కల్నల్ సంతోష్ అంత్యక్రియల మీద కెసిఆర్ కు 9 ప్రశ్నలు : ఆలేరు కాంగ్రెస్

ముఖ్యమంత్రి కెసిఆర్  ఫార్మ్ హౌస్ కు కూత వేటు దూరంలో ఉన్న హకీం పేటకు వెళ్ళి కర్నల్  సంతోష్ కుమార్ అంత్యక్రియలకు తెలంగాణ సీఎం కెసిఆర్ ఎందుకు హాజరు కాలేదనే ఇపుడు చర్చనీయాంశమయింది. నిన్న చాలా మంది ప్రముఖలు ఆయన అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పరించారు. అయితే,కెసిఆర్ కనిపించకపోవడం కట్టొచ్చినట్లు కనిపించింది. దీనిని కాంగ్రెస్ నేతలు ఎత్తి చూపుతున్నారు. నిన్న నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్నల్ సంతోష్ అంత్యక్రియలకు హాజరయి నివాళులర్పించాక ఇదే ప్రశ్న లేవనెత్తారు. ఛత్తీష్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (కింది ఫోటో) ఆ రాష్ట్ర అమరజవాన్ పాడె భూజాన మోసి తన గౌరవమేమిటో చాటారని కాంగ్రెస్ చెబుతూ ఉంది.

 

గాల్వాన్ లోయలో భారతీయ సైనికుల మీద చైనా జరిపిన ఇదే దాడిలో ఒడిషా నుంచి ఇద్దరు జవాన్లు అమరలయ్యారు. వారికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా నివాళులర్పించారు.
Odish CM Naveen Patnaik pay tributes martyred soldiers (credites: OdishaTV)

 

ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం ఇష్టంలేదు కానీ ముఖ్యమంత్రి తీరు దూరదుష్టకరమని కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశంకోసం ప్రాణాలను అర్పించిన వీరుడి కి శ్రద్ధాంజలి ఘటించి తీరాలని,  అంత్యక్రియలకు కెసిఆర్ రాకపోయినా బాధలేదు కానీ దేశంకోసం ప్రాణాలను అర్పించిన వారికి కనీసం శ్రద్ధాంజలి ఘటించే సమయం లేకపోవడమే బాధాకరం అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర గవర్నర్ సైతం గంట సేపు ఆగి శ్రద్ధాంజలి ఘటించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈరోజు ఈ చర్చను మరింత ముందుకు తీసుకువెళ్లూ ఆలేరు కాంగ్రెస్ నాయకుడు మల్లెల శ్రీకాంత్ పది ప్రశ్నలు సంధించారు.
కర్నల్ సంతోష్ అంత్యక్రియలకు హాజరుకాకుండా దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను అగౌరపరిచారని  ఆయన వ్యాఖ్యానించారు. గంతంలో ‘ఎన్నో అవసరం లేని’ కార్యక్రమాలకు సీఎం హోదాలో హాజరయ్యారయిన ముఖ్యమంత్రి కర్నల్ అంతిమ యాత్రలో పాల్గొనకపోవడం న్యాయం కాదని ఆలేరు కాంగ్రెస్  నాయకుడు అన్నారు. గవ
1.పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి అంత్య క్రియలకు హాజరు కాలేదా?
2.మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి అంత్య క్రియలకు హాజరుకాలేదా?
3.విజయ నిర్మల అంత్య క్రియలకు హాజరుకాలేదా?
4.రాజగోపాల్ రెడ్డి కూతురి పెళ్ళికి హాజరుకాలేదా?
5.ఈటెల రాజేందర్ గారి ఇంట్లో పెళ్ళికి హాజరుకాలేదా?
6.పరిటాల ఇంట్లో పెళ్ళికి అంత దూరం వెళ్లలేదా?
7.నారాయణ కొడుకు మందు తాగి ఆక్సిడెంట్ లో పోతే హాజరుకాలేదా?
8.హరి కృష్ణ అంత్య క్రియలు అధికార లాంచనాలతో దగ్గరుండి చేయించలేదా?
9.చివరికి ఒక ఫ్లాప్ హీరో బాల కృష్ణ సినిమా గౌతమి పుత్ర శాత కార్ని రిలీజ్ ఫంక్షన్ కు హాజరుకాలేదా?
ఇలా ఎన్నో పనికి రాని వాటికి హాజరైన ముఖ్య మంత్రి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ తెలంగాణ ముద్దు బిడ్డ కల్నల్ సంతోష్ కుమార్ అంత్య క్రియలకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలని ఆయన అన్నారు.

అంతే కాదు….మీరు
1. ప్రియాంక రెడ్డి దారుణ హత్య పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్ళువెత్తినా మీరు కనీసం స్పందించలేదు
2. 18 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మ హత్యలపై కనీస స్పందన లేదు
3. TRS పార్టీ భవనానికి స్థలం ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించిన కొండ లక్ష్మణ్ బాపూజి అంత్య క్రియలకు హాజరు కాలేదు
4. పదుల సంఖ్యలో RTC కార్మికులు బలిదానాలు చేసుకుంటే కనీసం పాపం అనలేదు
5. కొండ గట్టు బస్సు ప్రమాదం లో 63 మంది ప్రయాణికులు చనిపోతే కనీసం సంతాపం తెలుప లేదు
6. మీకు 20 కిలోమీటర్ ల దూరంలో ఘోర రైలు ప్రమాదం లో చిన్న పిల్లలు చనిపోతే కనీసం స్పందించలేదని ఆయన వ్యాఖ్యానించారు.