టిఆర్ ఎస్ ఎమ్మెల్యే కోనేటి కోణప్పకు కోపమెందుకొచ్చిందటే…

కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కోపమొచ్చింది. ఆయన గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంమీద కోపంగా ఉన్నారు.
పార్టీ నాయకత్వం అండతో అటవీ శాఖ మంత్రి ఎ ఇంద్ర కరణ్ రెడ్డి తన నియోజకవర్గంలో సమస్యలు సృస్టిస్తున్నాడన్నది ఆయన ఆరోపణ.
దీనితో ఆయన ఈ రోజు ఇంద్ర కరణ్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జడ్ పి సర్వసభ్య సమావేశాకిని హాజరు కాలేదు. ఆయన తోపాటు అనేక మంది జడ్ పిటిసిలుకూడా హాజరుకాలేదని తెలిసింది. కోణప్ప మూడో సారి ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అసాధారణ పలుకుబడ్డి ఉన్నవాడు. ప్రజల్లో మంచి పట్టున్నవాడు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రెండో ప్రభుత్వం అనుకున్నంత సజావుగా సాగుతున్నట్లు లేదని ఈటెల రాజేందర్, కోణప్పల తీరుచూస్తే అర్థమవుతుంది. ఇంక చాలా  మంది ఇలా లోలోన కుమిలిపోతున్నారని చెబుతారు.సోమారపు సత్యనారాయణ తెగే దాగా లాగడమెందుకుని పార్టీ కి రిజైన్ చేశారు.
మొత్తానికి పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.మంత్రి ఈ టెల్ రాజేందర్ దాదాపు నాయకత్వంమీద తిరుగు బాటు చేసి అసలు టిఆర్ జెండా వోనర్లమేమే అన్నాడు. మేమే అంటే అర్థం ఏమిటి?
ఇలాంటపుడే కోణప్ప కోపంగా ఉన్నారు. ఈ పరిణామాలన్నీంటిని భారతీయ జనతా పార్టీ అసక్తిగా, ఆశగా గమనిస్తూ ఉంది.
కోణప్ప కోపానికి కారణమేమిటి?
కాళేశ్వరం ప్రాజక్టు ముంపు అటవీ భూములకు కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద అటవీ భూముల్లో చెట్లు నాటాలి. దీనికి ఎంపిక చేసిన భూభాగాల్లో అటవీ శా ఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంకూడా ఉంది.  అయితే, అక్కడ అటవీ భూములు లేవని, అటవీ అధికారులను ఆయన పక్కనే ఉన్న కోణప్ప నియోజకవర్గానికి మళ్లించారానేది కాగజ్ నగర్ ప్రాంతంలోని గిరిజన నాయకుల ఆరోపణ.
దీనితో మంత్రి అండ జూసుకుని అటవీ శాఖ అధికారులు, అనిత అనే మహిళా రేంజర్ నాయకత్వంలో  పోలీసులు వెంటేసుకుని కాగజ్ నగర్ సమీపంలో తమ ప్రతాపం చూపి గిరిజనులు తరిమి తరిమి కొట్టి వాళ్ల భూముల్లో చెట్టునాటించారు.
ఇలా చేసేటపుడు నియోజకవర్గంలో ఆశాంతికి కారణమయ్యే సమస్య వస్తున్నపుడు ఎమ్మెల్యే  కోణప్పకు ఒక్క మాటకూడా చెప్పలేదు. అటవీఅధికారులు సర్సాల తోపాటు అక్కడి అనేక గ్రామాల ప్రజలను తరిమేసేందుకు చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు.
ఇది కూడా చదవండి

ఈ పిడుగుల కోసం కేంద్ర మంత్రి వేట… కనబడితే చెప్పండి… (Amazing Video)

దీనికి ఎదురుతిరిగినపుడు అటవీ అధికారులను గ్రామస్థులు చావగొట్టారని వీడియోలు తీసి సోషల్ మీడియాలోలీక్ చేసి తన అప్రతిష్ట పాలుచేశారని కోణప్ప అనుమానం.
నిజానికి గిరిజనులకు , అటవీ అధికారులకు మధ్యజరుగుతున్న గొడవలను ఆపేందుకు వెళ్లిన కోణప్ప తమ్ముడ కృష్ణ వస్తే ఆయన కొట్టాడని  కేసు పెట్టి రెన్నెళ్ల పాటు బెయిల్ రాకుండా చేసినందుకు కోణప్ప తీవ్రంగా కలత చెందుతున్నారు.
ఇంత జరగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని, ఇదంతా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డియే చేయించాడని సర్సాల చుట్టు పక్కల గ్రామాలలో ప్రజలు చెబుతారు. ముఖ్యమంత్రి పోడు భూములకు పట్టాలిస్తానన్నాడని, అటవీ మంత్రి మాత్రం భూములు లాక్కుంటున్నాడని బాధితులు చెబుతున్నారు.
కొమరం బీమ్ ఆసిఫాబాద్ ఫారెస్ట్ రేంజాఫీసర్ అనిత అలా రెచ్చిపోయేందుకు అటవీ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి  అండయే కారణమని కోణప్పమనుషులు చెబుతారు.
సర్సాల తదితర గ్రామాలలో జరిగిన ఆగడాలతో ఆయన బాగా అప్ సెట్ అయి ఉన్నారు. అందుకే ఈ రోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బాయ్ కాట్ చేశారని తెలిసింది.
కోణప్ప అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ విలేఖరి చేసిన  ప్రయత్నం ఫలించలేదు.
ఇది కూడా చదవండి

సాహో మూవీ రివ్యూ ఇక్కడ ఉంది