Home Features జూన్ 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరి కౌన్సిల్ సంగతేంటి?

జూన్ 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరి కౌన్సిల్ సంగతేంటి?

242
0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  ఈ నెల 16వ తేదీ సమావేశం కాబోతున్నది. కరోనా కారణంగా మార్చిలో ఓటాన్‌ అకౌంట్‌ ను మాత్రమే అసెంబ్లీ ఆమోదించింది. అందువల్ల పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందాల్సి ఉంది. దీనికో  16వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం అవుతుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రొటొకోల్ ప్రకారం సమావేశాలు నడపాల్సి ఉంటుంది.
దీని మీద తుది నిర్ణయం 11న జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటారని తెలిసింది.  లెక్క ప్రకారం  16 వ తేదీన సమావేశంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్  బడ్జెట్ సమావేశాలలో ‌ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగించాలి. ఇదెపుడో జరిగిపోయింది. ఇపుడు మళ్లీ బడ్జెట్ ను ఆమోదించేందుకు జరుగుతున్న ఈ సమావేశాలలో కూడా  గవర్నర్ ప్రసంగిస్తారు. అలా జరిగితే ఒక రికార్డవుతుంది. ఎందుకంటే, గవర్నర్ ఏడాది తొలిసమావేశం అంటే బడ్జెట్ సమావేశాల్లోనే ప్రసంగిస్తారు. రెండుసార్లు ప్రసంగించడం ఏ ఏడాదిలో జరగలేదు.

హెల్త్ వర్కర్ కరోనా పాజిటివ్, రక్షణ కరువయిందని నెల్లూరులో ఆందోళన

అయితే, బడ్జెట్ సమావేశాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సమావేశం కూడా ఉంటుందా? ఎందుకంటే, కౌన్సిల్ అంటే ప్రభుత్వానికి ఏమాత్రం గిట్టదు. అక్కడ తెలుగుదేశం బలం ఎక్కువ కాబట్టి ఈ సభ ప్రభుత్వానికి అడ్డంకిగా తయారయిందని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం భావిస్తున్నది. రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్టణానికి మార్చేందుకు ఉద్ధేశించిన రెండు బిల్లులను  కౌన్సిల్ వ్యతిరేకించింది. వాటిని అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించింది.   ఇవి సాధారణ బిల్లులయితే ముఖ్యమంత్రి జగన్ అంత సీరియస్ గా తీసుకునే వాడు కాదు. రాష్ట్రంనుంచి తెలుగు దేశం పరిపానల ఆనవాలు తాయరుకాబోతున్న అమరావతి రాజధానిని విశాఖకు తరలించేందుకు ఉద్దేశంచిన బిల్లులు  కాబట్టి రూలింగ్ పార్టీ ఆక్రోశంలో వూగిపోయింది. ఈ  కౌన్సిలే దండగ,175 మంది సభ్యులున్న అసెంబ్లీలో 151 మంది స్థానాలు గెల్చుకుని అఖండవిజయంతో ఏర్పాటయిన ప్రభుత్వానికి 28 మంది ఎమ్మెల్సీలు అడ్డుపుల్ల వేయడమేమిటి? కౌన్సిల్ బలగం 58, ఇందులో టిడిపి 28, వైసిపి వాళ్లు కేవలం 9 మంది మాత్రమే.

Like this story? Share it with a friend!

అమరావతి నుంచి తరలిపోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నుందున ప్రతీకారంత్ో జనవరి 28న, రాజ్యంగంలోని నియమం 169(1) కింద కౌన్సిల్ రద్దు చేస్తూ అసెంబ్లీ ఒక తీర్మానం ఆమోదించింది. కౌన్సిల్ ను రద్దచేసేందుకు పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని కేంద్రానికి ప్రతిపాదనను పంపించింది. అయితే, కేంద్రం దీని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే, కౌన్సిల్ అంటే ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఇపుడు కౌన్సిల్ సమావేశ పరుస్తారా. చట్ట ప్రకారం కౌన్సిల్ ఇంకా ఉన్నట్లే లెక్క. ఈ లెక్కలకు ప్రభుత్వం భావిస్తే అర్థముంటుంది. ఒక కౌన్సిల్ ను సమావేశ పర్చినా ప్రభుత్వం సహకరిస్తుందా? ముఖ్యమంత్రి ఈ కౌన్సిల్ లో మళ్లీ అడుగుపెడతారా? మంత్రులు ఎగువసభకు హాజరవుతారా? ఎందుకంటే, కౌన్సిల్ తెలుగుదేశం సభ్యులు కూడా ఆగ్రహంతోనే ఉన్నారు. కోవిడ్ నివారణ ప్రభుత్వం విఫలమయిందని చెబుతున్నారు. ఇసుక దందా నడుస్తున్నదని, మద్యంలో స్మగ్లింగ్, ప్రభుత్వ భూముల విక్రయాలు… ఇలా రకరకాల ఆయుధాలను పదునుబెట్టి ప్రభుత్వం మీద దాడికి సిద్ధమయింది. అందుకే స్పల్ప కాల సమావేశాలే అయినా,ఈ సమావేశాలలో ముఖ్యంగా కౌన్సిల్ బాగా వేడెక్కతుందని అనుకుంటున్నారు. అసెంబ్లీలో టిడిపి గొడవ చేసే స్థితిలో లేదే. ఇక మిగిలింది కౌన్సిలే. అందువల్ల చ్చూస్చూసి కౌన్సిల్ ను సమావేశపరుస్తారా? సమావేశ పర్చకపోతే, తప్పించుకోవడమెలా? అన్నీ ఆసక్తికరమయిన ప్రశ్నలే.

నిమ్స్ లో 5 శాఖలు బంద్, క్వారంటైన్ లో 400 మంది హైదరాబాద్ డాక్టర్లు

 ఈ నెల 19న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు శాసనసభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ తేదీ కలిసొచ్చేలా 16 నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికందని సమాచారం ప్రకారం, ఈ నెల 18న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కరోనా నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను సాధ్యమైనన్ని తక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.