స్పేస్ అంటే ఏమిటి? ఎక్కడుంది?: చిన్నప్రశ్న, చిక్కు ప్రశ్న

స్సేస్ (Space) అనే మాటకి తెలుగులో చాలా అర్థాలు చెప్పుకోవచ్చు. అది ఆకాశం, రోదసి, అంతరిక్షం అనేవి నిత్యవ్యవహారంలో వాడే మాటలు. చదువుకు కున్న వాళ్లకి ,చదువురాని వాళ్లకి కూడా బాగా పరిచయమయిన మాటలివి. మన తలమీద కనిపించే దంతా ఆకాశమని మనం అనుకుంటాం. అందుకే ఆకాశంలోకి తలెత్తి చూడు అంటుంటాం. ఆకాశంలోకి ఎగిరియే స్పెష్ షిప్ లను అంతరిక్ష నౌకలంటాం.  చాలా దూరాన కనిపించేదంతా రోదసి అనే అర్థంలో చెప్పుకుంటుంటాం తప్ప ఆకాశానికి, రోదసికి, అంతరిక్షానికి చాాలా మందికి నిర్వచనం తెలియదు. ఆకాశం ఎక్కడ  మొదలవుతుందో  చాలా మంది చెప్పలేరు. మన పైనున్నదంతా స్పేస్ కాదు. దీనికొక నిర్వచనం ఉంది.
అంతరిక్షంలోకి చాలా దేశాలు ఇపుడు స్పేస్ షిప్ లను, మనుషుల్ని పంపిస్తున్నాయి. పరిశోధనలు చేస్తున్నాయి. ఇవి ఎక్కడ బడితే అక్కడ, పైదంతా స్పేసే కదా అని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే, దేశాలన్నింటికి చట్టబద్ధమయిన గగన తలం ఉంది. అందువల్ల ఎవరికి హక్కుల్లేని స్పేస్ ను నిర్వచించుకుని అక్కడ ఎవరైనా ఏ పరిశోధనయినా చేసుకునేందుకు స్వేచ్ఛనీయాల్సి వచ్చింది. అపుడు స్పేస్ అంటే ఎక్కడ మొదలవుతుందో చెప్సాల్సి వచ్చింది.
దేశాలన్ని కలసి దేశాలకు సరిహద్దులు గీసుకున్నట్లు భూమికి ఒక సరిహద్దు రేఖను గీసి, ఆ పైదంతా స్పేష్ అని చెప్పు కున్నరు. ఒప్పుకున్నారు. ఆ సరిహద్దు రేఖ పేరు క్యారమాన్ రేఖ (Karman Line). భూఉపరితలం నుంచి అంటే సముద్ర మట్టం నుంచి (mean sea level) 100 కిలో మీటర్ల (62 మైళ్ల) ఎత్తున గీచుకున్న ఉహారేఖ అది. కారమాన్ రేఖ పై గాలి పల్చబడుతుంది. మామూలు విమానాలు ఎగరేందుకు అవసరమయిన లిఫ్ట్ ఇవ్వలేదు. ఈ రేఖకు పైభాగానా విమానాలు ఎగరాలి అంటే వాటికి అర్బిటాల్ వెలాసిటీ ఉండాలి. లేకపోతే భూమ్మీదికి పడిపోతాయి. NOAA (National Oceanic and Atmospheric Administration) పర్యవేక్షించే ఉపగ్రహాలన్ని ఈ గీతకు కొద్ది అటుఇటుగానే ఎరుగుతుంటాయి.
ఇక్కడికెళితే మనిషికి వూపిరాడదు. అంటే ఆక్సిజన్ ఉండదు. అక్సిజన్ ఉండదు కాబట్టి లైట్ స్కాటరింగ్ ఉండదు. అపుడేమవుతుంది, ఆకాశం బ్లూగా కాకుండా నల్లగా కనిపిస్తుంది. దేశాలకు సుముద్రజలాల్లో గగన తలంలో భద్రత కోసం కొంత మేర హక్కులుండాలి ఒక గీత గీసుకోవలసి వచ్చింది. 1900 లో హంగరీ భౌతిక శాస్త్రవేత్త ధియోడోర్ వాన్ క్యారమాన్ (Theodore von Kármán) (1881-1963) ఈ లైన్ ను నిర్వచించాడు.
అస్ట్రొనాట్ అంటే ఎవరు?
రోదసి లోకి పంపే వాహనమేదయినా సరే ఈ రేఖ దాటితే స్పేస్ ఫ్లైట్ సాధించిందని చెబుతారు. అమెరికా NASA లెక్క ప్రకారం స్పేస్ అనేది క్యారమాన్ లైన్ కు 12మైళ్ల దిగువనుంచే మొదలవుతుంది. సముద్ర మట్టం నుంచి 50 మైళ్ల నుంచే అన్నమాట. ఈ రేఖను దాటి ప్రయాణించే పైలట్లను, మిషన్ స్పెషలిస్టులను, చివరకు మిమ్మల్ని నన్ను కూడా అస్ట్రోనాట్ (astronaut) అని పిలుస్తారు.
Earth’s Atmosphere (Credits NOAA)
అయితే, కచ్చితంగా అంతరక్షంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడని ఎపుడు చెబుతారంటే అతగాడు భూ వాతావరణాన్ని పూర్తిగా దాటుకుని వెళ్లాలి. అంటే భూమ్మీది నుంచి మీరు 600 కి.మీద దూరాన ఉన్న భూవాతావరణ ఆవలి పొర దాటాలి. ఇక్కడ వాతావరణం దాదాపు శూన్యం. భూవాతావరణం అంతమవుతుంది. అక్కడ ఉధృతమయిన సౌర పవనాలు (Solar winds) వీస్తుంటాయి.
ఇంతవరకు మనిషి పంపిన చాలా వాహనాలన్ని 600 కిమీ ఎత్తులోపే ఉన్నాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 205 నుంచి 270 మైళ్ల ఎత్తునే ఉంది. గతంలో పంపిన స్పేష్ షటిల్ 200 కి.మీ ఎత్తునే భూమిచుట్టూర తిరిగింది. పోలార్ అర్బిటింగ్ సెటిలైట్స్ అన్ని 540 మైళ్ల ఎత్తునే ఉన్నాయి. 2009లో క్యాల్గరీ యూనివర్శిటీ వాళ్లు ( University of Calgary) స్పేష్ ఎక్కడ మొదలవుతుందో ఒక చిన్న లెక్క కట్టారు. భూవాతావరణం గాలి తెమ్మెరల నుంచి ఉధృత సౌరపవనాలకు మారడం ఎక్కడ మొదలవుతుందనేది వాళ్ల లెక్క.అంటే భూ వాతవరణ సరిహద్దు (Edge of space)118 కి.మీ (73 మైళ్లు) దగ్గిర మొదలవుతుంది.
Freedom of Space
స్పేస్ లో ఎవరైనా పరిశోధనలుచేసుకోవాలంటే ఎలా. ఒక దేశమ్మీద ఉన్న ఆకాశమంతా ఆదేశానిదేఅంటే ఆకాశంలో ఉపగ్రహాలు ఎగిరేదెలా. సముద్రంలో కొంత భాగాన్ని ఆ దేశపు సముద్ర జలాల ( Territorial sea)దూరాన్ని నిర్ణయించారు. ఇది తీంర నుంచి 22 కి.మీ లేదా 12 నాటికల్ మైళ్లు లేదా 14 మైళ్ల దూరం దాకా ఉంటుంది. ఆపైన ఉండేదంతా హై సీస్. అందే ప్రపంచం యావత్తు సొత్తు. ఇలాగే ఆకాశంలో కూడా ఒక అంతర్జాతీయ సొత్తు నిర్ణయించాల్సి వచ్చింది. ఈ అవసరం నుంచి వచ్చిందే Freedom of Space సిద్ధాంతం. రోదసిలోకి అమెరికా రష్యాలు పోటీ పడిఉపగ్రహాలు పంపిస్తుండటంతో స్పేస్ ఏజ్ అనేది మొదలయింది. తన ప్రయోగాలకు రష్యా నుంచి మాగగన తలం అనే అభ్యంతరం రాకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐషెన్ హోవర్ ఈ ప్రతిపాదన తీసుకు వచ్చారు. ఆకాశంలో కూడా ఎవరిష్టాను సారం వాళ్లు తిరగేందుకు, ప్రయోగాలు చేసుకునేందుకు వీలుండాలని అమెరికా భావించింది. సింపుల్ గా చెబితే, అమెరికా ప్రయోగించే ఉపగ్రహాలకు రష్యానుంచి ముప్పురాకుండా ఉండాలి. అయితే, మొదట రష్యా ఈ Freedom of Space కాన్సెప్ట్ ను అంగీకరించ లేదు.
అమెరికా సూచిస్తున్న ఎత్తుకంటే ఇంకా ఎత్తుకు ఈ కాన్సెప్ట్ ను తీసుకెళ్లాలనేది సోవియట్ యూనియన్ వాదన. సోవియట్ యూనియన్ అభ్యంతరాన్నిలెక్క చేయకుండా ఐసెన్ హోవర్ 1957 ఇంటర్నేషనల్ జియోఫిజికల్ ఇయర్ లో భాగంగా అమెరికా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నదని ప్రకటించారు. దీనితో ప్రీడమ్ ఆఫ్ స్పేఫ్ తనిష్టం వచ్చినట్లు తాను ప్రారంభించవచ్చని ఆయన భావించారు.
అయితే, సోవియట్ యూనియన్ ఈ క్రెడిట్ ను కొట్టేసింది. మనిషి సృష్టించిన మొట్టమొదటి శటిలైట్ స్పుత్నిక్ -1 ను అక్టోబర్ 4, 1957న ప్రయోగించింది. Freedom of Space కాన్సెప్ట్ ను  తానే ఆవిష్కరించింది.