ఎంత వాక్ చేసినా బొర్ర తగ్గడం లేదా, అయితే, ఇదే కారణం

నడక (Walking) వల్ల చాలా ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు. ఏంతో కొంత దూరం, నడిస్తే చాలు అది ప్రయోజనం. శరీరానికి వ్యాయామం లభిస్తుంది. బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు అని చాలా మంది నమ్మకం.
అందువల్ల పొద్దునో, సాయంకాలమో చాలా మంది వాక్ చేస్తుంటారు. అయితే, వాకర్స్ లో ఒక నిరాశ కూడా కనిపిస్తుంటుంది.తాము ఏళ్లుగా రోజూ క్రమం తప్పకుండా వాక్ చేస్తున్నా, బొర్ర తగ్గడమేలేదు, బరువుతగ్గడం లేదని చాలా నిట్టూరుస్తూండటం చూస్తుంటాం. వాళ్లకి అమెరికా బ్రిఘమ్ యంగ్ యూనివర్శిటీ వారు సమాధానం చెబుతున్నారు.
సింపుల్ గా… కేవలం వాక్ చేస్తే బరువు తగ్గుతారనుకోవడం భ్రమ అంటున్నారు. వాక్ వల్ల దానిప్రయోజనాలు దానికున్నాయి. మీరు బండరాయిలా ఇంట్లో సోఫా మీద కూలబడి  కూర్చున్నజఢత్వం నుంచి వాక్ మిమ్మల్నిబయట ప్రపంచంలోకి తీసుకస్తుంది. మీ శరీరానికి తప్పని సరిగా కావలసి వ్యాయామాన్ని స్తుంది. మిమ్మల్ని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది.  మీలోరక్త ప్రసారం బాాగా సాగుతుంది. అయితే, కేవలం వాక్ వల్ల బరువుతగ్గుతారనుకుని, బరువు తగ్గేందుకు చేయాల్సిన ఇతరపనులు చాలా మానేస్తుంటారు. అక్కడే సమస్య అంతా ఉంది.
బరువు తగ్గేందుకు బ్రిఘమ్ యంగ్ యూనివర్శిటీ వాళ్లేం చేబుతున్నారో చూద్దాం.
వాక్ గురించి కొన్ని మంచి మాటలు:
వాక్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వాక్ ఎంతసేపు చేయాలనేదానికి బంగారుప్రమాణం లాంటినియమం పది వేల అడుగులు.రోజూ పదివేల అడుగులు నడిస్తే వాక్ వల్ల ప్రయోజనాలు కనబడతాయి. నిజానికి ప్రయోజనాలు 7500 అడుగులు నడిచినప్పటినుంచి కనిపిస్తుంటాయని బ్రిగామ్ యంగ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే, బరువు తగ్గేందుకు మీరు పదివేలే కాదు, పదిహేను వేల అడుగులునడిచినా ప్రయోజనం ఉండదని వారు చెబుతున్నారు.
ఇది చెప్పేందుకు ఈ శాస్త్రవేత్తలు ఒక  ప్రయోగం చేశారు. ప్రయోగం ఫలితాలను జర్నల్ అఫ్ ఒబెసిటీ (Journal of Obesity) లో  ప్రచురించారు.
ఈ యూనివర్శిటీకి చెందిన ఎక్సరైసైజ్ సైన్స్ డిపార్ట్ మెంట్ (Exercise Scinece Department), అక్కడి న్యూట్రిషన్, డయటిటిక్స్, ఫుడ్ సైన్సెస్ శాఖ కు చెందిన సహచరులతో కలసి ఈ ప్రయోగాలు చేశారు. ప్రమోగానికి కొత్త గా కాలేజీలో చేరిన 120 మంది విద్యార్థులను ఎంచుకున్నారు. వాళ్ల చేత స్టెప్ కౌంటింగ్ ప్రయోగం చేయించారు. వాళ్లందరిచేత బృందాలుగా 10 వేల అడుగులు, 12,500 అడుగులు, 15,000 అడుగుల నడిపించారు. వారానికి ఆరురోజుల చొప్పున వారిచేత 24వారాలు వాక్ చేయించారు. ఈ ప్రయోగం నుంచి క్యాలరీలు ఎలా ఖర్చవుతున్నాయో పరిశీలించారు. వాళ్ల ఉద్దేశమేమిటంటే, పదివేల అడుగులు నడిస్తే బరువు తగ్గుతారనే నమ్మకం చాలా మంది లో ఉందిగదా, ఇది ఎంత వరకు నిజమో చూడటం. వాళ్లందరిచేత ప్రయోగం చేయించాక వాళ్లబరువు పరీశీలించారు. ఆశ్చర్యం వాళ్లందరూ 1.5 కెజి బరువు పెరిగారు.
ఎందుకిలా జరిగింది?
ఫలితాలను విశ్లేషిస్తేతెలిందేమిటంటే బరువు తగ్గేందుుక ఒక్క ఎక్సర్ సైజ్ మాత్రమే చాలదని. ఈ విషయాన్ని ఈ రీసెర్చ్ కు నాయకత్వం వహించిన ఎక్సర్ సైన్స్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ బ్రూస్ బెయిలీ ఈ రీసెర్చ్ పేపర్లో చెప్పారు.
ఎన్ని అడుగులు నడుస్తున్నారనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, మనుషులు శారీరక వ్యాయామాన్ని పెంచేందుకు వాకింగ్ ఉపయోగపడింది. అయితే, ఇది బరువు తగ్గించేందుకు ఉపయోగపడకపోవడం తమకు కనిపించిందని ప్రొఫెసర్ బైలీ చెబుతున్నారు.
ఈ ప్రయోగం పాల్గొన్నవారంతా 24 గంటల పాటు, వారానికి ఆరు రోజులు పెడో మీటర్ ధరించారు. ఈ స్టడీలో పాల్గొనడానికి ముందు వీరంతా రోజూ 9600 అడుగుల దాకా నడిచేవారు. ప్రయోగం చివరి నాటికి వీళ్లలో పదివేల అడుగుల బృందం లోని వాళ్లు సగటున 11,066 అడుగులు నడిచారు. 12,500 అడుగుల కోసం ఏర్పాటు చేసిన వాళ్లు, సగటున 13,638 అడుగులు నడిచారు. ఇక 15,000 అడుగుల నడక బృందంలోని వారు సగటున 14,557 అడుగులు నడిచారు.
అడుగులు పెంచినంత మాత్రాన నడక వీళ్లు బరువును తగ్గించలేకపోయింది. అయితే, స్పష్టంగా నడక ప్రయోజనాలు వాళ్లలోకనిపించాయి. , ఒకేచోట కూలబడకుండా బయటకు వచ్చి శారీరక శ్రమ చేయడవల్ల (శారీరక వ్యాయామం) పెరగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ముఖ్యంగా మానసికంగా ఉల్లాసంగా ఉండటం, బరువుతో సంబంధం లేని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు బాగా కనిపించాయి.
వాక్ ను నియమంచేయడంతో వీళ్లంతరు సోమరి జీవితం నుంచి బయపడటం ప్రయోగం లోకనిపించిన గొప్ప విశేషమని బ్రెయిలీ చెబుతున్నారు. 15,000 అడుగులు నడిచేవారిలో సోమరిజీవితం రోజుకు 77 నిమిషాలు తగ్గిందని, చాలా విశేషమని వారు చెప్పారు.
పనిలేసి సెడెంటరీ జీవితం( వ్యాయామనేది లేకుండా కదలకుండా ఒకే చోట కూలబడి ఉండే జీవితం) నుంచి బయటపడేందుకు వాకింగ్ బాగా పనికొస్తుంది. నడవడం…చాలా మంచిదేగా అంటున్నారు.దానికి బరువు తగ్గేందుకు అది బ్రహ్మసూత్రం మాత్రం కాదంటున్నారు.

(Featured Photo Source)