మీకు తెలుసా? ప్రపంచంలో మొదటి బోట్ లైబ్రరీ ఆంధ్రలోనే మొదలయింది…

(ట్రెండింగ్ తెలుగు  న్యూస్ డెస్క్)
ప్రపంచంలో పడవ-గ్రంధాలయా (బోట్ లైబ్రరీలు)నేవి  మొదలయింది మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లోనే.ఆ తర్వాత ఈ సంప్రదాయం భారత దేశంతో పాటు ప్రపంచమంతా వ్యాప్తి చెందింది.
నాటి గుంటూరు జిల్లాలో  1935లో ఈ బోట్ లైబ్రరీలు మొదలుమొదయ్యాయి. వీటిని స్థాపించిన వ్యక్తి పాతూరి నాగభూషణం.రాష్ట్రంలో గ్రంధాలయాల ఉద్యమం వ్యాప్తి చేసిన వారిలో పాతూరి ఒకరు. ఊరూర గ్రంధాలయాలు ఏర్పాటుచేయడం, వయోజన విద్య ప్రచారం జోరుగా సాగువుతున్న రోజులవి.
వూర్లో ఒకరిద్దరు చదువుకున్నవారుంటే వూరంతా వారిచుట్టూ తిరిగే రోజులు. ఒకరింటికి ఉత్తరం వచ్చినా, దాన్ని పట్టుకుని చదవుతెలిసిన వారింటికి పరిగెత్తుకుంటూ వెళ్లి సమాచారం ఏమిటో చదివి వినిపించుకునేవారు. చాలా సందర్భాలలో పోస్ట్ మేనే ఈ పనిచేసేవారు.ఒక్కొక్క సారి పోస్టే మేన్  చేయలేకపోతే, వూర్లో చదువొచ్చిన వ్యక్తే దిక్కు. ఆయనకోసం కాపలా కాసే వారు.  అదే విధంగా నీతికధలను, వార్త పత్రికలను కూడా అందరికోసం ఒక వ్యక్తి చదివే వాడు. ఆరోజుల్లో నిరక్షరాస్యత అంతగా ఉండేది.
అక్షరాస్యత పెంచేందుకు  ఆరోజుల్లో గాంధీ నాయకత్వంలో పలువురు కాంగ్రెస్ నేతలు కృషి చేసేశారు.వారు రాత్రి బడులలో పెద్దవారికి చదువునేర్పేవారు.చదువొచ్చిన వారికోసం చిన్నచిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేసే వారు. నిజానికి ఇదంతా స్వాతంత్య్రోద్యమంలో భాగాంగానే సాగింది. ఇందులో తెలుగు నాట అగ్రశ్రేణి నేతలలో పాతూరు నాగభూషణం ఒకరు.  తెలుగు గ్రంధాలయాల చరిత్ర తెలుసుకోవాలంటే  ఆయన పేరులేకుండా సాధ్యపడదు.
ఆయన ఆలోచనయే బోట్ లైబ్రరీ.  ఆరోజులు చాలా కృష్ణా తీర గ్రామాలకు పడవయే ప్రయాణం సాధనం.  పడవల్లో చాలా మంది ప్రయాణించేవారు. అందువల్ల పడవలను తన గ్రంధాలయ వ్యాప్తికి బాగా పనికొస్తాయని ఆయన భావించారు. ప్రయాణికులు పడవల్లో కొదిసేపయినా తీరుబడిగా ఉంటారని, ఆసమయంలో వాళ్లలో పఠనాసక్తి పెంపొందిచాలని ఆయన భావించారు. ఈపడవల్లో   లైబ్రరీలు ఏర్పాటుచేశారు. అక్కడ ఎవరో ఒకరు చదవడం తెలిసిన వారు విశేషాలను ఇతర ప్రజలకోసం గట్టిగా చదివేవారు. అంతా వినేవారు. కొన్ని సార్లు ఆయనే స్వయంగా పుస్తకాలు చదివి వినిపించేవారు.
1935నుంచి 1942 దాకా ఏడేళ్లపాటు ఈ పడవ లైబ్రరీలు నడిచాయి. నాటి గుంటూరు జిల్లా పెదవడ్ల పూడి-కొల్లూరు ,పెద వడ్లపూడి-పిడపర్రు మధ్యతిరిగే పడవలలో ఆయన మొబైల్ గ్రంథాలయాలు ప్రారంభించారు. ఆరోజుల్లో ఇది ఒక సెన్సేషనల్ వార్త.
పాతూరి నాగభూషణం తెనాలి తాలూకాలోని కూచిపూడి, పెదపాళెంలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తర్వాత నిడుబ్రోలు ఎడ్వర్డ్ హైస్కూల్ లో ఎస్ ఎస్ ఎల్ సి చదివారు.
ఆపైన 1927-28లయోలా కాలేజీలో ఇంటర్ చదివారు. తర్వాత మద్రాసు, మదనపల్లిలలో ఒక ఏడాది చదివారు. తర్వాత గాంధేయవాదిగా మారి గ్రంథాలయోద్యం లో చురుకుగా పాల్గొన్నారు. 1934లో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం లైబ్రరీ సైన్సెస్ తరగతులను ఏర్పాటుచేసింది. వాటికి హాజరయ్యారు.  తర్వాత ఈ లైబ్రరీ సైన్సెస్ లో రెండేళ్ల డిప్లొమా కూడా చేశారు. 1938 తర్వాత అయ్యంకి వెంకటరమణయ్య నుంచి ఆంధ్ర గ్రంధాలయ ఉద్యమ నాయకత్వాన్ని అంందుకున్నారు. ‘గ్రంథాయల పాఠములు’ పేరుతో తెలుగు లో మొట్టమొదట గ్రంథయాల మీద పుస్తకం రాసిందాయనే. మిత్రుడు మేళ్ల చెరువు వెంకటేశ్వర్లు తో కలసి సొంతవూరు పెదపాళెంలో ‘సేవాశ్రమము’ స్థాపించారు. దీనిని కేంద్రంగా చేసుకోనే ఆయన గ్రంధాలయోద్యమాన్ని నడిపారు. ఇందులో ప్రధానమయింది నేషనల్ ఎడ్యుకేషనల్ స్కూల్ . ఇక్కడే ఆయన ఖాదీ ప్రచారం, హిందీ ప్రచారం,న్యాచురోపతి వంటి అంశాల మీద తరగతులు తీసుకునేవారు.
ఇపుడు స్వీడెన్ లో బోట్ లైబ్రరీ (bokbåten)లు ఇప్పటికీ  నడుస్తున్నాయి. ఆధునికం కూడా అయ్యాయి. అక్కడ 1953లో బోట్ లైబ్రరీలు మొదలయ్యాయి. ఇక నార్వేలో 1959లో ఇలాంటి మొబైల్ లైబ్రరీలు వచ్చాయి.
స్వీడెన్ స్టాక్ హోమ్ ఆర్కిపెలాగో 24వేల దీవులున్నాయి.ఇందులో మనుసులు నివాసమున్నదీవులు కొన్నే. ఇక్కడి ప్రజలంతా ప్రతిచిన్న పనికి పడవల ద్వారానే స్టాక్ హోం సిటీకి వస్తుంటారు. వీళ్ల సౌకర్యం కోసం ఈ పడవల్లో లైబ్రరీలు ఏర్పాటుచేశారు. 2014 స్వీడిష్ లైబ్రరీ యాక్ట్ ప్రకారం, ప్రతి మునిసి పాలిటీ ఒక గ్రంధాలయాన్ని విధిగా ఏర్పాటుచేయాలసి ఉంటుంది. ఇందులో భాగంగా ఆధునికి బోట్ లలో ఇపుడు లైబ్రరీలు మొదలయ్యాయి.