వైట్ హౌస్ లో దూరిన కరోనావైరస్, ట్రంప్ అంతరంగికుడు పాజిటివ్

చివరకు ఏ శత్రుదేశం చేయలేని పని కరోనా వైరస్ చేసింది. ప్రపంచంలో అత్యంత దుర్బేధ్యమయిన అమెరికా అధ్యక్ష భనవం ‘వైట్ హౌస్ ’లోకి వైరస్ ప్రవేశించింది. అందునా వెస్ట్ వింగ్ (West Wing)లోకి చొరబడింది. వెస్ట్ వింగ్ కంటే వైట్ హౌస్ గుండెకాయ. ఇందుల్ అధ్యక్షుడి కార్యాలయం (Oval Office),క్యాబినెట్ రూం, సిచువేషన్ రూం, రూస్ వెల్ట్ రూం ఉంటాయి.
ఇలాంటిచోటికి చొచ్చుకుపోయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతరంగికులలో ఒక అధికారిని కాటేసింది. అతగాడు కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ విషయాన్ని వైట్ హౌస్ మొదట దాచిపెట్టినా నిన్న అధికారికంగా ధృవకరీంచింది.
దీనితో ప్రెశిడెంట్ ట్రంప్ కూడా కరోనా దగ్గర్లనే ఉన్నారని అనుకోవాలి.
కరోనా ధృవీకరిస్తూ వైట్ హౌస్ ఒక ప్రకటన జారీ చేసి ఏంచెప్పిందంటే…
‘ వైట్ హౌస్ క్యాంపస్ లో పనిచేస్తున్న అమెరికా మిలిటరీ అధికారి ఒకరు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలినట్లు వైట్ హౌస్ మెడికల్ యూనిట్ సమాచారామందించింది,’ అని డిప్యూటీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ హోగన్ గిడ్లే ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
” We are recently notified by the White House Medical unit that a member of the United States Military unit, who works on the White House Campus has tested positive for Coronavirus.”
అయితే, దేశాధ్యక్షుడు , ఉపాధ్యక్షుడు ఇద్దరు తర్వాత కరోనానెగటివ్ అని తేలిందని, వారు ‘మాంచి’గా ఉన్నారని కూడా ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/icmr-says-no-for-ganga-water-fof-corona-treatment-proposals/

కరోనా పాజిటివ్ అని తేలిన మిలిటరీ అధికారి దేశాధ్యక్షుడి అంతరంగిక సిబ్బంది (valet)లో ఒకరు. ఈ హోదాకు మిలిటరీ వాళ్లనే ఎంచుకుంటారు. ఈ అంతరంగికుడు అధ్యక్షుడికి చాలా సన్నిహితంగా పనిచేస్తూ ఉంటారని వైట్ హౌస్ వెస్ట్ వింగ్ తో పాటు దేశాధ్యక్షుడు దేశపర్యటనకు రోడ్డెక్కినపుడు కూడా ఆయన ఆహారం, పానీయాల వ్యవహారాలను చూసుకునేది ఈ వ్యక్తే నని CNN రాసింది.
ఈ విషయాల్లోనే కాదు, అనేక వ్యక్తిగత వ్యవహారాలకు కూడా దేశాధ్యక్షుడు ఈ అంతరంగికుల మీద ఆధారపడుతుంటారు. చాలా కొద్ది మందికి మాత్రమే వైట్ హౌస్ లో దేశాధ్యక్షుడి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే అవకాశం లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో వైట్ హౌస్ అంతరంగికుడొకరు. ఇలాంటి అంతరంగికుడికి కరోనా వైరస్ సోకింది.
అయితే, ఈ వ్యక్తి ఎవరో వైట్ హౌస్ వెల్లడించలేదు. అసలు మొదట ఈ విషయాన్ని దాచి ఉంచే ప్రయత్నం చేశారు. ట్రంపు అంతరంగికుడొకరికి   కరోనా లక్షణాలు, అతన్ని పరీక్షిస్తే పాజిటివ్ లని తేలిందని బుధవారం నాడు  వైట్ హౌస్ ప్రముఖులకు  ఇబ్బందికరమయిన వార్తొకటి లీకయింది.
దీనితో వైట్ హౌస్ లో ఆందోళన మొదలయింది.
ఎందుకంటే, తనను కుట్టే పురుగింకా ప్రపంచంలో పుట్టనేలేదని డాంబికాలు చెప్పడం ట్రంప్ కు అలవాటు. అలాటంపుడు ఆయనకు రోజు ఆహారం వడ్డించి, కాసిన్ని పానీయాలు అందించే వ్యక్తికి కరోనా అంటే ఆందోళన కాక ఏమవుతుంది.
వెంటనే హౌట్ హౌస్ లో ఉండే ప్రముఖ సిబ్బంది అందరికి పరీక్షలు చేశారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ లకు కూడా పరీక్షలు నిర్వహించారు.
తాను రోజు పరీక్ష చేయించుకుంటున్నట్లు గురువారం నాడు ట్రంప్ అంగీకరించారు. అయితే, ఈ మధ్య లోకొద్ది రోజులు మిస్సయినానని కూడా ఆయన అంగీకరించారు.
అయితే, పాజిటివ్ అని తేలిన తన అంతరంగికుడితో తానంత సన్నిహితంగా ఉండనని, మొత్తానికి పరిస్థితి వింతగా ఉందని ట్రంప్ విలేకరులకు తెలిపారు.
వైట్ హౌస్ లో కరోనా పరీక్షలకు రాపిడ్ ఎబాట్ ల్యాబ్ టెస్ట్ ( Abbott Lab Test)ను వాడుతుంటారు.
అయితే, నెగెటివ్ రిజల్టు రావడం, ఎలాంటి రోగ లక్షణాలు కనిపించకపోవడమనేది కచ్చితంగా కరోనారాదనేందుకు ధీమా కాదని సిఎన్ ఎన్ వ్యాఖ్యానించింది.
ఒక వ్యక్తి లో కరోనా దూరాకా ఇంకుబేషన్ పీరియడ్ లో ఉంటుంది. అపుడు కరోనా టెస్ట్ నెగెటివే వస్తుంది. ఇంకుబేషన్ పీరియడ్ అనేది రెండు నుంచి 14 రోజుల దాకా ఉండవచ్చని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDCP) నిపుణులు చెబుతున్నారు. అంటే ట్రంప్ లో టెన్షన్ పెంచినట్లేగా!