చిన వెబ్ సైట్ లింక్ రెండూ కింద కూడా ఉన్నాయి చూడొచ్చు.
https://telanganapostalcircle.in/fsc/benfilist.aspx?fbclid=IwAR0zUDLRfHI1_n-gjVOBAFFnw_WgIvrOFJmJZXxKREyYxJuJTk3rJ-Awwco
telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html