Home Features ప్రపంచంలో రెండో ‘చార్ మినార్’ ఎక్కడుంది?

ప్రపంచంలో రెండో ‘చార్ మినార్’ ఎక్కడుంది?

602
0
రెండో చార్ మినార్ అంటే ఆశ్చర్యమేస్తుందికదూ. మీరు చదువుతున్నది నిజమే. హైదరాబాద్ లో  చార్ మినారే కాకుండా, అదే పేరుతో మరొక చార్ మినార్ కూడా ఉంది .అది కూడా  బాగా పాపులరే. నిజానికి అదే పాపులర్ అనుకోవాలేమో! ఎందుకంటే, ఆ చార్ మినార్ కి  యునెస్కో హెరిటేజ్ మాన్యుమెంట్  గుర్తింపు వచ్చింది. ఎక్కువ చారిత్రక ప్రాముఖ్యం ఉండి,  నాలుగువందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న  హైదరాబాద్ చార్ మినార్ కు ఇంకా ఆ గుర్తింపు రాలేదు.
ఈ రెండో చార్ మినార్ (Chor minor) ఉజ్బెకిస్తాన్ లోని బుఖార  (BuKhara) పట్టణంలో ఉంది. దీని పేరు కూడా చార్ మినారే. దీనర్థం కూడా నాలుగు గోపురాలు (four towers)అనే. మీరి చిత్రమేమిటంటే దీనికి ప్రేరణ హైదరాబాద్ చార్ మినారే అని కూడా  చరిత్రకారులు చెబుతున్నారు.
Bukhara Chor Minor(credit Uzbek National PR centre)
దీనిని 1807 లో టర్కీకి చెందిన ఖాలీఫా నియాజ్ కౌలి అనే వ్యాపారస్థుడు బుఖారా పట్టణంలో నిర్మించాడు.  ఆ రోజుల్లో బుఖారా అంత  చారిత్రక ప్రాముఖ్యం ఉన్న పట్టణమేమి కాదు.ఇలాంటి వూర్లో కౌలి ఒక మదర్సా నిర్మించాడు. ఇందులో భాగమే ఈ చార్ మినార్. ఆ రోజు ఇరురు పొరుగు దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న వాస్తు శాస్త్ర పద్ధతులను పరిశీలించి ఈ చార్ మినార్ నిర్మాణం చెేపట్టాడు. ఇదొక అద్భత వాస్తువింతగా ఉండాలని కౌలి భావించాడు.
నిజానికి ఇంత పెద్ద నిర్మాణాన్ని ఈ పట్టణంలో ఎందుకు నిర్మించాడో అర్థం కాదు. సెంట్రల్ ఏషియాలో బుఖారా చాలా చారిత్రక, సాంస్కృతిక నగరం. ఉజ్బెక్ సాంస్కృతిక రాజధానిగా ఈ పట్టణానికి పేరుంది. దాదాపు 2500 సంవత్సరాల చెరగని చారిత్రక విశేషాలున్ననగరం ఇది. బుఖార అంటే ఆనందస్థలం (Happy place) అని పేరు. వివిధ చారిత్రక యుగాలకు చెందిన 140 కట్టడాలు బుఖార పరిసరాల్లో ఉన్నాయి.
 ఈ చార్ మినార్ వెనక ఒక పెద్ద మదర్సా ఉండేది. ఇక్కడ గొప్ప మదర్సా ఉందని చెప్పేందుకు  signpost గా  ఆయన ఈ ఎత్తయిన, అద్భుతమయిన చార్మినార్ ను నిర్మించి ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం.
మదర్సా లోకి వెళ్లేందుకు ఇది ముఖద్వారంగా పనిచేస్తుంది.  మదర్సాలో ఇది విడదీయరాని భాగమయింది. ఎందుకంటే, ఇందులో ఎత్తయిన డోమ్ తో ఉన్న పై అంతస్తు మదర్సా లైబ్రరీగా  ఉండింది.
credit:orientalarchitecture.com
కౌలీ పెద్ద వ్యాపారస్థుడు కాబట్టి చుట్టు పక్కల ఉన్న ముస్లిం  రాజ్యాలతో కచ్చితంగా సంబంధాలు పెట్టుకునే ఉంటాడని, ఇలాగే ఆయన హైదరాబాద్ లో ఉన్న చార్ మినార్ ను కూడా చూసి వుంటాడని చాలా మంది చరిత్ర కారులు చెబుతారు.
 ఆ రోజుల్లో అద్భుత కళాఖండంగా  ఉన్న హైదరాబాద్   చార్ మినార్ ఆయనకు బాగా నచ్చిఉంటుందని, అందుకే ఇదే నమూనాని తీసుకుని తన చార్ మినార్ నిర్మించాడని వారు  చెబుతారు.
స్వరూపంలో తప్ప ఇతర  ఏవిధంగా  బుఖారా చార్ మినార్ కు  హైదరాబాద్ చార్ మినార్ కు పోలికలుండవు. మిగతా నిర్మాణ  శైలి మొత్తం స్థానికమైనదే. ఈ ఎత్తయిన మినార్లను గుల్ దస్తా(Guldasta) అని పిలుస్తారు. ఈ నాలుగు మినార్లను తీస్తే, మిగతా విషయాల్లో  బుఖారా చార్ మినార్  ఇక్కడికి సమీపంలో నే ఉన్న  ఇస్మాయిల్ సామనీ సమాధిని పోలి ఉంటుంది. ఈ సమాధి  కొన్ని శతాబ్దాల పాటుమట్టిలో పూడిపోయి ఉండింది. 1930లోనే ఆర్కియాలజిస్టులు దీనిని తవ్వి  బయటపెట్టారు.
పేరుకు ఇది మదర్సా ముఖద్వారంగానే పనిచేసినా దీనిని మినార్లమీద ముస్లిమేతర మత చిహ్నాలున్నాయి. ఇందులో క్రిష్టియన్ మతానికి చెందిన చేప, భౌద్ధుడి ధర్మచక్రం ప్రధానమైనవి.అయితే,  ఇది భౌద్దచక్రం కాదని, రుబ్ ఎల్ హిజబ్ (Rub el hizb) అంటే అష్టకోణ నక్షత్రమని, ఇలాంటి  ఉజ్బెకిస్తాన్ లోని ఇస్లామ్ నిర్మాణాలన్నింటా కనిపిస్తుందని  మరికొందరు వాదిస్తారు. బఖరా చార్ మినార్ లోని మినార్ల పైభాగం నీలం  టైల్స్  పొదిగారు.  ఇవి పేరుకే మినార్లు గాని వీటిని స్టోర్ హౌస్ గానే ఇతరప్రయోజనాలకు వాడతారు. లోపుల  పెద్ద భవనాలంతటి ప్రదేశం ఉంటుంది.
ఈ చార్ మినార్ ను 1993లోనే యునెస్కో చారిత్ర విశేష కట్టడంగా గుర్తించింది.
1995లో ఈ చార్ మినార్  మొదటి వరస  ఎడమ  మినార్ కూలిపోయింది. దీనితో మొత్తం నిర్మాణం బలహీనపడింది. అపుడు ఉజ్బెక్ అధికారులు యునెస్కో సాయం కోరారు. యునెస్కో అందించిన 50 వేల డాలర్లతో ఈ మినార్ పునరుద్ధరించారు. అయితే, ఈ పునర్నిర్మాణంలో నాసిరకం స్టీలు, సిమెంటు వాడారని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వేరే విషయం.
అన్నట్లు ఉజ్బెకిస్తాన్ లో చాలా పాపులర్ ఆహారం ఏంటో తెలుసా. పులావ్. మన హైదరాబాద్ లో బిర్యానీ ఎంతపాపులరో, ఉజ్బకిస్తాన్ లో పులావ్ అంత పాపులర్. దేశమంతా పిలావ్ తయారు చేసిన  బుఖారా పులావ్ నే అంతా ఇష్టపడతారు.  దాన్ని Pilaf అని పలుకుతారు.

(Like this story? Share it with a friend!)