(సుంకర పద్మశ్రీ, ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు )
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు… కలకాలం ఉండే అందమైన ఇంటిని ఎంతో కష్టపడి నిర్మించే భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత దయనీయంగా ఉంది
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు… ఏడాది కాలంగా కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆకలి కేకలు భరించలేక… కుటుంబసభ్యుల ఆర్తనాదాలు చూడలేక… ఎంతోమంది అభాగ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆదాయం కూడా అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి మిగిలిన ఏకైక ఆదాయ మార్గం భవన నిర్మాణ రంగం.
