Home Features క్లాస్ రూంలో ఒక్కొక్క సారి టీచరే విద్యార్థి అయిపోతూంటాడిలా!

క్లాస్ రూంలో ఒక్కొక్క సారి టీచరే విద్యార్థి అయిపోతూంటాడిలా!

90
0
(గంజి భాగ్యలక్ష్మి)
ప్రభుత్వ జూయర్ కాలేజ్‌లో ఉద్యోగం లో జాయిన్ అయిన
కొత్తలో….
నిజంగా పల్లెలనుండి వచ్చిన విద్యార్థులలో ఒక అమాయకత్వం తో కూడిన నిష్కల్మషం కనిపిస్తుంది. ఎకడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఒక వారం రోజుల దాకా విద్యార్థులతో మమేకమై వారి మనో భావాలు,లక్ష్యాలు కుటుంబ నేపధ్యాలు తెలుసుకోవడం నా అలవాటు. అపుడే వారి మానసిక సామర్థ్యం మీద ,వారి మీద నాకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడి
వారిని గైడ్ చేసేదానిని.
జూనియర్‌ ఇంటర్ విద్యార్థులు అందరూ కొత్త కొత్త గా
మేము కాలేజ్ కు వచ్చాము అనే ఒక తెచ్చిపెట్టుకున్న
పెద్దరికం, అమాయకత్వం కలబోతగా కాలేజి లోకి అడుగు పెట్టారు.పదవతరగతి కి ఇంటర్ కి తేడా కేవలం రెండునెలలే కానీ పెద్దవాల్లమయ్యామన్న ఫీల్
నవ్వు తెప్పిస్తది
కాలేజి అడ్మిషన్ లయిపోయి
క్లాసెస్ సీరియస్ గా జరుగుతున్నాయి.కాలం గడిచిపోతుంది…క్లాస్ లొ ఒక అబ్బాయి ఉండేవాడు.పేరు క్రిష్ణ. భద్రాచలం దగ్గర ఏజన్సీ యారియా నుండి వచ్చి వారి బంధువుల ఇంట్లో ఉండి కాలేజిలో చదువుతున్నాడు..
పేదరికం, అమాయకత్వం తో బాటు ఆ అబ్బాయి మాట్లాడితే కాస్త నత్తి..పిల్లలందరూ ఆ అబ్బాయి మాట్లాడితే నవ్వేవారు…నాకు బాధ అనిపించి తోటి పిల్లలను వారించేదానిని..క్రిష్ణ మాత్రం మేడం మీరు మంచోల్లు మేడం అని…క్రిష్ణా అది నా బాద్యత అనే దానిని..
ఒక రోజు స్టడీ అవర్ లో పిల్లలను కూర్చోబెట్టి చదివిస్తున్నాను.పిల్లలందరూ చదువుకుంటున్నారు.క్రిష్ణ కూడా. తోటి పిల్లలు ఆ అబ్బాయిని ఏదో విషయంలో బనాయిస్తున్నారు.ఆట పట్టిస్తున్నారు.
నేను‌ అబ్జర్వ్ చేస్తున్నాను. క్రిష్ణా లేచి ఇటురా వచ్చి నా దగ్గర కూర్చో అన్నాను.
అసలు కదలడం లేడు. అరే ఏమైంది వీడికి అనుకున్నాను.ఎన్ని సార్లు పిలిచినా రావడం లేడు.ఏంటా కారణం అని అలోచిస్తున్నాను.క్షమించండి మేడం నేను ఇక్కడి నుండి లేవను అంటు‌న్నాడు.
నామనసుకు అర్థం అవుతుంది.
ఏదో కారణం ఉంది అని.
బెల్ కొట్టారు.పిల్లలందరూ వెల్లిపోయాక ఆ అబ్బాయి లేచాడు.అపుడు నా కర్థం అయ్యింది క్రిష్ణ ఎందుకు కదలలేదో..పాపం ఆ అబ్బాయి ప్యాంటు వెనుకనుండి చివికి పోయి చినిగి ఉంది. అది బయటపడుతుందని కదలకుండా కూర్చున్నాడు.
మనసు కలుక్కుమంది..
బాధ వేసింది.
నా బ్యాగులో చూస్తే 350 రూపాయలున్నాయి.క్రష్ణా అని పిలిచి ఇచ్చాను..
ప్యాంటు కొనుక్కో అన్నాను.
ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు. పేదరికం వెంటాడినా
ఆ అబ్బాయిలో‌ ఏదో కసి ఉండేది. క్రిష్ణ బాగా చదువుకో అని ప్రోత్సహించేదాన్ని. క్రిష్ణ లోకూడా చదవంటే పట్టుదల ఉండేది. మా ఇద్దరిమధ్య అనుబంధం ఏర్పడింది.  అందుకే పిల్లలను వారిస్తూనే, క్రిష్ణను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. దాన్నతడు గొప్ప చేయూతగా తీసుకున్నాడు.
ఇంటర్ అయిపోయింది ఆ బ్యాచ్ వెల్లిపోయింది.అందరికీ మంచి మార్కులొచ్చాయి. క్రిష్ణ కు కూడా.
ఆ అబ్బాయి టి.సి.కోసం వచ్చినపుడు కలిసాడు..డిగ్రీ భద్రాచలం లో చేరుతున్న మేడం అన్నాడు.
కాలం ఆగదు కదా…
ఎన్నో జ్ణాపకాల ను
తనలో కలుపుకుని పరుగెడుతూనే ఉంటది.
అపుడపుడు క్రిష్ణ గుర్తు వస్తాడు….అతని పట్టుదల గుర్తొస్తుంది. పేదరికం అతన్ని లొంగదీసుకోలేకపోయింది.
టీచర్ కళ్లతో చూస్తే, ఆ రోజు చెప్పగానె విననందుకు క్రిష్ణ మీద ఏ లెక్చరర్ కయినా కోపం వస్తుంది.. మాట లెక్క చేయడం లేడని. ఎంతమంది క్రిష్ణలున్నారో మన చుట్టూ కదా..
కానీ పేదరికానికి బెడిసి ఆగిపోతే ఎలా..అందుకే వారిలో కసి నింపితే బ్రహ్మాండాన్నయినా బ్రద్దలు కొడతారు…కొరత ఉన్న చోటే ఏదో సాధించాలనే తపన ఉంటుంది. ప్రోత్సహించే ఒక చిన్న మాట వాళ్నని చాలా ముందుకు తీసుకువెళ్లుంది…తోసుకువెళ్తుంది.
కళ్ల తొ చూస్తే ఒక్కోసారి బాధ లోతు తెలీదు. నిజమే మనసుతో చూడాలి
మనసుతో మాట్లాడాలి. పెదాలతో కాదు కాసింత సాయం
కానీ కొండంత తృప్తి…
క్లాస్ లో టీచర్ నుంచి వచ్చే చిన్న ప్రశంస విద్యార్థి మీద చాలా పాజిటివ్ ప్రభావం చూపిస్తుందని నాకు క్రిష్ణ వెళ్లిపోయాక అనిపించింది.
క్లాస్ నాకూ ఒక  క్లాస్ రూం అయింది. పిల్లల ముందు నేనూ విద్యార్థినయ్యాను.  నేనూ మెళ్లిమెళ్లిగా చాాలా జీవితసత్యాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను,వాళ్ల నుంచి.

(గంజి భాగ్యలక్ష్మి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జూవాలజీ లెక్చరర్. బాగా  పేరున్నమోటీవేషనల్ స్పీకర్.)