ప్రధాని నిధి కోసం, ఈ రోజేం చేశానంటే, ఈ పోస్ట్ పూర్తిగా చదవండి : రచయిత సలీమ్

మనం ఎన్నో పోస్ట్లు అందుకున్నాము.. కొన్ని షేర్ చేసి ఉంటాము.. కొన్ని డిలీట్ చేసి ఉంటాము,, లెక్కలేనంత సమాచారం మనకు వచ్చి ఉంటుంది. ఇక వీడియోలకు అయితే లెక్కే లేదు.. అవును ఇదంతా కరోనా అనే ఒక మూడు అక్షరాల వైరస్ గురించి..
సరే చదవడం షేర్ చేయడం అయిపోయింది.. ఇక మనం కూడా కరోనా గురించి జరుగుతున్న ఈ మహా యుద్ధంలో కొంచమైనా ఏదో ఒక రకంగా పాల్గొన వలసిన అవసరం ఉంది. అది నేరుగా యుద్ధం లొ పాల్గొనడం కాదు.. ఇంట్లో ఉంటూనే చేయాలి
ఈ రోజు ఫోటోలో ఉన్న మా అబ్బాయికి నేను జుట్టు ట్రిమ్మింగ్ చేశాను. అది ఇంట్లో ఉండి. దాంతో నాకు 100 రూపాయలు మిగిలాయి. నాకు మా అబ్బాయి  ట్రిమ్మింగ్ చేశాడు.  మరో 100 రూపాయలు మిగిలాయి.
ఇద్దరం ఈ పనికి సెలూన్ వెళ్లకుండా ముగించేశాం.  రెండొందలు మిగిలాయి.

 

 దేశంలో  కరోన వ్యాధి వ్యాపించకుండా భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. దీనికి భారీగా నిధులవసరం. ప్రధాన మంత్రి  ఈ నిధులకోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ డబ్బును ప్రధాని నిధికి పంపిస్తే … ఈ ఆలోచన వచ్చింది.   200 రూపాయలు PM CARES కు పంపించాను! ప్రతి ఒక్కరూ కనీసం ఒక నూరు రూపాయలు పంపిస్తే కొన్ని వేల కోట్లు కరోనా పోరాటానికి,  సహాయ కార్యక్రమాలకు జమ అవుతాయి.ఈ రోజు ఈ పోరాటంలో ఇంట్లో ఉండినేనూ పాలుపంచుకున్నాను. గర్వపడుతున్నాను.

ఆగండాగండి.. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారో ఊహించగలను!!
* డబ్బులు ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవ్వచ్చు కదా?
* బ్యాంకులకు వేలకు వేల కోట్లు ఎగ్గొట్టి తిరిగేవాళ్ళం నుంచి వసూలు చేయొచ్చు కదా?
* అయినా నేను 200 పంపించకపోతే ఏమవుతుంది?( తర్వాత చదవండి రాజు గారి ఇంట్లో పెళ్లి కథ)
* అయినా ఇది ప్రభుత్వం బాధ్యత కదా. బడ్జెట్లో ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించి ఉండొచ్చు కదా?
* పన్నులు ఎగ్గొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వారి నుంచి వసూలు చేయొచ్చు కదా?
* నల్ల డబ్బు విదేశాల నుండి తీసుకురావచ్చు కదా?
ఎన్నో ప్రశ్నలు కొంతమంది మనసులో మెదిలే అవకాశం ఉంది.
అయితే నా అభిప్రాయం ఇప్పుడు ఇవన్నీ అనవసరం
కేవలం 100 ఇవ్వగలిగితే చాలా సహాయం చేసినట్లు ఉంటుంది.
ఇంకో విషయం ముందే చెప్పేవాడిని కానీ తర్వాత చెప్తున్నాను ఎందుకంటే… కొంతమంది పోస్ట్ కొంచెం చదివి డిలీట్ చేయవచ్చు లేదా వదిలేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పే విషయం అవసరం లేదు.
నా పేరు సలీం భాష. నాకు ఒక స్థిరమైన ఉద్యోగం లేదు. ఆస్తిపాస్తులు లేవు. పెన్షన్ రాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా లాఫ్ థెరపిస్ట్ గా చేసే ప్రోగ్రాంలు తీసుకునే క్లాసులు నాకు వచ్చే ఆదాయ వనరులు?! నేను ఒక చిన్న సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా ఉగాదికి. కానీ లాక్ డౌన్ వల్ల అది సాధ్యం కాలేదని మీకు అందరికీ తెలుసు. ఇంకో ఆరు నెలల వరకూ నాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం వచ్చే అవకాశాలు లేవు. ఇంతవరకూ సేవింగ్స్ నే వాడాల్సి రావచ్చు( అవి కూడా పెద్దగా లేవు). ఒక 200 రూపాయలు కూడా నాకు కొంచెం ఇబ్బందే. ఇదంతా నిజం మీరు నన్ను నమ్మాలి. అందుకే నేను మిగిలించిన 200 పంపించాను. మీరంతా కూడా కష్టపడి రోజువారి జీవితంలో ఏదైనా తగ్గించుకొని విరాళం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా క్వాలిటీ కాకుండా క్వాంటిటీ తగ్గించుకొని మిగిలిన డబ్బు లను PM CARES కు విరాళంగా ఇవ్వచ్చు. ఎలా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.
చివరగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఎవర్నో ఎవరినో కించపరచడానికో, మోటివేట్ చేయడానికి చెప్తున్నది కాదు. నాకనిపించింది చెప్పాను. అంతే!
ముందే చెప్పినట్లు రాజు గారి ఇంట్లో పెళ్లి కథ ఇప్పుడు చెప్తాను.
ఒకసారి రాజు గారింట్లో పెళ్లి కోసం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ( దాదాపు 5000 మంది) కోటలో పెట్టిన పెద్ద గంగాళంలో ఒక చెంబుడు పాలు పోయాలని హుకుం జారీ చేశారు రాజుగారు. రాత్రి గంగాళం పెట్టారు. పొద్దున్నే చూస్తే చూస్తే దాన్నిండా నీళ్లు ఉన్నాయి!!
మిత్రులందరికీ అర్థమైంది అనుకుంటా.. నేనేదో పెద్ద సేవ చేశానానో, గొప్ప పని చేశానానో ఇది చెప్పడం లేదు. నాక్కూడా పొద్దున్నే ట్రిమ్మింగ్ చేసిన తర్వాత వచ్చిన ఐడియా ఇది!
ఇంత ముందు చేసిన ట్రిమ్మింగ్ వల్ల మూడు లాభాలు కలిగాయి. ఒకటి డబ్బులు మిగిలాయి . ఓ 200 ” ఉడుత సాయం” చేయగలిగాను . మూడు.బయట తిరక్కుండా ఉన్నాము. (ఇది ముఖ్యమైనది)
ఓపిగ్గా చివరి వరకు చదివిన వాళ్ళకి ధన్యవాదాలు.. వీలైతే నలుగురికి పంపించండి.. వీలుకాకపోతే ముగ్గురికి పంపించండి.
పంపించినా పంపించక పోయినా ఇంట్లోనే ఉండండి.
(*సలీమ్ బాషా,రచయిత, స్పోర్ట్స్ జర్నలిస్టు, పర్సానాలిటీ డెవెలప్ మెంట్ నిపుణుడు, కర్నూలు ఫోన్ నెంబర్ 9393737937)