Home Features ఉత్తరప్రదేశ్ లో అవినీతి భూకంపం: 69,000 మంది టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాం

ఉత్తరప్రదేశ్ లో అవినీతి భూకంపం: 69,000 మంది టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాం

328
0
ఉత్తర ప్రదేశ్ ను టీచర్స్ రిక్రూట్ మెంట్ కుంభకోణం కుదిపేస్తూ ఉంది. ఈ కుంభకోణం బయపటడతంలో టీచర్ ఉద్యోగాలొస్తాయని ఆశపడ్డ దాదాపు 69,000 నిరుద్యోగులకు నిరాశ ఎదురయింది.
అంతా సవ్యంగా జరిగిఉంటే వీళ్లంతా ఈ పాటికి ఉత్తర ప్రదేశ్ స్కూళ్లలో అసిస్టెంట్ టీచర్లయి, జీవితంలో స్థిరపడేందుకు పునాది వేసుకుని ఉండేవాళ్లు.అయితే, రిక్రూట్ మెంట్ విధానంలో కోట్ల చేతులు మారాయని తేలడంతో, దీనిని మీద దర్యాప్తుమొదలయింది. కోర్టు  రిక్రూట్మెంట్ మీద స్టే ఇచ్చింది. వాయిదా వేశారు. ఈ రిక్రూట్ మెంట్ గత ఏడాది జనవరిలో జరిగింది.
ఏడాది తర్వాత పలితాలు గత నెలలో వచ్చాయి. ఇక నియామకాలు జరుగుతున్నాయనుకునే టప్పటికి కుంభకోణం బయటపడింది. కొంతమంది కోర్టు కు వెళ్లారు. కోర్టు స్టే ఇచ్చింది.
ఇపుడు వివాదం ఎపుడు తేలుతుందో తెలియక నిరుద్యోగయువతీయువకులు సంక్షోభం పడిపోయారు. గత ఏడాది రిక్రూట్ మెంట్ ప్రకారం టీచర్ పోస్టులు తమకు వస్తాయారావా, వాటిని రద్దు చేస్తే మళ్ళీ నియామకాలు జరుగుతాయా జరగవా, అపుడు సెలెక్టవుతామా లేదా అని 69,000 మంది ఆందోళన చెందుతున్నారు.

సోషల్ డిస్టెన్స పాటిస్తే పార్లమెంటు చాలదు, వర్షాకాల సమావేశాలు లేనట్లే…

కొంతమంది ఎంపిక కాని విద్యార్థులు కుంభకోణం గురించి వెల్లడిచేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనితో అలహాబాద్ హైకోర్టు నియామకాల మీద స్టే ఇచ్చింది. టీచర్ల రిక్రూట్ మెంట్ కోసం నిర్వహించిన పరీక్షలో మల్టిపుల్ చాయస్ ప్రశ్నలకుఇచ్చిన సమాధానాలు ఒక్కటి కూడా సరిగ్గా లేవని, అంతా గందరగోళంగా ఉన్నాయని అభ్యర్థులు కోర్టుకు నివేదించారు.దానికితోడు టీచర్ ఉద్యోగాలు అమ్మెేసుకున్నారని ఆరోపణ.దీనిని రుజువచేస్తూ పోలీసులు కొందరిని అరెస్టు చేసి వారి దగ్గిర  నుంచి 22 లక్షలరుపాయల నగదు, లగ్జరీ కార్లను స్వాదీనం చేసుకున్నారు. అయితే,దర్యాప్తు జరుగుతున్నపుడు  కోర్టు స్టే ఇవ్వడం సరికాదని  రాష్ట్ర ప్రభుత్వం స్టేను సవాల్ చేసింది.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను నియమించింది.
ఈ టాస్క్ ఫోర్స్ పది మందిని అరెస్టు చేసింది. వీళ్లంతా టీచర్ ఉద్యోగాలిప్పిస్తామని అభ్యర్థుల నుంచి లక్షలాది రుపాయలు వసూలు చేస్తుండగా పట్టుబడ్డారని రాష్ట్ర ప్రాథమికవిద్యాశాఖ మంత్రి సతీష్ ద్వివేదీ తెలిపారు.
ఈ వ్యవహారన్నంతా నడిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కెఎల్ పటేల్. అతగాడు గతంలో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉన్నాడు. కాకపోతే రాష్ట్రమంతా విద్యాసంస్థలు నడుపుతూ చాలా పెద్ద వాడయ్యాడు.
ప్రియాంక గాంధ వీడియో కాన్ఫరెన్స్
ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ టీచర్ల కుంభకోణం మరొక మధ్యప్రదేశ్ వ్యాపం స్కాం వంటిదేనని అన్నారు. ఈ రోజు అనేక మంది బాధిత అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇందులో అభ్యర్థుల తమకు జరిగిన అన్యాయం గురించి, 69,000 అసిస్టెంట్ టీచర్ల నియమాకంలో జరిగిన అవకతవకల గురించి వివరించారు. టీచర్ల రిక్రూట్ మెంట్ లో జరిగిన కుంభకోణానికి వ్యతిరేంగా నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి ఆమె మద్దతు ప్రకటించారు.
టీచర్లు రిక్రూట్ మెంటు కోసం పరీక్ష 2019 జనవరి 6 తేదీన నిర్వహించారు. పరీక్షల ఫలితాలు ఈ ఏడాది మే 12 ప్రకటించారు.
బిఎస్ పి అధ్యక్షురాలు మాయావతి ఈ కుంభకోణం మీద సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.