కేసిఆర్ కనిమొళి భేటీలోనూ కేకే హల్ చల్ (వీడియో)

తెలంగాణ సిఎం కేసిఆర్ తమిళనాడు పర్యటనలో బిజిగా ఉన్నారు. రెండోరోజు కేసిఆర్ తో కరుణానిధి కుమార్తె, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి  ప్రత్యేకంగా భేటీ అయ్యరు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చ జరిగింది. తెలంగాణ నుంచి కేసిఆర్ తోపాటు వెళ్లిన నాయకులందరినీ కేసిఆర్ కనిమొళికి పరిచయం చేశారు. అందరితో నవ్వుతూ మాట్లాడారు కనిమొళి.

సిఎం కేసిఆర్ పశ్చిమబెంగాల్ టూర్ లో ఎంపి కేశవరావు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పశ్చిమబెంగాల్ సెక్యూరిటీ సిబ్బంది అయితే కేసిఆర్, కేకే ను చూసి ఇద్దరిలో ఎవరు సిఎం అని చర్చించుకున్నారు. తాజాగా చెన్నై టూర్ లో కేకే ఉన్నారు. ఇక్కడ కూడా కేకే హల్ చల్ చేశారు.

అసలు విషయం ఏమంటే ప్రస్తుతం కేకే, కనిమొళి ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులే. అందుకే ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయని చెబుతున్నారు. వీరి భేటీ తాలూకు వీడియో పైన ఉంది చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *