కరోనా వైరస్ అంటే ఎందుకు బయపడుతున్నారు?

(TTN Desk)
చైనా లో పుట్టిన కరోనా వైరస్ (COVID-19) ప్రపంచమంతా చాలా వేగంగా వ్యాపిస్తున్నది. దీనికి కారణాలు రెండు, ఒకటి బలమయిన చైనా ఆర్థిక వ్యవస్థ. రెండో ది వైరస్ స్వభావం. చైనాతో వ్యాపార, సాంకేతిక సంబంధాలులేని దేశం ప్రపంచంలో లేదేమో. ప్రపంచ జిడిపిలో చైనా వాటా 19.1 శాతం. ఎన్నికంపెనీలుచైనా ఉత్పత్తులు సరఫరా అవుతాయో లెక్కేలేదు.చైనా ఫోన్లు, చైనా వస్తువులు దొరకని దేశం ప్రపంచంలో ఉండదేమో. గ్లోబలైజేషన్ యుగంలో చైనా ఒక అద్భుతం.  అందుకే ఇతర దేశాలనుంచి అక్కడికి రాకపోకలు చాలా సహజం,  ఎక్కువ కూడా. చైనా ను చూసేందుకు వెళ్లుతున్న పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువయింది ఇందుకే.  అందువల్ల చైనా నుంచి వచ్చే వాళ్ల వల్ల వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. చివరకు చైనాసందర్శించిన దేశాధ్యక్షులను కూాడా క్వారంటైన్ చేసున్నారు. రెండు రోజుల కిందట  మంగోలియా అధ్యక్షుడు చైనాపర్యటన ముగించుకుని రాగానే , వ్యాధిసూచనలు లేకపోయినా, ఆయనతో పాటు మొత్తంచైనా వెళ్లి వచ్చిన  బృందాన్ని మొత్తంగా 14 రోజుల క్వారంటైన్ కు తీసుకెళ్లారు.
కొరొనా వైరస్ (కోవిడ్-19)ప్రమాదకరమయిందే. అది ప్రాణాపాయమే.అయితే మరీ అంత ప్రాణాపాయం కాదు(It is deadly, but not too deadly ) అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే, ఇది ఇటీవలే మనిషి మీద దాడిచేసింది కాబట్టి దీనికింకా వ్యాక్సిన్ తయారు కాలేదు. తయారు చేసేందుకు ప్రభుత్వాలు, మందుల కంపెనీలు పోటీపడుతున్నాయి. హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) శాస్త్రవేత్తలు కూడా మేమూ దీనికి విరుగుడు మందు తయారు చేయబోతున్నాం అంటున్నట్లు ఈ రోజు ‘ది హిందూ’ రాసింది.
ది అట్లాంటిక్’ (TheAtlantic) కోవిద్-19 మీద చాలా ఆసక్తి కరమయిన విషయాలు ప్రచురించింది. ఈవ్యాధి ఎంత వేగంగా వ్యాపించినా, ప్రాణాపాయం 2 శాతానికి మాత్రమే. అంటే, ఈ వ్యాధి చాలా మందికి వ్యాపిస్తుంది. వారంతా చనిపోతారని కాదు. అలాగే, ఈవైరస్ సోకినంత మాత్రాన అంత జబ్బు పడతారనీ కూడా  కాదు. చాలా మంది వైరస్ పాజిటివ్ అని తెలినా  వారిలో వ్యాధిలక్షణాలు కనిపించడం లేదు. ఈ వ్యాధితో వచ్చిన ప్రమాదం ఇదే. వ్యాధి లక్షణాలున్నవాళ్లు మామూలుగా జీవిస్తూనే ఉంటారు. జపాన్ క్రూజ్ లో ఉన్న 14 మంది అమెరికన్లు వైరస్ పాజిటివ్ అని తేలింది .అయితేవారిలో ఏ జబ్బు లక్షణాలు కనిపించలేదు. కాని ఇలాంటి వారు వైరస్ ను అందిరికి వ్యాప్తి చేస్తూంటారు.
Think your friends would be interested? Share this story
కరొనా వైరస్ కు ఆపేరు ఎందుకు వచ్చింది.
ఈ వైరస్ ఉపరితలం మీద కిరీటం వంటి బుడిపెలుంటాయి (ఫీచర్ ఫోటో) కాబట్టి శాస్త్రవేత్తలు దీనిని కరొనా వైరస్ అని పిలిచారు. కరొనా వైరస్ లు మనిషికి కొత్త కాదు. కొన్ని కరొనా వైరస్ లో మనిషితో పాటే పెరిగాయి. అందువల్ల వాటితో పెద్ద గా ముప్పు లేదు.ఈ కరొనా వైరస్ లు (human coronaviruses)  అల్ఫా, బీటా, గామా, డెల్టాఅని నాలుగు రకాలు. మనిషితో పాటు ఎదిగిన నాలుగు కొరనా వైరస్ ల పేర్లు:  229 E(Apha Coronavirus), NL63(Alpha Coronavirus), OC43 (Beta Coronavirus), HKU1(Beta Cornavirus).
ఈ మధ్య మరొక మూడు రకాల కరొనా వైరసులు కూడా మనుషుల మీద దాడి చేసి బీభత్సం సృష్టించి హ్యూమన్ కరొనా వైరస్ జాతిలోకి వచ్చాయి . అవి : MER-CoV(Beta Coronavirus) దీనికి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ను కలిగిస్తుంది.SARS-CoV(Beta coronavirus- సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తీసుకువస్తుంది), SARS-CoV2. ఇదే COVID-19. ఇపుడు ప్రపంచమంతా వ్యాపిస్తున్న మహమ్మారి.
ప్రపంచంలో మొదటినాలుగరకాల కరొనా వైరస్ లు సర్వసాధారణం. అవి మనిషితోపాటు పెరిగాయి కాబట్టి,మనిషిలో వాటిని తట్టుకునే శక్తి వచ్చింది. అందుకే కామన్ ఇన్ఫ్లుయంజా వల్ల చనిపోయే వారి సంఖ్యా చాలా చాలా(0.05 శాతం) తక్కువ.
సరస్ (10 శాతం),ఇబోలా(80 శాతం) వంటి వాటితోపోలిస్తే కోవిద్ 19 (చైనా వూహాన్ లో 4శాతం) అంతాప్రాణాపాయం కాదు అని అంతా తేలింది. అయితే, కోవిద్ 19 తో వచ్చిన సమస్య ఏమిటంటే, ఇది తక్కువ ప్రాణాంతకమయినా ఎక్కువ వ్యాపిస్తుంది. ఎక్కువ మందిలో కనిపిస్తుంది.అందుకే ఎక్కువ మరణాలు కనిపిస్తాయి.
కోవిద్ 19 ని ఆపడం కష్టమమని హార్వర్డ్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ మార్క్ లిప్ స్టిచ్ అంటున్నారు. వచ్చే ఏడాది లోపుడు ప్రపంచ జనాభాలో 40 శాతం నుంచి 70 శాతానికి ఈ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని లిప్ స్టిచ్ అన్నారు. అయితే, వీళ్లంతా రోగలక్షణాలు వస్తాయని చెప్పలేమని కూడా ఆయన చెబుతున్నారు. వీరిలో కొందరు స్వల్పంగా జబ్బు పడవచ్చు. కొందరిలో అసలు రోగ లక్షణాలే కనిపించకపోవచ్చు.
ఇతరకారణాల వల్ల అనారోగ్యంగా వున్నవారిలో కోవిద్ 19 ప్రమాదకరం కావచ్చు. అంటే మీరు అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నపుడు కోవిద్ 19 కు బయపడాల్సిన పనిలేదని ఆయన అంటున్నారు. జలుబు దగ్గులా ఇది మరొక వర్షాకాలం వచ్చే జబ్బు అయిపోతుంది. అంటే, ఇక ముందు మనం ‘జలుబు దగ్గు, కోవిద్ 10’ బాధపడుతున్నా అని చెప్పుకోవచ్చు.
అందుకే కొవిద్ ఎదుర్కోవడం అనే ఒక పెద్ద సవాల్ అంటున్నారు శాస్త్రవేత్తలు.
Inovio అనే సంస్థ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిందనే వార్త రాగానే, ఈ కంపెనీస్టాక్ రేటు డబుల్ అయింది.అయితే, నిజానికి ఈ సంస్థ కనిపెట్టింది వ్యాక్సిన్ ను కాదు, కోవిద్ 19 నుంచి ఒక చిన్న ఆర్ ఎన్ ఎ ముక్కని సేకరించింది. ఇది వ్యాక్సిన్ కనిపెట్టడంలో మొదటి ప్రక్రియ. వ్యాక్సిన్ కనిపెట్టడమనేది, చాలా దీర్ఘ కాలిక ప్రక్రియ. కనీసం దీనికి 18 నెలల దాకా పట్టవచ్చంటున్నారు. అంతేకాదు, కరొనా వైరస్ లలో ఒక చీలిక ఆర్ ఎన్ ఏ (single strand RNA) మాత్రమే ఉంటుంది. ఈ తరగతి వైరస్ లస్వభావమేమింటే అవి తరచూరూపాంతరం (mutate) చెందుతూ ఉంటాయి. అందువల్ల ప్రతిసారి కొత్త వ్యాక్సిన్ లు కనిపెట్టాల్సి వస్తుంటుంది.
అయితే, లండన్ ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు మరొక విధంగా ఆందోళన చెందుతున్నారు. ఛైనా నుంచి ఎగుమతి అయిన కోవిద్ 19కేసులలో మూడింట రెండు వంతుల కేసులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ జబ్బును దేశమంతా అంటించేందుకు నూరు నుంచి రెండొందల మంది చాలని Science మ్యాగజైన్ లో (The Cononavirus Seems Unstoppable. What Should the World Do Now?).అందువల్లో కోవిద్ వ్యాప్తి అరికట్టే అవకాశాలు మృగ్యమయ్యాయని వారు చెబుతున్నారు. ’ఈ వైరస్ చైనా నుంచి తప్పించుకునిప్రపంచంలోకి వచ్చేసింది.గుట్టుచప్పుకాకుండా విస్తరిస్తూ ఉంది.దీనిని అరికట్టగలమనే నమ్మకపోయింది నాకు,’
ఆక్స్ ఫోర్టు కు చెందిన క్రిష్టఫర్ డై(Christopher Dye) చెబుతున్నారు. ఇక అమెరికాలో కూడాఇది ప్రవేశించింది. ఇక్కడ నిత్యజీవితం తీవ్రంగా చిన్నాభిన్నమవుతుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల అండ్ ప్రివెన్షన్ కు చెందిన కోవిద్ 19ను ఒక కంట కనిపెడుతున్న టీమ్ నాయకత్వం వహిస్తున్న నాన్సీ మెసానియర్ (Nancy Messonnier) చెప్పారు.
 ఇక వైరస్ మనిషి వెళ్లే ప్రసక్తి ఉండదని, కామన్ కోల్డ్ వైరస్ లాగా దీనితో సహాజీవనం చేసేందుకు మనిషి తయారు కావాలని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.