50 సం. పూర్తి చేసుకున్న ‘సుధర్మా’ ప్రపంచ తొలి సంస్కృత దినపత్రిక

ఇయమ్ ఆకాశవాణి, సంప్రతి వార్త: శ్రూయంతామ్ ప్రవాచక: బలదేవానంద సాగర:  అనే మాటలని రేడియోలున్న భారతీయులు లెవరూ వినకుండా ఉండరు. సంస్కృతవార్తలతో బలదేవానంద సాగర ఎంత ప్రాచర్యంలోకి వచ్చారో, ఆయన వాక్కుతో సంస్కృత వార్తలు అంతగా జనానికి దగ్గరయ్యాయి. అయితే, ఈ వార్తల బులెటీన్  మినహా వార్తా ప్రపంచంలో సంస్కృతానికి పెద్దగా గుర్తింపురాలేదు.  ప్రభుత్వాల ప్రసార సమాచార శాఖలు కూడా సంస్కృతంలో బులెలటీన్లను ప్రింటు చేస్తున్నట్లు లేదు. ఈ లోటును మైసూరులోని ఒక పండిత కుటుంబం పూరించింది.
సంస్కృతంలో  ఒక పత్రిక మొదలయి  యాభై సంవత్సరాలుగా నిరాటంకంగా నడుస్తూ ఉందంటే నమ్మశక్యం కాదు. ఈ పత్రిక పేరు సుధర్మా.  ప్రపంచంలో తొలి సంస్కతం దినపత్రిక ఇదే. ఎకైక దినపత్రిక కూడా.
Sudharma Sanskrit Daily (credits:rashminotes.com)
 మైసూరులోని రామచంద్ర అగ్రహారలో సుధర్మా కార్యాలయం ఉంది.  కెవి సంపత్కుమార్, ఆయన భార్య కెఎస్ జయలక్ష్మి ఈ పత్రికను నడుపుతున్నారు.
ఈ పత్రికను  ఎపుడో 1970లో సంస్కృత పండితుడు కలాలే నాడదూర వరదరాజ అయ్యంగార్ స్థాపించారు. తొలిసంచిక ఆయేడాది జూలై15న విడుదలయింది. తర్వాత 20 సంవత్సరాలు ఆయనే పబ్లిషర్, ప్రింటర్ గా కొనసాగారు.
KN Varadaraja Iyengar (credits: Sudharma)
ధర పోస్టేజితో కలసి అయిదుపైసలు.  వరదరాజ అయ్యంగార్ అనంతరం ఈ పత్రిక నడిపే బాధ్యతలను ఆయన కుమారుడు సంపత్ ,కోడలు జయలక్ష్మి స్వకరించారు. ఇద్దరు బాగా సంస్కృతం చదువుకున్నవారే.
సంపత్ కుమార (credits:rashminotes.com)
ఈ యాభై సంవత్సరాలలో ప్రతిక 3500 మంది చందాదారులను సేకరించింది. ఇందులో భారతీయలేకాకుండా జర్మనీ, జపాన్, శ్రీలంక దేశాల పాఠకులు కూడా ఉన్నారు. పత్రిక సంవత్సర చందా రు.500. చందాదారులకు పత్రిక పోస్టు ద్వారా అందుతుంది. పగలంతా వార్తలు రాస్తారు. సాయంకాలం పత్రిక ముద్రణ మొదలవుతుంది. మరుసటి ఈ  ప్రతులను పోస్టు చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నానికల్లా ఈ పని పూర్తవుతుంది. 2009లో సుధర్మా ఇ-పేపర్ కూడా మొదలయింది. అభిరుచి ఉన్న వాళ్లు వెబ్ ఎడిషన్ లో సంస్కృత వార్తలు ఉచితంగా చదవవచ్చు.ఈ వెబ్ సైట్ సమాచారం ప్రకారం ప్రపచంలోని 90 దేశాల నుంచి పాఠకులు సైట్ ను సందర్శిస్తున్నారు.
KN Varadaraja Iyengar with the then PM Indiara Gandhi (credits: Sudharma)
ఇది రెండుపేజీల పత్రిక. మొదటి పేజీలో వార్తలుంటాయ. రెండో పేజీలు బయటివారు పంపే  వ్యాసాలుంటాయి. పదకొండు సంవత్సరాలకింద జయలక్ష్మి సంస్కృత క్యాలెండర్ ప్రారంభించారు.
రెండు పేజీలే అయినా, ఒక పత్రిక నడపం ఎంతకష్టమో చెప్పాల్సిన పనిలేదు. అయినా సరే, సంపత్కుమార్, జయలక్ష్మి  ఎన్నిసమస్యలున్నా ఈ ప్రతికను నిరాటంకంగా నడిపిస్తున్నారు.
సుధర్మా పత్రిక కోసం సంప్రదించాల్సిన అడ్రసు: Sudharama No 561, 2nd Cross, Ramachandra Agrahara, Mysore -570004 Ph: 0821-2442835,  9740158508