ఆంధ్రా జర్నలిస్టులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు ఎపి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎపి రాజధాని ప్రాంతంలో పనిచేసే జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కాల్వ శ్రీనివాసులు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

జర్నలిస్టుల ఇండ్ల విషయమై గత ఏడాది ఆగస్టు 8వ తేదీన సిఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్లు (అపార్ట్ మెంట్ల రూపంలో) కట్టివ్వాలని నిర్ణయించారు.

ఈ విషయమై గురువారం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఛైర్మన్ గా ఉన్న కమిటీలో.. మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, జిఎడి సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్ లను నియమించింది.  ఈ కమిటీ జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీ విషయమై పాలసీని రూపొందిస్తుంది. ఆ పాలసీ ప్రకారం అర్హత కలిగిన జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వనున్నది సర్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *