Home Features ప్రధాని ఫైనాన్షియల్ ఎమర్జన్సీ విధిస్తారా? : వైరలవుతున్న వార్త

ప్రధాని ఫైనాన్షియల్ ఎమర్జన్సీ విధిస్తారా? : వైరలవుతున్న వార్త

150
0
(TTN Desk)
దేశ ఆర్థిక ప్రగతి బాగా పడిపోతూ ఉండటం, ఇపుడు తాజాగా కరోనా వైరస్ కూడా దేశం మీద దాడిచేయడంతో  ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక అత్యయిక పరిస్థితిని విధిస్తారనే చర్చ మొదలయింది.రాజ్యాంగంలోని 360 అధికరణం కింద  రాష్ట్రపతి ఫైనాన్సియల్ ఎమర్జీన్సీ (Financial Emergency)నివిధించవచ్చు.
మనకు మూడు రకాల ఏమర్జీన్సీలను విధించేందుకు రాజ్యాంగంలో అవకాశాలున్నాయి. ఆర్టికల్ 352కింద నేషనల్ ఎమర్జన్సీని, 356 కింద, రాష్ట్రపతిపాలనను, 360 కింద పైనాన్సియల్ ఎమర్జీని విధించవచ్చు.
 ఈ అధికరణాలన్నీంటిని రాజ్యాంగంలోని 18 విభాగంలో పొందుపర్చారు. ఫైనాన్సియల్ ఎమర్జీన్సీకి విధించేదుకు రాజ్యంగంలో అవకాశం కల్పించినా ఇంతవరకు దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు.
ఎందుకు ఫైనాన్సియల్ ఎమర్జీన్సీని విధించాలనుకుంటున్నారు?
దీనికి చెబుతున్న కారణాలు:
గత 72 సంవత్సరాలలో ఎపుడూ లేనంతగా భారత ఆర్థిక పరిస్థితిదిగజారింది. రేటింగ్ కంపెనీలు Fitch, Moody’s, S&P భారతదేశ అర్థిక వ్యవస్థకుఇస్తున్నరేంటింగ్ ను బాగా తగ్గించాయి. ఇదికరోనా రావడానికి ముందే జరిగింది. ఇపుడుకరొనా మరొక దెబ్బ వేసింది. ఇది మామూలు దెబ్బకాదు. దేశాన్ని మొత్తం తలకిందులచేస్తూన్నది.
కరోనా దెబ్బనుంచి దేశాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం దాదాపు యుద్ధం ప్రకటించింది. భారతీయ రిజర్వు బ్యాంకు 90మంది నిపుణులతో ఒక వార్ రూం తెరిచింది. రిజర్వు బ్యాంక్ ఇలాంటిచర్య తీసుకోవడం బ్యాంకు చరిత్రలో ఇదే మొదటిసారి.
దేశ ప్రగతి ఆశా జనకంగా లేకపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత దేశంలోచేసినతమ ఇన్వెస్ట్ మెంట్ లను వాపసుతీసుకుంటున్నారు. ఇలా ఇప్పటిదాకా సుమారు. రు 1.08లక్షల కోట్లను గత 15 ట్రేడింగ్ సేషన్స్ లోనే వెనక్కు తీసుకున్నారు.

Like the story, Pl share it with a friend to promote responsible journalism

ఇండియాలో దాదాపు 80 శాతం కంపెనీలు కరోనా వల్ల తమ ఉద్యోగులను ఇళ్లనుంచేపనిచేయాలని పురమాయిస్తున్నాయి. గో ఎయిర్, ఎయిర్ ఇండియావంటి కంపెనీలు జీతాల్లేని సెలవుల్లో వెళ్లాలని ఉద్యోగులను పురమాయించాయి.చిన్న చితక కంపెనీలు చాలా తమ ఉద్యోగులను తీసేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి.
దేశంలో బెంగుళూరు, ముంబై, పుణే, ఢిల్లీ, లక్నో, కాన్పూర్, హైదరాబాద్, జైపూర్, చెన్నై, కొల్ కత్తా, గురుగావ్, నోయిడా, అహ్మదాబాద్, సూరత్ వంటి ఫైనాన్సియల్ సెంటర్లలో 80 శాతం పూర్తిగా దిగ్బంధంలో ఉన్నాయి.
అమెరికాతో డాలర్ తో పోలిస్తే రుపాయి పతనమవుతూ ఉంది. నిన్న 76 రుపాయల దాకా పడిపోయింది.
ఈ వార్త రాస్తున్నపుడు కరోనా కేసులు 501కి చేరుకున్నాయి. రాష్ట్రాలన్నీ సరిహద్దులు మూసేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా పీవర్ సర్వైల్యాన్స్ పేరుతో కరోనా కేసులను పసిగట్టేందుకు ఇంటింటిసర్వే నిర్వహిస్తూ ఉంది.
బస్సులు,రైళ్లు, సినిమా హాళ్లు, పబ్ లు, బార్లు, మాల్స్ అన్నీ మూతు పడ్డాయి. కోళ్ల పరిశ్రమకుబాగా దెబ్బతగిలింది. అటోమొబైల్, ఏవియేషన్, హాస్పిటాలిటీ, ఎలెక్ట్రానిక్స్ వ్యాపారాలు పడిపోయాయి.
ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కరోనా ఆగడం లేదు. పాజిటివ్ కేసులుపెరుగుతున్నాయి. మహారాష్ట్ర పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది.
ఇప్పటికయితే, కరోనా వైరస్ విదేశాలనుంచి వచ్చిన కొద్దిగా డబ్బున్న మిడిల్ క్లాస్ వల్ల మధ్య కనిపిస్తూఉంది. రేపు ఇది పేద వర్గాల్లోకి పాకితే దాని అరికట్టడంఅసాధ్యం. ఈపరిస్థితిరాకుండా ఉండేందుకే కరోనారాష్ట్రాలన్నీ తమ సరిహద్దులు మూసేసుకుని కూర్చుంటున్నాయి. ప్రజలెవరూ రోడ్ల మీద సంచరించకుండా చూస్తున్నాయి.
రిజర్వు బ్యాంకు తో సహా పబ్లిక్ సెక్టర్, ప్రయివేటు సెక్టర్ బ్యాంకుల పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఇలాంటపుడుప్రభుత్వాలు కరోనా నివారణకు భారీగా నిధులువెచ్చించాల్సి వస్తుంది.
ఈ పరిస్థితి ని ఎదుర్కోవాలంటే, కేంద్రానికి రాజ్యాంగంలోని అధికరణం 360 కింద ఫైనాన్సియల్ ఎమర్జన్సీ విధించడమొక్కటే మార్గమనేచర్చ జోరుగా సాగుతున్నది. అసలు ఒక వారంలోనే రెండోసారి దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ప్రధాని సిద్ధంకావడం వెనక రహస్యం ఆయన దేశాన్ని ఈ ఏమర్జన్సీనికి మానసికంగా సమాయత్తం చేస్తున్నారనిచెబుతున్నారు.

అయితే, కొద్ది సేపటి కిందట విలేకరులతో మాట్లాడుతూ ఈ చర్చకు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. ఆర్థిక ఏమర్జన్సీవిధించే ఆలోచన లేదని చెప్పారు.

డాక్టర్ సుబ్రమణియన్ స్వామి అనుమానం

ఈ చర్చకు కారణం భారతీయ జనతా పార్టీ రాజ్య సభ సభ్యుడు డాక్టర్  సుబ్రమణియన్ స్వామి. ఆయన చాలా కాలంగా మోదీ ప్రభుత్వం ఆర్థిక విధానాలు సరిగ్గాలేవని చెబుతూన్నారు. ఉపన్యాసాలలో, ట్వీట్ లలో  ఆయన ఈ హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. మార్చి 21 ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఇక ఆర్థిక ఎమర్జీన్సీనివిధించడం అనివార్యమవుతున్నదా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలనికూడా పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థను నడపడం మీద మోదీ ప్రభుత్వ సామర్థ్యాన్ని ఆయన ఎపుడూ శంకిస్తూనే వస్తున్నారు. సామర్థ్యం లేని వాళ్లకి రాజ్యంగంలోని  360 అధికరణం ప్రకాంర అర్థిక ఏమర్జీన్సీనివిధించడం ఆయుధంలాగా పనికొస్తుందని కూడా సలహా ఇచ్చారు.

తర్వాత ఇన్వెంటివా అనే వెబ్ సైట్ కూడా ఈ వార్త రాసి ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకు వెళ్లింది. ఈ రోజు రాత్రి ప్రధాని దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఉంటడంతోొ  ఈ చర్చ బాగా వైరలయింది.

 

ఇవే ఆర్టికిల్ 360 విశేషాలు
360. (1) If the President is satisfied that a situation has arisen whereby the financial stability or credit of India or of any part of the territory thereof is threatened, he may by a Proclamation make a declaration to that effect.
[(2) A Proclamation issued under clause (1)—
(a) may be revoked or varied by a subsequent
Proclamation;
(b) shall be laid before each House of Parliament;
(c) shall cease to operate at the expiration of two months, unless before the expiration of that period it has been approved by resolutions of both Houses of Parliament: Provided that if any such Proclamation is issued at a time when the House of the People has been dissolved or the dissolution of the House of the People takes place during the period of two months referred to in subclause (c), and if a resolution approving the Proclamation has been passed by the Council of States, but no resolution with respect to such Proclamation has been passed by the House of the People before the expiration of that period, the Proclamation shall cease to operate at the expiration of thirty days from the date on which the House of the People first sits after its reconstitution unless before the expiration of the said period of thirty days a resolution approving the Proclamation has been also passed by the House of the People.]
(3) During the period any such Proclamation as is mentioned in clause (1) is in operation, the executive authority of the Union shall extend to the giving of directions to any State to observe such canons of financial propriety as may be specified in the directions, and to the giving of such other directions as the President may deem necessary and adequate for the purpose.
(4) Notwithstanding anything in this Constitution—
(a) any such direction may include— (i) a provision requiring the reduction of salaries and allowances of all or any class of
persons serving in connection with the affairs of a State;
(ii) a provision requiring all Money Bills or other Bills to which the provisions of article 207
apply to be reserved for the consideration of the President after they are passed by the Legislature of the State;
(b) it shall be competent for the President during the period any Proclamation issued under this article is in operation to issue directions for the reduction of salaries and allowances of all or any class of persons serving in connection with the affairs of the Union including the Judges of the Supreme Court and the High Courts.

Source:India.gov.in

ఫైనాన్సియల్ ఎమర్జన్సీ విధిస్తే ఏమవుతుంది?

పైన పేర్కొన్నట్లు దేశంలోన్యాయమూర్తులతో సహా ప్రభత్వోద్యోగుల జీతాలనుకేంద్రం తగ్గించవచ్చు. మొత్తం ఆర్థిక వ్యవహారాన్ని కేంద్రం పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాల బడ్జెట్ లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమవుతుంది.

ఏ మొత్తాలు దేనికి ఖర్చు చేయాలి, ఏ పథకం ఉంచాలి,వాయిదా వేయాలనేవన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి.

ఫైనాన్సియల్ ఎమర్జీన్సీ రెండునెలల పాటు అమలులో ఉంటుంది. ఈ లోపు దానికి పార్లమెంటు ఆమోదం లభించాలి.