గాంధీజీ ‘రామనామ’ స్మరణ ఎపుడూ వదల్లేదు, ఆయనకు ‘రామజపం‘ నేర్పిందెవరు?

గాంధీ జయంతి ప్రత్యేకం

(KC Kalkura)
నూట ఇరవై ఏడు సంవత్సరాల ముందు , జూన్, 7,1893 తేది రాత్రి, దక్షిణ ఆప్రికాలోని పీటర్ మేరిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్ లో మొదటి తరగతి పెట్టెనుండీ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ అనేే  24 సంవత్సరాల  యువకుడిని టికెట్ కలెక్టర్ కిందికి తోసేశాడు.
కారణం, అతడు ఒక భారతీయుడు, నల్ల జాతివాడు.
నల్ల జాతీయులకు, ఆ పెట్టెలో ప్రయాణించెే హక్కు, అర్హత లేదు కాబట్టి, గాంధీని తోసేశాడు. ఈ రైలు పెట్టేలో ప్రయాణించేందుకు అవసరమయిన టికెట్ తన దగ్గర ఉన్నదని గాంధీ ఎంత విన్నవించినా ఆ తెల్ల టికెట్ కలెక్టర్ వినిపించుకొలేదు.
రాత్రంతా మొండి పట్టుతో, పట్టుదలతో, చలి, గాలిని సహించి  అక్కడే ఉన్నారు గాని గాంధీజీ రాజీ పడి రెండవ తరగతిలో ప్రయాణించలేదు.
అక్కడి నుండి లేచి జైలుకు వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అతడు “మహాత్మా గాంధీ” కావడానికి ఒక మెట్టు ఎక్కాడు.
ఆ రోజు నాందీ పలికి,  ఆఖరి ఊపిరివరకూ, శాంతియుత పోరాటాలతోనే, “అహింసా పరమో ధర్మః”  అంటూ ఎన్నో కార్యాలను, ఆశయాలను సాధించారు. పొరపాటున కూడా హింసను కాన్సియస్ గా  ప్రొత్సాహించలేదు.
image.png
ఆగస్ట్ 15, 1947, ఇండియా, పాకిస్తాన్ గా విడిపోయి భారత దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. ఆ రోజు, రాజధాని ఢిల్లీ వెేడకలలో ఉండవలసిన గాంధీ, పశ్చిమ బెంగాల్ రాజధాని, కలకత్తాలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల  మధ్య నెలకొన్న మతకలహాలను, శాంతియుతంగా, సామరస్యముగా పరిష్కరించడానికి తన శాయ శక్తులా శ్రమిస్తున్నారు.
ఆగస్ట్ 26, 1947 న గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ గాంధీజీకి ఒక  ఉత్తరం రాశారు. “నా ప్రియమైన గాంధీజీ,  పంజాబ్ లో   55,000 సైనికులున్నా, ఉధృతమైన హింసాకాండ మేము చూస్తున్నాము. బెంగాల్ లో  మీ  బలగమంతా ఒకే ఒక వ్యక్తి. ఐతెే అక్కడ హింసాకాండే లేదు.  ఒక ప్రభుత్వ అధికారిగా, పరిపాలకుడిగా, ‘ఒక మనిషి’ శాంతి సేనకు (one-man army), అహింసా పోరాట బలానికి నా జోహర్లు సమర్పించడానికి అనుమతిస్తారా?”
ఇది కూడా చదవండి

*ఇలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడిచాడంటే ముందుతరాల వారికి నమ్మశక్యంగా ఉండదు

లార్డ్ మౌంట్ బాటెన్, ఆ రోజుల్లో అత్యున్నత స్థానాన్నఅలంకరించిన, ఇంగ్లండ్ నౌకా దళాధిపతి. రెండవ ప్రపంచ యుద్ధములో జపాన్ సైన్యాన్ని మట్టి కరిపించిన ధీరుడు అనెే విషయాన్ని మనం గుర్తుంచుకొవాలి. ఇంతకంటె గొప్ప నివాళి శాంతి దూతకు అవసరమా?
కొన్ని రోజుల తరువాత, ఢిల్లీలొ,  జనరల్ కరియప్ప సైనిక దుస్తులను, పాదరక్షలను వదిలి పెట్టి గాంధీ దగ్గిరికి వచ్చారు.  ఆయనతో  చర్చిస్తూ, సైనిక బలముకంటే శాంతి మార్గమే ప్రబలమైనదని గాంధీజీ ఒప్పించారు.
ఆయుధాలతో కాదు, స్నేహ, ప్రేమ, సౌభ్రాతృత్వంతో గెలువాలని ఉపదెేశిస్తారు,  దేశ రక్షణకు సైన్యం అవసరమని అంగీకరిస్తూనే.
చివరకు లండన్ బ్రిటిష్ పార్లమెంటు ముందు ఇలా ధీమాగా నిలబడ్డాడు ‘అర్ధనగ్న ఫకీర్’ ( credits Prioryman via wikimedia)
జనవరి 21, 1948, ఒక పంజాబీ యువకుడు,  ప్రార్థనా సమావేశంలో ఒక బాంబు విసురుతాడు. “వాడిని పీడించవద్దని, వాడికి సంస్కారం నేర్పండి,” అని పోలిస్ సీనియర్  అధికారికి తెలిపాను. ఐతెే వాడిని వదిలి పెట్టండని చెప్పే అధికారం నాకు లేదు. చట్టాన్ని శాసించెేవాడిని నేను కాదు.” అంటారు  గాంధీ.
కేవలం దైహికమైన హింసయేగాక, ఆయన మానసిక హింసను సహించెేవారు కాదు, ఇతరులకు ఉద్దేశపూర్వకముగా మానసిక క్షోభ కూడా గల్గించెేవారు కాదు.
ఆగస్ట్, 8, 1947, గాంధీగారు, తన బృందంతో లాహోర్ నుండి పట్నా వెళ్తున్నారు. వీపరీతమైన వర్షం.  ఆయన ప్రయాణిస్తున్న రైలు పెట్టె కారుతూ ఉంది. ఈ విషయము తెలుసుకొన్న గార్డ్, పెట్టె దగ్గర వచ్చి, “మీరు అనుమతిస్తే, మిమ్ములను వేరే పెట్టెకు మార్చుతాము. అది కొన్ని నిమిషాల పని. అనుమతించండీ బాపూజీ,” అని విన్నవించుకొంటాడు.
“మరి, ఆ పెట్టేలొ ఉన్నఇతరులను ఏమి చేస్తారు” అని ఆడుగుతారు, గాందీజీ. వారు ఈ పెట్టెలోనే ఉండి రావడానికి ఒప్పుకొన్నారు” అంటాడు గార్డ్.
 తన పేరుతొ ఇతరులకు ఇబ్బంది కలగడాన్ని కూడా  ’హింసగా పరిగణించారాయన.
అందుకెే వినయంగా నమ్రతతొ, విన్నపాన్ని తిరస్కరించి,  దెేశభక్తితో, ప్రామాణికంగా పని చెయ్యండని రైల్వెే సిబ్బందికి సందేశమిచ్చి రైలును నడుపమన్నారు. (జూన్, 7,1893, దక్షిణ ఆఫ్రి కా  లోని పీటర్ మేరిట్జ్ బర్గ్ రైల్వెే స్టేషన్ లొ జరిగిన దుర్ఘటనాన్ని జ్ఞాపకం చేసుకోండిక్కడ).
స్వాతంత్యం వచ్చిన తరువాత, పాకిస్తాన్ కుతంత్రాలు పన్నుతూ, కాశ్మీర్ లో అల్లరికి, హింసాకాండకు  ఆజ్యం పోస్తూ ఉంటే, భారత ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఇవ్వవలసిన మొత్తాన్ని నిలిపివేసింది. ఇది గాాంధీజీకి నచ్చలేదు.
మాట తప్పడం, శ్రీరామునికి అవమానమంటూ, అహింసకు అడ్డు గోడ అంటూ, దానికి నిరసనగా నిరాహార దీక్షకు పూనుకున్నారు గాంధీజీ. భారత ప్రభుత్వం, 55 కోట్ల రూపాయలు చెల్లించిన తరువాత దీక్షను విరమించారు. తన, పర, భేదము లేకుండా శాంతియుత పోరాటం ఆయన నియమం.
ఎంతటి సాహసం చెయ్యడానికైనా ఒడిగట్టే  శక్తి సామర్థ్యమ్ ఈ బక్కపల్చటి గాంధీజీకి ఎక్కడి నుండి వచ్చింది?
“మోహన్ దాస్ ఒక సున్నిత  మనోభావం గలిగిన వాడు. భయగ్రస్థుడైన  పిరికి  పిల్లవాడు. ఇంటి పక్కలొ, నల్ల కృష్ణ విగ్రహం ఉన్న చీకటి కృష్ణ దేవాలయం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అర్థం  కాని మంత్రాలు, కుళ్లి పోతున్న పూలు, కాలిన నూనె దుర్గంధ వాసన ఆయనకు అసహ్యమనిపించేది. అందువల్ల ఆ గుడిని ఆయన  తప్పించుకుని తిరిగేవాడు. తల్లి తండ్రులతో అక్కడికి వెళ్లే వాడు కాదు. మొహన్ దాస్ తల్లి పుత్లీబాయికి చీకటి, నల్లటి దేవుడంటేగాని భయము లేదు. దేవుని ప్రీత్యర్థం, వానకాలం నాలుగు నెలలూ ఆమె ఉపవాసం చేస్తూ, నిరాడంబరతో ఇతర నోములు,వ్ర  తాలను ఆచరిస్తూ, దేవుళ్లను   ప్రార్థించేది. మోహన్ దాస్ కొరకు నియమించిన ఆయా/దాది, మోహన్ దాస్ ఆమెతో తనకి భూతాల గురించి భయమన్నప్పుడు, రంభ : “భూతాలు లెేవు.  నీకు భయమైతె రామనామం జపించు.”  విష్ణువు అనెేకానెేక పేర్లలొ, రామ ఒకటి. ఆ రోజు మొదలు పెట్టి, డెబ్బై సంవత్సరాల దాకా గాంధీజీ  “రామ” జపం వదల్లేదు.  రామ నామాన్ని తన కడపటి ఊపిరిలొ కూడా జపించినాడు.” (source: Robert Pyne, The life and Death of MAHATMA GANDHI, Page, 26. ) జీవితమంతటా భగవంతుని పై తన అచంచల విశ్వాసాన్ని వ్యక్త పరుస్తూ, తన భగవంతుడు, రాముడేనంటూ, రామ భజనే తనకు బలం, ధైర్యం అని విశదీకరిస్తూ వచ్చారు.

ఇంటి పని మనిషి ద్వారా రామనామాన్ని జపించడానికి మొదలు పెట్టి, ఆమె సలహానే పాటిస్తూ, అహింసా మార్గం ఎంచుకుని ప్రపంచంలో  మునుపెన్నడూ లేని భక్తి మార్గం వేశాడు గాంధీజీ.

కట్టమంచి రామలింగా రెడ్డిగారన్నట్లు గాంధీజీ ఒక రాజకీయ చతురుడు, అలానెే ఆధ్యాత్మిక చింతకుడు కూడా.  ప్రపంచ రాజకీయాలలో ఆధ్యాత్మికతను  ప్రవెేశ పెట్టిన ఘనకీర్తి కూడా గాంధీ గారికే దక్కుతుంది.
ఆగస్ట్ 15, 1947, స్వాతంత్య్రం సంపాదించాము. అంతకంటె 25 సంవత్సరాల ముందే ఆయన మహాత్ముడయ్యాడు.ఆయన శాంతి మంత్రాలే ఆదేశాలు: Non cooperation, Simon go back, Dandi march, ఉప్పు  సత్యాగ్రహం, Quit India, Do or die. ఇవి సామాన్య జనాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
ఆంగ్లేయులకు పరిపాలన సాగించడమే ఇబ్బందికరంగా మార్చిన వాడు గాంధీజీ. ఎదుటివాడు ఎంత తీవ్రంగా విమర్శించినా   ఓర్పుతొ, సమాధానమిస్తూ ఆయనకు నోటి మాట లేకుండా చెయ్యడం గాంధీగారి బ్రహ్మాస్త్రం.
ఇంగ్లండ్ లో రాజుగారిని కలిసినప్పుడు, రాజుగారు: “గాంధీ, నా కుమారుడు, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యానికి ఉత్తరాధికారి. ఆయనను మీరు, బహిష్కరించారు. ఇది అవమానం.” అన్నప్పుడు గాంధీజీ సమాధానం:  “గౌరవనీయమైన చక్రవర్తిగారు, నేను మీ కుమారుడిని బహిష్కరించలేదు, మీ దొరతనానికి అవమానమూ చెయ్యలేదు, నేను భారత దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, నిరసించాను.” అన్నారు.
చర్చిల్ ఒక మెట్టు ముందుకు వెళ్ళి: ”ఇండియా నుంచి వచ్చిన ఒక అర్ధ నగ్న ఫకీరు, సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం చక్రవర్తిని, బకింగ్ హ్యామ్ రాజప్రాసాదంలో, ఒట్టి కాళ్లతొ నడిచి వచ్చి, కలవడం, చేయి కల్పడం, సహించరాని అవమానం” అన్నారు.
దానికి అతి సున్నితంగా :  “సూర్యుడు మిమ్ములను నమ్మడు కాబట్టి, మీ సామ్రాజ్యములో ఆయన అస్తమించడు,” అని అని వ్యంగ్యాస్త్రాన్ని ప్రయోగించారు.
భారత దేశంలో, యాబై శాతం ప్రజలకి ఇంత కూడా బట్టలు లేవనెే విషయాన్ని ప్రపంచానికి తెలుపడానికి నేనిక్కడికి వచ్చాను.
రాజు మనకిద్దరికి కావలిసినంత బట్టలు ఇ చ్చా డు.  నాకేందుకు ప్రత్యేకంగా బట్టలు; మర్యాద కాపాడుకొవడానికి ఉంటే చాలు.  రాజు, చర్చిల్, భారత దేశానికి వస్తే, వారికిష్టమైన బట్టలు తొడు క్కొ న వచ్చు.” అని చర్చిల్ నోరు మూయించారు.
రెండవ ప్రపంచ యుద్ధాన్ని జయించిన వ్యక్తి, అర్ధనగ్న ఫకీర్ తో వైరం పెంచుకొంటూ పోయింనందువల్లనే, బ్రిటిష్ సామ్రాజ్యం పతనమైందని చరిత్రకారుల అభిప్రాయం (Gandhi and Churchill — The Epic Rivalry That Destroyed an Empire and Forged Our Age, by Arthar Herman).
image.png
అహింసా పరమోధర్మః మార్గాన్ని అనుసరించడానికి, మానసిక, దైహిక హింసను అనుభవించివాడాయన. వేలాది మంది, ఆబాల గోపాలం, సంపన్నులు, విద్యావంతులు, వివిధ వృత్తులలొ లీనమైన వాళ్లు, తర తమ భేదాలు లేకుండా, ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించారు.
ఉదాహరణకు, ఆయకంటె 8 సంవత్సరాల పెద్దవాళ్ళు మహామేధావులయిన  మదన మోహన్ మాలవీయ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయనతో విభేదిస్తూ గౌరవించారు.
మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గాంధీ చేపడుతున్న సత్యాగ్రాహానికి వ్యతిరేకం. ఇది యూనియనిజానికి దారి తీస్తుందని భారత దేశ పారిశ్రామికీకరణను దెబ్బతీస్తుందని ఒక లేఖలో గాంధీజీకి సలహా ఇచ్చారు.గాంధీజీ వింటాడా? విశ్వేశ్వరయ్య మిత్రుడే అయినా, అహింసామార్గంలో న్యాయం కోరే హక్కు ప్రతిమనిషికి ఉంటుందని సమాధానమిచ్చారు.
ఎంతటి సమస్యకైనా శాంతి మార్గం, రామరాజ్యం పరిష్కారాలు అనెేది గాంధీజీ దృఢ నమ్మకం.
 అక్టోబర్ 26, 1947 సాయంకాలం, ఢిల్లీలో కారాగారంలొ ప్రార్థనా సమావేశం జరిపారు. అక్కడ తన సుమారు ఐదు సంవత్సారాల  జైలు అనుభవాలను ఖైదీలతొ పంచుకొంటూ, నెేర మనోభావము ఒక రోగం అని గాంధీజీ ఉద్భోధించారు.  ఈ మనోవ్యాధిని నయం చెయ్యడానికి, కారాగారాల అధికారులుగా  వైద్యులుండాలి అన్నారు.
 ఆ రోజుల్లో అంటు రోగాల నివారణ కొరకు వైద్యులను, ప్రత్యేకించి భారతీయ వైద్య పరిశోధనా సంస్థ  మొట్ట మొదటి నిర్దేశకులు రాబర్ట్ మాక్ కారిసన్ తొ తరచుగా సంప్రదించెేవారు.
 రామరాజ్యం అంటే అది రోగ రహిత సమాజం అయి ఉండాల అని నమ్మేవారు.
శరీరే జర్జరీ భూతెే వ్యాధిగ్రస్థే కళెేేబరెే!
ఔషధం జానకీ తోయం వైద్యో నారాయణో హారిః!!
(రోగగ్రస్థమైన శరీరం బలహీనమై  బాధల్లో ఉన్నప్పుడు, ఔషధం గంగా జలం. వైద్యుడే నారాయణుడై దానిని తొలగిస్తాడు) ఈ నాడు గాంధీగారు ఉండిఉంటె వైద్య రంగ నిష్ణాతులతో కొవిడ్ 19 ఉపశమన మార్గం గురించి సంప్రదిస్తూ ఉండెేవారు.
జీవితంలో ఆఖరి రోజున కూడా గాంధీజీ గ్రామ స్వరాజ్, రామరాజ్య స్థాపన కొరకు తపించారు. కాంగ్రెస్ పార్టీ “లోక సేవక సంఘము” గా వ్యవహరించి, ఒక స్వ చ్చంద సంస్థ లాగా పనిచేయాలని ఆయన భావించారు. దాని రూప కల్పన ప్రణాళిక కూడా సిద్ధంచేశారు.
రాజ్యాంగం 73, 74,  సవరణలు ఈ స్వరూపాన్ని సాక్షాత్కరించడానికి ఉద్దేశించినవి. ఐతెే అవి అమలులొకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన ఇంకా గ్రామ సభా వంటి, కీలక కార్యక్రామాలు సక్రమంగా జరుగక పోవడం దురదృష్టకరం.
ఇంతకు గాంధీజీ జపించిన ‘రామ’ ఎవరు?
అయోధ్య రామ కాదు, భద్రాచలం రామ కాదు,  ఒంటిమిట్ట రామ కాదు.
జనవరి, 24,1928 లో ఆ నాటి భావనగర్ సంస్థానంలోని వర్తేజ్ అనెే పల్లెలొ, అస్ప్రశ్యులకొరకు ఒక రామాలయానికి శంకు స్థాపన చెేశారు. ఆనాడు దేవాలయాలలో అస్ప్ర శ్యు లకు,  ఇతర వెనక బడిన తరగతుల వాళ్ళకు ప్రవేశం ఉండేది కాదు.
ఆ నాటి దురాచారాలను ఎదుర్కొవడానికి మాత్రమే ఆ దెేవాలయానికి శంఖు స్థాపన చెేశారెేగాని, లేకపోతే ఆయనకు దేవాలయాల మీద నమ్మకం లేదు. ఈ రామాలయాన్ని అంతా మర్చిపోయారు.
ఆయన నమ్ముకొన్నది కట్టమంచి వారన్నట్లు,  వాల్మీకి, కంబన్, తులసిదాస్, మొల్ల, రంగనాథ, తులసి, పుట్టప్ప, విశ్వనాథ తదితరులు సృష్టించిన ఆధ్యాత్మ రాముడు.
భారతీయ నాగరీకత, సంస్కృతి, సంప్రదాయాల, పునాది, స్థంబాలపై నిర్మించిన మహాశిల్పం.  భారత దేశం మునివర్యులు,  రుషులు, సాధులు, సంత్ లు, శాంతి మంత్రాలను ప్రభోదించారని ఆయన భావిస్తారు. అందుకే శాంతి మార్గం ఎన్నుకున్నారు.
పరంపరానుగతంగా, వాల్మీకి, వేదవ్యాస, గౌతమ బుద్ధ, ఆదిశంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య,  చైతన్య ప్రభువు, బసవణ్ణ, వివెేకానంద, వరుసలో గాంధీ అహింసామూర్తిగా, ఆధ్యాత్మిక చింతకుడిగా, సంఘ సంస్కర్తగా, ఆర్థికశాస్త్రవెేత్తగా, రాజకీయ నీతిజ్ఞుడిగా , విద్యా వేత్తగా, చరిత్రలొ శాశ్వతంగా నిలిచి పోయారు.
KC Kalkura
(KC Kalkura is an advocate from Kurnool, Andhra Pradesh)